బన్నీ సినిమాని కన్ఫమ్‌ చేసిన అనసూయ.. మరో `రంగమ్మత్త` అవుతుందా?

First Published Apr 22, 2021, 10:45 AM IST

అనసూయ చాలా రోజులుగా అల్లు అర్జున్‌ నటిస్తున్న `పుష్ప` చిత్రంలో నటించబోతుందనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ హాట్‌ యాంకర్‌ దాన్ని కన్ఫమ్‌ చేసింది. అయితే ఈ సారి `రంగమ్మత్త`ని మించి అలరించబోతుందట అనసూయ. 
 

సెక్సీ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అనసూయ `జబర్దస్త్` షోతో పాపులర్‌ అయ్యింది. ఆ షోతో వచ్చిన క్రేజ్‌ని క్యాష్‌ చేసుకోవాలనుకుంటున్నారు ఫిల్మ్ మేకర్స్. ఈ అమ్మడికి మంచి ఆఫర్స్ ఇస్తున్నారు.
undefined
అంతకు ముందు చాలా సినిమాల్లో కనిపించిన అనసూయకి నటిగా గుర్తింపుని, క్రేజ్‌ని తీసుకొచ్చింది మాత్రం `రంగస్థలం` అనే చెప్పాలి. ఈ సినిమాతో ఆమె తనని తాను ఓ కొత్త నటిగా ఇండస్ట్రీకి పరిచయం చేసుకుంది. అనసూయ అంటే అందమే కాదు, హాట్‌ నెస్‌ మాత్రమే కాదు, అంతకు మించిన అద్బుతమైన నటి అని నిరూపించుకుంది. ఇండస్ట్రీకి చాటి చెప్పింది.
undefined
ఈ క్రమంలోనే అనసూయ వరుసగా బిగ్‌ ఆఫర్స్ వస్తున్నాయి. చిరంజీవి, అల్లు అర్జున్‌, రవితేజ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లో అవకాశాలు తెచ్చిపెట్టాయి. కేవలం తెలుగులోనే కాదు, తమిళం, మలయాళంలోనూ నటించే అరుదైన అవకాశాలను తెచ్చిపెట్టింది.
undefined
ప్రస్తుతం చిరంజీవితో `ఆచార్య`లో, అల్లు అర్జున్‌తో `పుష్ప`లో, కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ` చిత్రాల్లో నటిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అనసూయ మాత్రం కన్ఫమ్‌ చేయలేదు.
undefined
తాజాగా `పుష్ప` చిత్రాన్ని కన్ఫమ్‌ చేసింది. ఇందులో తాను కీలక పాత్ర పోషిస్తున్నట్టు తెలిపింది. తాను బుధవారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటున్న సందర్భంగా ఆయా క్లాప్‌ బోర్డ్ ని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటూ, మంచి రోజులు ముందున్నాయి. మళీ షూటింగ్‌లో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉంది. సుకుమార్‌తో, అల్లు అర్జున్‌తో, మైత్రి మూవీస్‌లో పనిచేస్తున్నందుకు మరింత హ్యాపీగా ఉంది` అని తెలిపింది అనసూయ.
undefined
`రంగస్థలం`లో రంగమ్మత్తగా అనసూయ అద్భుతమైన నటనని ప్రదర్శించి వాహ్‌ అనిపించింది. మరి మరోసారి సుకుమార్‌ దర్శకత్వంలో చేస్తున్న `పుష్ప`లో మరోసారి రంగమ్మత్త తరహాలో బలమైన పాత్రలో మెరుస్తుందా? ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తుందా ? అన్నది చూడాలి.
undefined
దీంతోపాటు అనసూయ తాను మెయిన్‌ లీడ్‌గా `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది ఓటీటీలో రిలీజ్‌ కాబోతుంది. అలాగే రవితేజతో `ఖిలాడి` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో విజయ్‌ సేతుపతితో ఓ సినిమా చేస్తుంది. దీంతోపాటు మలయాళంలో మమ్ముట్టితోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు టాక్‌. దీన్ని కన్ఫమ్‌ చేయాల్సి ఉంది.
undefined
`జబర్దస్త్` షోలో ఈ అమ్మడికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందచందాలతో షోని రక్తికట్టిస్తుంది.
undefined
click me!