ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో ఏడుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, ఆదిరెడ్డి, రోహిత్, శ్రీసత్య, ఇనయ, కీర్తి ఉన్నారు. వీరిలో శ్రీహాన్ ఫైనల్‌కి వెళ్లాడు. వీక్ కంటెస్టెంట్లలో రోహిత్, కీర్తి, శ్రీసత్య పేర్లు ప్రధానంగా ఉన్నాయి. వీరిలో రోహిత్‌గానీ, సత్యగానీ ఈ వారం ఎలిమినేట్ కావచ్చు అనుకున్నారు. కానీ ఇనయ పేరు లీక్ కావడం షాక్ కి గురి చేస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఇలాంటి లీక్‌లు ప్రతి వారం జరుగుతుంటాయి. లీక్ నిజమే అవుతుంది. అలానే ఇది కూడా నిజమే అయి ఉంటుందని మరో వాదన. ఏదేమైనా ఇనయ ఎలిమినేట్ అనేది నమ్మలేని విధంగా ఉండటం గమనార్హం.