సంపూకి ఆరోగ్యం బాగోలేదని.. ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అందుకే ఎలాంటి సినిమాలలో నటించలేదు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దాంతో అసలు ఏం జరుగుతుంది తన కెరీర్ లో.. అని సోషల్ మీడియాలో రకరకాల వార్తలు కూడా వినిపించాయి. మార్టిన్ లూథర్ కింగ్ సినిమా తరువాత ఆయన మళ్లీ ఎక్కడ కనిపించడం లేదు.
అయితే ఇండస్ట్రీ సమాచారం ప్రకారం.. సంపూర్ణేష్ బాబు రెండు సినిమాలో నటించాడట. ఈ సినిమాలు రిలీజ్ కు కొంత సమయం ఉండటంతో ఖాళీగా ఉండడం ఇష్టం లేక.. తన సొంత ఊరిలో తన కుల వృత్తి అయిన గోల్డ్ వర్క్ ను చేసుకుంటున్నాడని తెలుస్తోంది.