బెడ్ పై వెల్లకిలా పడుకొని బొడ్డు చూపిస్తూ... బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి అందాల అరాచకం!

First Published Jan 1, 2023, 4:31 PM IST

టాప్ యాంగిల్ నుండి నాభి చూపుతూ హాట్ సెల్ఫీ దిగింది తేజస్వి. బోల్డ్ నెస్ లో బౌండరీలు దాటేసిన సదరు ఫోటో కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. 
 


సోషల్ మీడియాలో ఎంతగా అందాల విందు చేసినా తేజస్వినికి ఆఫర్స్ రావడం లేదు. ఆమె నటిగా దాదాపు ఫేడ్ అవుట్ అయినట్లే. గత ఏడాది ఆగస్టులో తేజస్వి మాదివాడ నటించిన కమిట్మెంట్ మూవీ విడుదలైంది. ఈ మూవీ ప్రమోషన్స్ పాల్గొన్న తేజస్వి కీలక విషయాలు వెల్లడించారు.బిగ్ బాస్ విన్నర్ కౌశల్ ఆర్మీ నన్ను భయంకరంగా ట్రోల్ చేశారు. కుటుంబ సభ్యులు  అవన్నీ చూసి నన్ను పట్టుకొని ఏడ్చారు. వేధింపులకు తట్టుకోలేక ముందుకు అలవాటు పడ్డాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు. 

Tejaswi Madivada


ఇక ఎన్నో ఆశలు పెట్టుకున్న కమిట్మెంట్ మూవీ సైతం ఆమెకు గుర్తింపు తేలేదు. చిత్ర ప్రమోషన్స్ లో తేజస్వి చేసిన కాంట్రవర్సీ కామెంట్స్ మాత్రం హైలెట్ అయ్యాయి. అడల్ట్ మూవీస్ లో నటిస్తే తప్పేంటి అన్న తేజస్వి మాదివాడ... ఆఫర్స్ వస్తున్నప్పుడు కూడా ఐస్ క్రీం లాంటి అడల్ట్ కంటెంట్ మూవీ చేశాను అన్నారు.  


కాగా తేజస్విని ప్రస్తుతం బీబీ జోడి అనే డాన్స్ రియాలిటీ షో చేస్తున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ తో బీబీ జోడీ డాన్స్ షో ఇటీవల స్టార్ మాలో స్టార్ట్ చేశారు. ఈ షోలో అఖిల్ సార్థక్ కి జంటగా తేజస్వి జోడీ కట్టారు.   

ఇక తేజస్వి మాదివాడ(Tejaswi Madivada) కెరీర్ పరిశీలిస్తే... మహేష్-వెంకటేష్ ల మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీతో తేజస్వి వెండితెరకు పరిచయమయ్యారు. ఆ మూవీలో గోదావరి జిల్లా అమ్మాయిగా తక్కువ నిడివి కలిగిన పాత్ర చేశారు. మహేష్ తో ఆమెకు కొన్ని డైలాగ్స్ ఉంటాయి కూడాను. అనంతరం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఐస్ క్రీం అనే అడల్ట్ కంటెంట్ మూవీ చేశారు.
 


ఐస్ క్రీం ఏమంత ఆడలేదు. కనీసం సెకండ్ హీరోయిన్స్ పాత్రలు కూడా తేజస్వికి దక్కలేదు. కేరింత, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, బాబు బాగా బిజీ లాంటి చిత్రాల్లో కొంచెం ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశారు. 2017లో  బాలకృష్ణుడు చిత్రం తర్వాత ఆమెకు చాలా గ్యాప్ వచ్చింది. 

Tejaswi Madivada


బిగ్ బాస్ సీజన్ 2(Bigg Boss Telugu) లో పాల్గొన్న తేజస్వి మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే ఆమె కనీసం ఫైనల్ కి కూడా వెళ్ళలేదు.హౌస్లో అందాల ప్రదర్శన పైనే దృష్టి పెట్టిన తేజస్వి మాదివాడ 7వ వారం ఎలిమినేట్ అయ్యారు. ఆ సీజన్ విన్నర్ గా కౌశల్ నిలిచాడు. 
 

ఇక హాట్ స్టార్ లో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ లో తేజస్వికి అవకాశం దక్కింది. ఓటీటీలో కూడా తేజస్వి ప్రభావం చూపలేకపోయారు. ఆమె తక్కువ రోజుల్లోనే ఎలిమినేట్ కావడం జరిగింది. కెరీర్ పరంగా ఆమెకు ఏమీ కలిసిరాలేదు. ఆడపడదా ఆఫర్స్ కూడా రావడం లేదు. కనీసం ఓటీటీలో అవకాశాలు వస్తాయని ఆశపడుతున్నారు.

click me!