మందులు వాడకుండా థైరాయిడ్ ను ఎలా కంట్రోల్ చేయాలి?

First Published | Apr 28, 2024, 9:49 AM IST

ప్రస్తుత కాలంలో థైరాయిడ్ సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఎంతో మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. థైరాయిడ్ ను కంట్రోల్ చేయడానికి ప్రతి ఒక్కరూ మందులను రెగ్యులర్ గా వాడుతుంటారు. కానీ కొన్ని చిట్కాలతో మీరు మందులు లేకున్నా ఈ వ్యాధిని కంట్రోల్ చేయొచ్చు. అదెలాగంటే?
 

మగవారితో పోలిస్తే ఆడవారికే థైరాయిడ్ సమస్య ఎక్కువగా వస్తుంది. ఈ వ్యాధిలో థైరాయిడ్ గ్రంథి శరీరంలో థైరాయిడ్ హార్మోన్లను అవసరమైన దానికంటే ఎక్కువగా ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీని వల్ల ఆడవారు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దీనిని నియంత్రించడానికి ఈ వ్యాధి ఉన్న ప్రతి ఒక్కరూ మందులను వాడుతుంటారు. కానీ మందులను వాడకున్నా మీరు దీన్ని కంట్రోల్ చేయొచ్చు. అదెలాగో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

థైరాయిడ్ సమస్యలు 

థైరాయిడ్ వల్ల ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారికి జీవక్రియ తగ్గుతుంది. అలాగే ఒంట్లో శక్తి స్థాయిలు తగ్గుతాయి. శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే పీరియడ్స్ సమస్యలు, జుట్టు సమస్యలు వస్తాయి. అలాగే మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. 
 

Latest Videos


foods for thyroid

పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం 

థైరాయిడ్ సమస్యలున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలో ఆహారం ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ అదుపులో ఉండాలంటే పచ్చి ఆకులు, బెర్రీలు, మజ్జిగ వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకోవాలి. ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. 

thyroid

థైరాయిడ్ ను ఎలా నియంత్రించాలి ?

థైరాయిడ్ ను నియంత్రించడానికి కొన్ని చిట్కాలు చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రెజర్ పాయింట్ బాగా సహాయపడుతుంది. ప్రెజర్ పాయింట్ ను నొక్కడం వల్ల థైరాయిడ్ అదుపులో ఉంటుంది. ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. ఇందుకోసం ముందుగా చేతుల చూపుడు వేళు, బొటనవేలు మధ్య భాగాన్ని 20 నుంచి 50 సార్లు ఒత్తిడికి గురిచేయండి. ఇలా రోజూ ఉదయాన్నే చేస్తే థైరాయిడ్ కంట్రోల్ లో ఉంటుంది.

ఉజ్జాయి ప్రాణాయామం 

ఉజ్జాయి ప్రాణాయామం కూడా థైరాయిడ్ ను నియంత్రించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది కూడా. మీరు దీన్ని ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రిపూట చేయొచ్చు.
 

thyroid

అనులమ, విలోమ ప్రాణాయామం

థైరాయిడ్ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి అనులోమ, విలోమ ప్రాణాయామం బాగా పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాదు ఇది ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. 

పుష్కలంగా నిద్ర.. 

థైరాయిడ్ సమస్యలున్నవారు పుష్కలంగా నిద్రపోయేలా చూసుకోవాలి. ఎందుకంటే నిద్ర ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీకు రాత్రి నిద్రలో సమస్యలు ఉంటే అది థైరాయిడ్ వ్యాధికి సంకేతం కావొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలసటను పోగొట్టడంలో నిద్ర చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే మీరు కంటినిండా నిద్రపోయేలా చూసుకోవాలి. 
 

click me!