నందమూరి నట వారసుడిగా బాలయ్యబాబు టాలీవుడ్ లో సంపాదించుకున్న పేరు అందరికి తెలిసిందే. ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి తన సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకుంటూ వస్తున్నాడు బాలకృష్ణ. అయితే ఆయన వారసుడిగా మోక్షజ్ఞ మాత్రం రీసెంట్ గానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇక బాలయ్య కూతుర్లు ఇద్దరు సినిమాలకు సబంధం లేకుండా పెరిగారు.
Also Read: నన్ను పనిచేసుకోనివ్వండి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫైర్..
పెద్ద కూతురు బ్రాహ్మిణి నారావారి కోడులు అయ్యింది. మంత్రి లోకేష్ భార్యగా.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలిగా ఎన్నో బాధ్యతలు ఆమె మోస్తోంది. చిన్న వయస్సులోనే తమ ఫ్యామిలీ బిజినెస్ లను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తూ.. బిజినెస్ ఉమన్ గా ఉన్నారు. కుటుంబ వ్యాపార సంస్థ హెరిటేజ్ తో పాటు పలు సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక రీసెంట్ గా బాలయ్య చిన్న కూతురు తేజస్విని నిర్మాతగా మారారని సమాచారం. తమ్ముడు మోక్షజ్ఞ మూవీని ఆమె నిర్మిస్తున్నారట.
Also Read: సంపూర్ణేష్ బాబు ఎక్కడా..? ఇండస్ట్రీకి దూరం అయ్యాడా..? సినిమాలు ఎందుకు చేయడంలేదు..?
తాను అభిమానించే హీరో వేరే ఉన్నారట. అయితే ఇంకెవరు.. తన అన్న జూనియర్ ఎన్టీఆర్ అయ్యి ఉంటాడు అని అనుకోవచ్చు. కాని తారక్ కూడా కాదట. బ్రహ్మణికి ఇష్టమైన హీరో వేరే ఉన్నారట. ఆయన ఎవరో కాదు..మెగాస్టార్ చిరంజీవి. అవును చిన్నప్పటి నుంచి బ్రహ్మణి మెగా ఫ్యాన్ అని సమాచారం. చిరంజీవి సినిమాలు వదలకుండా చూస్తుందట. అంతే కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాలు కూడా అంతే ఇష్టంగా చూస్తుందట.
Also Read: రేవంత్ రెడ్డి వర్సెస్ అల్లు అర్జున్, డేంజర్ లో గేమ్ ఛేంజర్, రంగంలోకి మెగాస్టార్..?
Nara Brahmani and Tejashwini
చిరంజీవి డాన్సులు, డైలాగులు మెస్మరైజ్ చేస్తాయట. తండ్రి బాలయ్య కాకుండా ఆమెకు చిరంజీవి ఫేవరేట్ హీరో అట. ఇక ప్రస్తుతం ఈ ఫ్యామిలీ నుంచి మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే పనిలో ఉన్నారు. బాలయ్య ఈ పనిలోనే నిమగ్నమయ్యాడు. డాకు మహారాజ్ విడుదలయ్యాక పూర్తి స్థాయిలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ పై కసరత్తు చేసే అవకాశం ఉంది.హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: ఎమ్మెస్ నారాయణను మోసం చేసిన ఫిల్మ్ ఇండస్ట్రీ, మరణం తరువాత తప్పని అవమానం.?
దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగింది. ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞను పరిచయం చేస్తూ ఓ పోస్టర్ కూడా వదిలాడు. అయితే ఈసినిమా ఆగిపోయిందన్న టాక్ వినిపిస్తోంది. ఏదో విషయంలో బాలయ్య ప్రశాంత్ వర్మపై కోపంగా ఉన్నట్టు సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియదు కాని..మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం కాస్త ఆలస్యం అయ్యే విధంగానే కనిపిస్తోంది.