పవన్ పై కోపంతోనే బండ్ల గణేష్ ఆ నిర్ణయం తీసుకున్నాడా?... భక్తుడు ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లాడే!

First Published Nov 30, 2022, 1:39 PM IST


నటుడు బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా రాజకీయాలపై తన వైఖరి తెలియజేశారు. ఇకపై రాజకీయాలు చేసేది లేదన్నాడు. ఇది  పవన్ అభిమానులను ఒకింత నిరాశకు గురి చేసింది. 
 

Pawan Kalyan

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి ఎవరంటే... వన్ అండ్ ఓన్లీ జగన్. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా జగన్ కి వ్యతిరేకంగానే పవన్ రాజకీయాలు సాగుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ ఏపీ సీఎం ఎన్నటికీ కాలేడు ఇది నా శాసనమన్న పవన్... మరోసారి అదే నినాదం ఎత్తుకున్నాడు. 2024లో సీఎం ఎలా అవుతాడో చూస్తా అంటున్నాడు. 


పవన్ కామెంట్స్ కి రోజా కౌంటర్ ఇచ్చారు. ఎంత మంది కలిసినా సీఎం జగన్ ని ఏమీ చేయలేరని, మళ్ళీ సీఎంగా గెలిచేది ఆయనే అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. పవన్ ని రోజా విమర్శించిన నేపథ్యంలో ఒక అభిమాని... రోజాకు సమాధానం చెప్పాలంటే మన బండ్ల గణేష్ కరెక్ట్ అంటూ... గతంలో బండ్ల గణేష్ టీవీ డిబేట్లో సీరియస్ గా వాదిస్తున్న వీడియో షేర్ చేశాడు. 
 

ఈ వీడియోపై బండ్ల గణేష్ స్పందించారు. రాజకీయాల వలన చాలా నష్టపోయాను. ఇకపై రాజకీయాలు చేసేది లేదని ట్వీట్ చేశారు. ఇది పవన్ అభిమానులను హర్ట్ చేసింది. అన్నీ వదిలేసి పవన్ చూడు ప్రజల కోసం పోరాడుతున్నాడంటూ బండ్లను ట్యాగ్ చేస్తూ మరొక అభిమాని ట్వీట్ చేశాడు. ఆయన స్థాయి నాకు లేదు. నేను అంత గొప్పోడిని కాదని మళ్ళీ బండ్ల గణేష్ రిప్లై ఇచ్చారు. 
 

రాజకీయాలంటే ఆత్మీయులను వదులుకోవాలి. శత్రువులను పెంచుకోవాలి, నా వల్ల కాదు. నేను అందరితో మంచిగా ఉంటాను. నాకు రాజకీయాల్లోకి మళ్ళీ రానని బండ్ల గణేష్ క్లియర్ గా స్పష్టం చేశారు. బండ్ల గణేష్ నిర్ణయం పవన్ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. పవన్ కళ్యాణ్ భక్తుడిగా.. బండ్ల గణేష్ ఆయన్ని డిపెండ్ చేస్తూ ఉంటాడు. పవన్ ని ఎవరైనా విమర్శిస్తే వెంటనే రియాక్ట్ అవుతాడు.


మంచి వాక్పటిమ కూడా ఉన్న బండ్ల గణేష్ తమ పార్టీకి బాగా ఉపయోగపడతారని వారి అభిప్రాయం. జనసేనకు బండ్ల గణేష్ మద్దతు ఉండాలి అని వారు కోరుకుంటున్నారు. జనసేనలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటే ఇంకా మంచిదని భావిస్తున్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉండగా... బండ్ల గణేష్ జనసేనలో చేరుతారని ఫ్యాన్స్ ఆశిస్తుండగా ఆయన లేటెస్ట్ కామెంట్స్ వారి ఆశలపై నీళ్లు చల్లాయి. 
 

Bandla Ganesh


మరోవైపు పవన్ కళ్యాణ్ తో బండ్ల గణేష్ కి చెడిందనే ప్రచారం జరుగుతుంది. భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానం అందలేదని దర్శకుడు త్రివిక్రమ్ ని బండ్ల గణేష్ తిట్టాడు. అప్పటి నుండి పవన్ బండ్ల గణేష్ ని దూరం పెట్టాడు. ఆ సంఘటన జరిగినప్పటి నుండి పవన్-బండ్ల గణేష్ కలవకపోవడం అనుమానాలకు బలమిస్తుంది. బండ్ల గణేష్ కామెంట్స్ కి కారణం కూడా పవన్ కళ్యాణ్ పై కోపమే అంటున్నారు కొందరు. 

click me!