పవన్ కి ఎందుకు పిచ్చి పిచ్చి ప్రయోగాలు... బిగ్ బాస్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్!

First Published Jan 18, 2021, 3:22 PM IST


బిగ్ బాస్ ఫేమ్ అర్చన శాస్త్రి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  పవన్ కళ్యాణ్ కి ఎందుకు పిచ్చి పిచ్చి ప్రయోగాలని ఆమె ఫీలైనట్లు చెప్పారు. 

బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొన్న నటి అర్చన ఫైనల్ కి చేరడం జరిగింది. ఎన్టీఆర్ హోస్ట్ 2017లో  ప్రసారమైన ఆ షోలో అర్చన ఫైనలిస్ట్ గా 5వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
undefined
అర్చన 2004లో హీరోయిన్ గా తపన సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ నేను మూవీలో హీరోయిన్ గా నటించడం జరిగింది. అందరు తెలుగు అమ్మాయిలకు వలె అర్చనకు కూడా మెయిన్ హీరోయిన్ అవకాశాలు రాలేదు.
undefined
దీనితో ఆమె త్వరగానే హీరోయిన్ ఫ్రెండ్స్ పాత్రలు చేయాల్సి వచ్చింది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీలో హీరోయిన్ త్రిషా ఫ్రెండ్ రోల్ చేయగా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.
undefined
ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన యమదొంగ మూవీలో స్పెషల్ సాంగ్ లో ఎన్టీఆర్ తో కలిసి స్టెప్స్ వేశారు అర్చన.
undefined
కెరీర్ అనుకున్నంతగా సక్సెస్ కాకపోవడంతో పాటు అవకాశాలు తగ్గిపోవడంతో అర్చన 2019లో పెళ్లి కూడా చేసుకున్నారు.
undefined
కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న  అర్చన  బాలీవుడ్, టాలీవుడ్ లో తన ఫేవరేట్ హీరో ఎవరంటే ఇలా చెప్పుకొచ్చారు. బాలీవుడ్ లో అమితాబ్ అండ్ షారుక్ అంటే తనకు ఇష్టం అన్నారు.
undefined
టాలీవుడ్ లో చాలా మంది ఫేవరేట్ స్టార్స్ ఉన్నారన్న అర్చన... చిరంజీవి , ప్రభాస్ మరియు పవన్ కళ్యాణ్ పేరు చెప్పారు. ఖుషీ మూవీ నుండి ఒక అమ్మాయిగా ఆయనకు పెద్ద ఫ్యాన్ అన్నారు.
undefined
అయితే పవన్ కళ్యాణ్ అప్పట్లో చేసిన కొన్ని సినిమాలు తనకు నచ్చలేదని అర్చన చెప్పారు. పవన్ కళ్యాణ్ చేసే ప్రయోగాత్మక చిత్రాలు అర్చనకు నచ్చేవి కావట.  దానితో ఎందుకు ఈయన ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు అని ఫీలయ్యేదట.
undefined
అయితే పవన్ చేసిన ఆ పిచ్చి పిచ్చి ప్రయోగాలు ఏమిటో అర్చన చెప్పలేదు. ఇప్పుడు నేను నటిని, పరిశ్రమలో ఉన్నాను... ఆ విషయాలు చెప్పకూడని ఆమె తప్పించుకున్నారు.
undefined
ఖుషీ మూవీ తరువాత పవన్ క్రేజ్ భారీగా పెరుగగా... పవన్ ఆ తరువాత స్వీయ దర్శకత్వంలో జానీ అనే ప్రయోగాత్మక చిత్రం చేశారు. ఆ మూవీ అట్టర్ ప్లాప్ అయ్యింది. బహుశా అర్చన మాట్లాడింది ఈ మూవీ గురించే అయ్యుండొచ్చు.
undefined
click me!