అన్నాచెల్లి వైఎస్ జగన్, షర్మిల ఆస్తిపాస్తుల వివరాలివే... ఇద్దరిలో ఎవరు రిచ్?  

First Published Apr 28, 2024, 8:32 AM IST

ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. ఇప్పటికే వైఎస్ జగన్ పులివెందుల అసెంబ్లీ, వైఎస్ షర్మిల కడప లోక్ సభకు నామినేషన్ దాఖలు చేసారు. దీంతో వారిపాస్తుల వివరాలు బయటకు వచ్చాయి... ఇద్దరి ఆస్తుల ఎలా వున్నాయి? ఎవరు రిచ్?...

Andhra Pradesh

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభతో పాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచారం మరింత జోరందుకుంది. అయితే నామినేషన్ సందర్భంగా అభ్యర్థులు తమ ఆస్తిపాస్తులు, అప్పులు, కేసుల వివరాలను కూడా వెల్లడించారు. ఈ క్రమంలోనే రాజకీయ ప్రముఖుల వివరాలను తెలుసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. 

YS Jagan

అయితే ప్రస్తుతం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుల మధ్య పొలిటికల్ వార్ నడుస్తున్న విషయం తెలిసిందే. గతంలో అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా నిలిచిన వైఎస్ షర్మిల ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరి జగన్ పార్టీపై పోటీకి సిద్దమయ్యారు షర్మిల... కడప ఎంపీగా నామినేషన్ కూడా వేసారు. వైఎస్ జగన్ పులివెందుల నుండి పోటీ చేస్తున్నారు. 

YS Jagan Sharmila

వారసత్వంగా తనకు రావాల్సిన ఆస్తులను అన్న ఇవ్వడంలేదు అనేలా ఇటీవల షర్మిల కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అసలు ఈ అన్నాచెల్లి ఆస్తిపాస్తులపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే వైఎస్ జగన్, షర్మిల ఆస్తిపాస్తులపై ఓ లుక్కేద్దాం.   

YS Jagan

వైఎస్ జగన్మోహన్ రెడ్డి : 

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు సంపాదించాడని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. ఇక ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాధనాన్ని లూటీ చేసాడని ... తాడేపల్లి ప్యాలస్ లో ఖజానా నిండిపోయిందని ప్రతిపక్షనాయకులు తీవ్ర ఆరోపణలు చేస్తుంటారు. వైఎస్ జగన్ లక్షల కోట్ల అక్రమాస్తులు ఎక్కడినుండి వచ్చాయో విచారణ జరగాలని కోరుతుంటారు. 

YS Jagan

అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తనవద్ద లక్షల కోట్లు లేవని ... కేవలం రూ.779.8 కోట్లు మాత్రమే వున్నాయని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఎన్నికల సందర్భంగా పులివెందుల నుండి నామినేషన్ దాఖలుచేసిన వైఎస్ జగన్ తన ఆస్తిపాస్తుల వివరాలను బయటపెట్టారు. ఇందులోనూ  కేవలం వైఎస్ జగన్ పేరిట వున్న ఆస్తులు రూ.529.87 కోట్లు కాగా, ఆయన సతీమణి భారతి రెడ్డి పేరిట రూ.119.38 కోట్లు, కుమార్తెలు హర్షిణి రెడ్డి పేరిట రూ.24.26 కోట్లు, వర్షా రెడ్డి పేరిట రూ.23.94 కోట్ల చరాస్తులు వున్నాయి. 

YS Jagan

ఇక వైఎస్ జగన్ పేరిట రూ.46.78 కోట్లు, భారతి రెడ్డి పేరిట రూ.56.92 కోట్లు, ఇద్దరు కుమార్తెల పేరిట రూ.1.63  కోట్ల స్థిరాస్తులు వున్నాయి.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్ ఆస్తుల విలువ కూడా 41 శాతం పెరిగింది. 

YS Sharmila

వైఎస్ షర్మిల :  

వైఎస్ షర్మిల నామినేషన్ సందర్భంగా ఈసికి సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తిపాస్తుల వివరాలు వెల్లడించారు. దీన్ని పరిశీలిస్తే... అన్న వైఎస్ జగన్ కంటే చాలా తక్కువ షర్మిల ఆస్తులు వున్నారు. అంతేకాదు ఆమెకు, భర్త అనిల్ కు భారీగా అప్పులు వున్నాయి... అవికూడా అన్నావదిన జగన్, భారతి రెడ్డి, తల్లి విజయమ్మ వద్దే వున్నాయి. 

వైఎస్ షర్మిల పేరిట రూ.182.82 కోట్ల ఆస్తులు వున్నాయి. ఇందులో స్థిరాస్తులు రూ.9.29 కోట్లు, చరాస్తులు రూ.123 కోట్లు వున్నాయి. రూ.3 కోట్ల విలువైన బంగారం,  రూ.4.61 కోట్ల జెమ్ స్టోన్స్ ఆభరణాలు వున్నాయి. 

YS Sharmila

ఎస్ షర్మిల తన సొంత అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్ద రూ.82.58 కోట్ల అప్పు తీసుకున్నట్లు పేర్కొన్నారు. అలాగే వదిన వైఎస్ భారతి వద్ద షర్మిల రూ.19.56 లక్షలు అప్పు తీసుకుందట. ఇక షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అత్త వైఎస్ విజయమ్మ వద్ద రూ.40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. మొత్తంగా భర్తకు రూ.30 కోట్ల వరకు అప్పులు వున్నట్లు షర్మిల ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. 

YS Jagan Sharmila

ఇలా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారసులైన వైఎస్ జగన్, వైఎస్ షర్మిల మధ్య ఆస్తిపాస్తుల విషయంలో భారీ తేడా వుంది. వైఎస్ జగన్ కంటే షర్మిలకు చాలా తక్కువగా ఆస్తులు వున్నాయి. అలాగే కుటుంబసభ్యుల వద్దే అప్పులు వున్నాయి. 

click me!