అనుపమా పరమేశ్వరన్‌ మైండ్‌ బ్లోయింగ్‌ పోజులు.. ఆ ముక్కు పుడకకి కుర్రాళ్ల హృదయాలు గల్లంతే..

First Published Jan 28, 2023, 3:00 PM IST

క్యూట్‌ బ్యూటీ అనుపమా పరమేశ్వరన్‌ ఓ వైపు కర్లీ హెయిర్‌తో, మరోవైపు క్యూట్‌ లుక్‌లో కట్టిపడేస్తుంటుంది. కవ్వించే పోజులతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొడుతుంటుంది. 
 

అనుపమా పరమేశ్వరన్‌ తాజాగా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. డిఫరెంట్‌ గెటప్స్ లో దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకుంది. విభిన్నమైన భంగిమల్లో దిగిన పోజులతో మంత్ర ముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం నెట్టింట రచ్చ లేపుతుంది. ఇందులో ఆమె డిఫరెంట్‌ డ్రెస్సులు ధరించి, వివిధ సమయాల్లో దిగిన ఫోటోలను పంచుకోగా, అవి కుర్రాళ్లని కట్టిపడేస్తుండటం విశేషం. 

ముఖ్యంగా కర్లీ హెయిర్‌, ముక్కు పుడక హైలైట్‌గా నిలుస్తుంది. ఈ దెబ్బకు కుర్రాళ్ల హృదయాలను గల్లంతు చేస్తుంది అనుపమా పరమేశ్వరన్‌. అనుపమా క్యూట్‌ అందాలతో పాపులర్‌ అయ్యింది. అయితే రాను రాను ఆమె హాట్‌ యాంగిల్‌ని ఆవిష్కరిస్తుంది. పదహారణాల పడుచు పిల్లలా పోజులిస్తూ నెటిజన్లని టెంప్ట్ చేస్తుంటుంది అనుపమా. ఆమె ఇచ్చే వొంపు సొంపుల లుక్స్ కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటాయి. 
 

ఈ లేటెస్ట్ పిక్స్ `18పేజెస్‌` చిత్రంలోని కావడం విశేషం. ఈ చిత్రం శుక్రవారం నుంచి స్ట్రీమింగ్‌ అవుతుంది. దీనికి విశేష స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపింది అనుపమా పరమేశ్వరన్‌. అంతేకాదు ఫోటోలకు సంబంధించిన ప్రత్యేకతని ఆమె వివరించడం విశేషం. 

ముఖ్యంగా సన్నని నడుముని వయ్యారంగా తిప్పుతూ పంచుకునే పిక్స్ దిమ్మ తిరిగేలా, మత్తెక్కించేలా ఉంటుండటం విశేషం. అందుకే కుర్రాళ్లనే టార్గెట్‌గా ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. అదరగొడుతుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంటుంది. ఇప్పుడు మల్టీఫుల్‌ లుక్స్ లో హంట్‌ చేస్తుందీ అందాల తార. 
 

అనుపమా పరమేశ్వరన్‌.. క్రమంగా హాట్‌ డోస్‌ పెంచుతుంది. అలాగని స్కిన్‌ షో చేయడం లేదు. కట్టుబొట్టులోనే హాట్‌నెస్‌ని ఆవిష్కరిస్తుంది. టీనేజర్ల డ్రీమ్‌ గర్ల్ గా మారిపోతుంది. ఈ బ్యూటీ గ్లామర్‌ ఫోటోలకు సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉందంటే అతిశయోక్తి కాదు. ఆమె టెంప్టింగ్‌ పోజులే కారణమని చెప్పొచ్చు. 

ఇక ఇటీవల వరుసగా విజయాలు అందుకుంది అనుపమా పరమేశ్వర్‌, `కార్తికేయ2`, `18పేజెస్‌` చిత్రాలతో ఆకట్టుకుంది. అలాగే `బట్టర్‌ఫ్లై` చిత్రంలోనూ అదరగొట్టింది. సినిమాని తన భుజాలపై మోసి మెప్పించింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. ఇప్పుడు మరిన్ని సినిమాల్లో భాగమవుతుంది. 
 

గ్లామర్‌ పరంగానూ కాస్త ఓపెన్‌ కావడంతో ఈ బ్యూటీకి కమర్షియల్‌ సినిమాల నుంచి ఆఫర్లు వస్తున్నట్టు టాక్‌. మరి అందాల ఆరబోతకి సిద్ధమవుతుందా? అనేది చూడాలి. అయితే ఈ బ్యూటీ ఇప్పటి వరకు యంగ్‌ హీరోలతోనే చేసింది. స్టార్‌ హీరోలతో సినిమాలు పడలేదు. ఒకటి రెండు పడితే స్టార్‌ హీరోయిన్ గా నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుందని చెప్పొచ్చు. 
 

click me!