`గేమ్‌ ఛేంజర్‌` ఫస్ట్ రివ్యూ, హైలైట్స్ ఇవే.. రామ్‌ చరణ్‌కి జాతీయ అవార్డు పక్కా!

Published : Dec 22, 2024, 04:55 PM IST

రామ్‌ చరణ్‌, శంకర్‌ కాంబినేషన్‌లో వస్తున్న `గేమ్‌ ఛేంజర్‌` సినిమాకి సంబంధించి దర్శకుడు సుకుమార్‌ తన ఫస్ట్ రివ్యూ ఇచ్చారు. ఫ్యాన్స్ పూనకాలు తెప్పించే విషయం బయటపెట్టారు.   

PREV
15
`గేమ్‌ ఛేంజర్‌` ఫస్ట్ రివ్యూ, హైలైట్స్ ఇవే.. రామ్‌ చరణ్‌కి జాతీయ అవార్డు పక్కా!

రామ్‌ చరణ్‌ హీరోగా ప్రస్తుతం `గేమ్‌ ఛేంజర్‌` సినిమా రూపొందుతుంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ ఈ చిత్రాన్ని పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, అంజలి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతి విడుదల కాబోతుంది. `పుష్ప 2` తర్వాత రాబోతున్న మరో భారీ పాన్‌ ఇండియా మూవీ కావడం విశేషం. 
 

25

ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ తో టీమ్‌ బిజీగా ఉంటుంది. ఇటీవలే డల్లాస్‌లో ఓ ఈవెంట్‌ని నిర్వహించారు. అక్కడ అద్భుతమైన స్పందన వచ్చింది. తాను ఏపీ, తెలంగాణలో ఉన్నానా  అనిపించింది, అక్కడి ఫ్యాన్స్ ప్రేమ, ఆదరణ చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని రామ్‌ చరణ్‌ చెప్పారు. వారికోసం ట్రీట్‌ ఇవ్వబోతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో గెస్ట్ గా దర్శకుడు సుకుమార్‌ కూడా పాల్గొన్నారు. `పుష్ప 2`తో ఆయన ఇటీవలే పెద్ద హిట్‌ కొట్టాడు. త్వరలో ఆయన రామ్‌ చరణ్‌తోనే సినిమా చేయబోతున్నాడు.
 

35

అమెరికాలో `గేమ్‌ ఛేంజర్‌` సినిమా ఈవెంట్‌లో పాల్గొన్న సుకుమార్‌.. సినిమాకి ఫస్ట్ రివ్యూ చెప్పాడు. సినిమా ఎలా ఉండబోతుందో అనేది వెల్లడించారు. తాను చిరంజీవితో కలిసి సినిమా చూశాడట. ఫస్ట్ రివ్యూ తానే ఇస్తానని చెప్పాడు. ఫస్టాఫ్‌ అస్సాం అని, ఇంటర్వెల్ బ్లాక్‌ బస్టర్‌, సెకండాఫ్‌లో ఫ్లాష్‌ బ్యాక్ ఎపిసోడ్‌ చూస్తే గూస్‌ బంమ్స్ అని, ఫినామినల్‌ అని తెలిపారు సుకుమార్. 
 

45

తాను శంకర్‌ రూపొందించిన `జెంటిల్‌మేన్‌`,`భారతీయుడు` చిత్రాలు చూసినప్పుడు ఎంత ఎంజాయ్‌ చేశానో, అంతగా ఈ సినిమాని ఎంజాయ్‌ చేశానని తెలిపారు సుకుమార్. `రంగస్థలం` సినిమాలో రామ్‌ చరణ్‌ నటనకు నేషనల్‌ అవార్డు వస్తుందని భావించాను. రాలేదు.

కానీ ఈ సినిమాలోని క్లైమాక్స్ లో రామ్‌ చరణ్‌ ఎమోషనల్ సీన్స్ చూసినప్పుడు మళ్లీ అదే ఫీలింగ్‌ కలిగింది. ఇంకా చెప్పాలంటే దాన్ని మించి ఉంది. క్లైమాక్స్ లో చరణ్‌ ఎంత బాగా చేశాడంటే కచ్చితంగా ఆయనకు నేషనల్ అవార్డు వస్తుంది` అని తెలిపారు సుకుమార్‌. 

55

సినిమాపై ఇప్పటికే అందరిలోనూ మిక్స్ డ్‌ టాక్‌ ఉన్న నేపథ్యంలో సుకుమార్‌ మాటలు ఫ్యాన్స్ కి పెద్ద బూస్ట్ నిచ్చాయి. సినిమాపై నమ్మకాన్ని పెంచాయి. మరి సుకుమార్‌ చెప్పినట్టుగానే సినిమా ఉంటే సంక్రాంతికి మరో బ్లాక్‌ బస్టర్‌ రెడీ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పటికే ఈ మూవీ నుంచి గ్లింప్స్, ట్రైలర్‌ విడుదలై ఆకట్టుకున్నాయి.

ట్రైలర్ విషయంలో ఫ్యాన్స్ కొంత అసంతృప్తిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో మూవీ నుంచి మరో ట్రైలర్‌ని కూడా విడుదల చేయబోతున్నారట. అందుకోసం హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఈవెంట్‌, విజయవాడలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని ప్లాన్‌ చేస్తున్నారు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి పవన్‌, ట్రైలర్‌ ఈవెంట్‌కి చిరంజీవి గెస్ట్ లుగా హాజరు కాబోతున్నారు. సినిమా జనవరి 10న విడుదల కాబోతుంది. 

read more: మళ్లీ బుక్కైన అల్లు అర్జున్‌ ?.. వీడియోలు చూపిస్తూ ట్రోల్స్, తప్పులో కాలేస్తున్నారా?

also read: స్టార్‌ హీరోయిన్‌కి యాంకర్‌ ప్రదీప్‌ లవ్‌ లెటర్‌, ఛాన్స్ దొరికిందని రెచ్చిపోయాడు.. ఆమె రియాక్షన్‌ క్రేజీ
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories