అరియనా కోసం ఫ్యాన్స్ పూజలు.. అసలు ఇంతకీ ఏం జరిగింది!

First Published Mar 25, 2021, 1:54 PM IST


బిగ్ బాస్ రియాలిటీ షో యాంకర్ అరియనాకు భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. సీజన్ 4లో పాల్గొన్న అరియనా ఫైనల్ కి చేరిన సంగతి తెలిసిందే. మొత్తంగా అరియనా నాలుగవ స్థానంతో సరిపెట్టుకున్నారు. 
 

అరియనా గేమ్ చాలా మందికి నచ్చింది. ఫేక్ గేమ్ కి దూరంగా...  ఉన్నది ఉన్నట్లు చెప్పే, చేసే ఆమె యాటిట్యూడ్ కి మంచి మార్కులు పడ్డాయి. ఒక దశలో అరియనా విన్నర్ అంటూ ప్రచారం సాగింది.
undefined
బిగ్ బాస్ షో ద్వారా వచ్చిన పాపులారిటీ అరియానాకు ఆఫర్స్ తెచ్చిపెడుతున్నాయి. ఆమె బుల్లితెరపై బిజీ అవుతున్నారు. కొత్తగా మొదలైన కామెడీ స్టార్స్ షోలో కూడా అరియనా కనిపించి సందడి చేస్తున్నారు.
undefined
మరో వైపు తన యూట్యూబ్ ఛానల్ లో వీడియోలు చేస్తున్నారు. అలాగే యాంకర్ గా మంచి మంచి అవకాశాలు పెట్టేస్తున్నారు ఆమె. కెరీర్ స్మూత్ గా వెళుతున్న సమయంలో అరియనా చిన్న ఇబ్బందికి గురయ్యారు.
undefined
అరియానాకు జ్వరం రావడం జరిగింది. దీనితో ఆమె షూటింగ్స్, టీవీ షోలకు దూరమయ్యారు. తాను అనారోగ్యంతో బాధపడుతున్నట్లు అరియానా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి తెలియజేశారు.
undefined
దీనితో అరియనా ఫ్యాన్స్ వరుస సందేశాలు పంపారట. మీరు త్వరగా కోలుకోవాలని విషెష్ తెలియజేశారట. కొందరైతే ఏకంగా తన పేరున పూజలు చేశారని అరియనా తెలియజేశారు.
undefined
ప్రస్తుతం జ్వరం నుండి కోలుకున్న అరియనా... అనారోగ్యం బారినపడడం కూడా ఒకింత మంచిది అయ్యిందని అరియనా అంటున్నారు. దాని వలన తన అభిమానుల ప్రేమను తెలుసుకోగలిగానని ఆమె అన్నారు.
undefined
తనపై ఇంత ప్రేమ చూపించిన అభిమానులకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. జ్వరం నుండి పూర్తిగా కోలుకున్న అరియనా మరలా బిజీ అయినట్లు సమాచారం. ఆమె తిరిగి టీవీ షో షూటింగ్స్ లో పాల్గొంటున్నారట.
undefined
కామెడీ స్టార్స్ లో అరియనా మిత్రుడు అవినాష్ టీమ్ లో కనిపిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న స్కిట్స్ నవ్వులు పూయిస్తున్నాయి.
undefined
click me!