Jabardasth: 9ఏళ్ల తర్వాత అనసూయకు అది అవమానమని గుర్తొచ్చిందా?... చౌకబారు సాకులపై పేలుతున్న సైటైర్లు!

Published : Aug 14, 2022, 05:41 PM IST

అనసూయ కేర్ ఆఫ్ జబర్దస్త్. ఈ కామెడీ షోకి ముందు అనసూయ అంటే ఎవరికీ తెలియదు. ఒకప్పుడు ఆమె సాక్షి టీవీలో న్యూస్ ప్రెజెంటర్ గా చేశారని గుర్తింపు వచ్చాక చెబితే కానీ తెలియదు. అంటే జబర్దస్త్ అనే షో లేకపోతే అనసూయ లేదు... స్టార్ యాంకర్ హోదా ఉండేది, సినిమాల్లో అవకాశాలు వచ్చేవి కావు.   

PREV
17
Jabardasth: 9ఏళ్ల తర్వాత అనసూయకు అది అవమానమని గుర్తొచ్చిందా?... చౌకబారు సాకులపై పేలుతున్న సైటైర్లు!
Anasuya Bharadwaj

జబర్దస్త్(Jabardasth) లేకపోతే అనసూయతో పాటు ఇప్పుడు సెలెబ్రిటీలుగా చలామణి అవుతున్న రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, మహేష్, రచ్చ రవి, చమ్మక్ చంద్ర ఇలా చాలా మందికి కెరీర్ ఉండేది కాదు. పదుల సంఖ్యలో ఆ షో ద్వారా అప్ కమింగ్ కమెడియన్స్, నటులు వెలుగులోకి వచ్చారు. ఆర్థికంగా, కెరీర్ పరంగా ఒక స్థాయికి వెళ్లారు.

27

రికార్డు టీఆర్పీతో 9 ఏళ్ళు తిరుగులేకుండా సాగిన జబర్దస్త్ ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటుంది. జబర్దస్త్ అనే వటవృక్షం క్రింద ఎదిగిన స్టార్స్ వివిధ కారణాలతో వెళ్లిపోయారు. తాజాగా యాంకర్ అనసూయ(Anasuya) సైతం షోకి గుడ్ బై చెప్పేశారు. అనసూయ స్థానంలో రష్మీ(Rashmi Gautam) యాంకర్ గా కొనసాగుతున్నారు. 
 

37
Anasuya Bharadwaj


అనసూయ జబర్దస్త్ నుండి వెళ్లిపోవడం అనేది పెద్ద న్యూస్. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ ఆమె నిష్క్రమణ వెనుక కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఎట్టకేలకు అనసూయ నోరు విప్పారు. కారణాలు ఇవేనంటూ వెల్లడించారు. ఈ క్రమంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ విమర్శలపాలవుతున్నాయి. 

47

చాలా వరకు జబర్దస్త్ షో గురించి, దాని నిర్మాతలు, టీం లీడర్స్ గురించి పాజిటివ్ గానే మాట్లాడిన అనసూయ... తనకు ఎదురైన కొన్ని అవమానాలను కూడా తెరపైకి తెచ్చారు. కొందరు కమెడియన్స్ హద్దులు దాటి తనపై కామెంట్స్ చేశారు. నేను కొన్ని సందర్భాల్లో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నానని చెప్పారు. అలాంటి అవమానాలు నేను భరించలేను. నా అసహనం మాత్రం ఎడిటింగ్ లో తీసేసి ప్రేక్షకులు తెలియనిచ్చేవారు కాదన్నారు.

57

అనసూయ చేసిన ఈ కామెంట్ పై విమర్శలు వెల్లువెత్తున్నాయి. తొమ్మిదేళ్ల తర్వాత నీకు అవి అవమానంగా అనిపించాయా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ నీకు ఇంతటి ఫేమ్, నటిగా సినిమా అవకాశాలు లేకుంటే... జబర్దస్త్ లో అవమానిస్తున్నారని వదిలేసే దానివా? అని నిలదీస్తున్నారు. ఏరు దాటాక తెప్ప తగలేసిన తీరుగా... కెరీర్ లో సెటిల్ అయ్యాక జబర్దస్త్ ని వదిలేసిందని ఎద్దేవా చేస్తున్నారు. 
 

67


అంతకంటే దారుణమైన విమర్శలు అనసూయ పబ్లిక్ తో పాటు కొందరు ప్రముఖుల నుండి ఎదుర్కొన్నారు. జబర్దస్త్ షోలో అనసూయ ధరించే బట్టలపై లెక్కకు మించిన వివాదాలు తలెత్తాయి. నా బట్టలు నా ఇష్టం అని తిప్పికొట్టిన అనసూయ... బాడీ షేమింగ్ కారణంగా షో వదిలేశానని చెప్పడం విడ్డూరం. ఎందుకంటే అనసూయ షోలో ధరించే బట్టలు కూడా డైరెక్టర్స్ సూచన మేరకే వేసుకుంటారు. ఆమె సొంత నిర్ణయం ఏమీ ఉండదు. 

77

అనసూయ చెబుతున్న కారణాలు కేవలం సాకులు మాత్రమే. ఆమెకు మిగతా షోలలో ఇచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ జబర్దస్త్ కి ఇస్తానంటే మళ్ళీ ఎగిరి గంతేసి వచ్చేస్తారు. అగ్రిమెంట్ ముగిసే వరకు వేచి చూసిన ఆమె చల్లగా జారుకున్నారు. బెటర్ కెరీర్ కోసం ఎవరైనా ఉత్తమమైన మార్గాలు ఎంచుకోవడంలో తప్పు లేదు. కానీ ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం సరికాదంటున్నారు. 

Read more Photos on
click me!

Recommended Stories