ఐస్ క్రీం తిన్న తర్వాత ఏం చేయొద్దో తెలుసా?

First Published | Apr 28, 2024, 10:49 AM IST

మండుతున్న ఎండలకు చల్లచల్లగా ఐస్ క్రీం తినాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే రోజూ సాయంత్రం బయటకు వెళ్లి ఐస్ క్రీం తింటుంటారు. కానీ ఐస్ క్రీం తిన్న తర్వాత కొన్ని తప్పులు చేస్తే మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అవేంటంటే?

ఎండాకాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ చల్లగా తినడానికే ఇష్టపడతారు. ఇందులో ఐస్ క్రీం ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. అయితే చాలా మంది ఐస్ క్రీం తిన్న తర్వాత నీళ్లు తాగడమో లేదా మరేదైనా ఆహారాలను తినడమో చేస్తుంటారు. కానీ ఇలా చేయడం మీ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అసలు ఐస్ క్రీం తిన్న తర్వాత ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ఐస్ క్రీం తిన్న తర్వాత దాహం

మనలో  ప్రతి ఒక్కరికీ ఐస్ క్రీం తిన్న తర్వాత దాహంగా అనిపిస్తుంటుంది. ఇది చాలా కామన్. ఎందుకంటే ఐస్ క్రీం చక్కెర, సోడియంతో తయారవుతుంది. అందుకే దీన్ని తిన్న వెంటనే మనకు దాహంగా అనిపిస్తుంటుంది. అందుకే చాలా మంది ఇది తిన్న వెంటనే నీళ్లను తాగుతుంటారు. కానీ ఐస్ క్రీం తిన్న తర్వాత నీళ్లను పొరపాటున కూడా తాగకూడదు. ఎందుకంటే ఇది ఎండాకాలం జలుబుకు దారితీస్తుంది. మీ ఆరోగ్యానికి కూడా ఇది మంచిది కాదు. 

Latest Videos


వేడి వేడి ఆహారాలు

ఐస్ క్రీం తిన్న తర్వాత కొంతమంది వేడివేడిగా తినాలనుకుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చల్ల పదార్థాలు తిన్న వెంటనే వేడివేడిగా తినడం మానుకోవాలి. ఎందుకంటే ఇది మీ శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

సిట్రస్ పండ్లు 

ఐస్ క్రీం తిన్న తర్వాత మీరు కొన్ని రకాల పండ్లను తినడం కూడా మానుకోవాలి. ముఖ్యంగా నారింజ, ద్రాక్షపండు లేదా నిమ్మకాయలు వంటి సిట్రస్ పండ్లను ఐస్ క్రీం తిన్న వెంటనే తినకూడదు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. 
 

పెరుగు 

పెరుగు మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయినప్పటికీ.. ఐస్ క్రీం తర్వాత పెరుగును పొరపాటున కూడా తినకూడదు. ఒకవేళ మీరు పెరుగును తినాలనుకుంటే ఐస్ క్రీం తిన్న తర్వాత కొద్ది సేపు ఆగి తినండి. దీనివల్ల మీకు ఎలాంటి హాని జరగదు. 
 

టీ 

కొంతమంది ఏ ఫుడ్ తిన్నా వెంటనే టీ లేదా కాఫీని తాగుతుంటారు. కానీ ఐస్ క్రీం తర్వాత టీ మాత్రం పొరపాటున కూడా తాగకూడదు. ఎందుకంటే ఇది మీ జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలా అస్సలు చేయకండి.  అలాగే ఐస్ క్రీం తిన్న తర్వాత వేడి వేడి సూప్ లను తాగడం కూడా మానుకోండి. 

click me!