16 ఏళ్ళ తెలుగు అమ్మాయి హాలీవుడ్ లో హాట్ టాపిక్.. స్పిన్ తో తిప్పేస్తోంది!

First Published Aug 25, 2021, 5:13 PM IST

హాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఇండియన్ నటులు చాలా మందే ఉన్నారు. కానీ తెలుగు నేపథ్యం ఉన్న 16 ఏళ్ల అమ్మాయి హాలీవుడ్ ఓటిటిలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి.

హాలీవుడ్ లో సత్తా చాటుతున్న ఇండియన్ నటులు చాలా మందే ఉన్నారు. కానీ తెలుగు నేపథ్యం ఉన్న 16 ఏళ్ల అమ్మాయి హాలీవుడ్ ఓటిటిలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఆమెకు వరుస అవకాశాలు దక్కుతున్నాయి. ఆమె ఎవరో కాదు అవంతిక వందనపు. 

రీసెంట్ గా అవంతిక వందనపు.. డిస్ని హాట్ స్టార్ లో 'స్పిన్' అనే ఒరిజినల్  లో నటించింది. స్పిన్ వెబ్ సిరీస్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది. అవంతిక పెర్ఫామెన్స్ కు ప్రశంసలకు దక్కుతున్నాయి. 

అవంతిక బాల్యం నుంచే నటిగా రాణిస్తోంది. బ్రహ్మోత్సవం, మనమంతా, నాగ చైతన్య ప్రేమమ్ లాంటి చిత్రాల్లో నటించింది. ఆగష్టు 13 నుంచి స్పిన్ మూవీ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. 

స్పిన్ కు పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. స్పిన్ కి ప్రశంసలు.. హాలీవుడ్ లో అవకాశాలతో అవంతిక సంతోషంతో గాల్లో తేలిపోతోంది. అవంతికలో మరో ట్యాలెంట్ కూడా ఉంది. ఆమె ప్రొఫెషనల్ కూచిపూడి డ్యాన్సర్. 

పలు వేదికలపై డాన్స్ పెర్ఫామెన్స్ కి గాను అవార్డులు అందుకుంది. ఇక సోషల్ మీడియాలో తన క్యూట్ లుక్ తో పాపులర్ అవుతోంది అవంతిక. 

తెలుగు బ్యాగ్రౌండ్ తో హాలీవుడ్ లో ఆఫర్స్ అందుకుంటున్న అవంతికకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. 16 ఏళ్ల ఈ టీనేజ్ గర్ల్స్ రాను రాను ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. 

click me!