Intinti Gruhalakshmi: సామ్రాట్ వాళ్ళని పండుగకు పిలిచిన తులసి.. లాస్య వలలో అనసూయ పడనుందా?

First Published Oct 8, 2022, 2:37 PM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు అక్టోబర్ 8వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..
 

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే..తులసి సామ్రాట్ తో, ఈ ఫైల్స్ అంత అవసరమైనవి కాదు కదా! దానికోసం మీరు ఇక్కడికి రారు. ఒకవేళ అవసరమైనవే అయినా సరే ఆఫీస్ బాయ్ ని పంపించి తీసుకెళ్లొచ్చు కదా. ఇప్పుడు నిజం చెప్పండి ఎందుకు వచ్చారు అని అనగా, నిజం చెప్పాలనే నాకు ఉన్నది కానీ నిజమనే పదాన్ని వింటేనే భయం వేస్తుంది. కానీ ఫైల్స్ కోసం మాత్రం కచ్చితంగా రాలేదు అని అంటాడు సామ్రాట్.దానికి తులసి,మీరు తప్పు ఏమీ చేయలేదు ఎందుకు అలాగా ఉంటున్నారు. నిజంగా నన్ను ఆ పోస్టులో నుంచి తీసి మంచి పని చేశారు.లేకపోతే నేను ప్రతిరోజు ఏ తప్పు చేస్తానేమో అని భయంతో ఉండాల్సి వచ్చేది. అయినా బయటే నించోపెట్టి మాట్లాడేస్తున్నాను. లోపలికి రండి కాఫీ తాగుదామని అనగా,వద్దులెండి నేను ఆఫీస్ కి వెళ్ళాలి ముఖ్యమైన పని ఉంది అని సామ్రాట్ అంటాడు.

అప్పడు తులసి, అవును మాటల్లో చెప్పడం మర్చిపోయాను రేపు కాలనీలో బతుకమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి. మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను కానీ మీరే వచ్చారు కదా! రేపు మీరు, హనీ ఖచ్చితంగా రండి. నేను మీ దగ్గర పని చేయకపోయినా మనం స్నేహితులం కదా. ఆ స్నేహాన్ని ఎప్పటికీ విడగొట్టలేరు అని అనగా, నాకు మీ ఆనందమైన ప్రపంచంలోకి రావాలనే ఉన్నది. కానీ నేను రాలేను అని  మనసులో అనుకొని, రేపు నాకు పనున్నది తులసి గారు. కావాలంటే హానిని పంపిస్తాను అని సామ్రాట్ అంటాడు. దానికి తులసి సరే అని అంటుంది. ఆ తర్వాత సీన్లో లాస్య ఇంట్లో కూరగాయలు కోస్తూ ఆలోచిస్తూ, సామ్రాట్ తులసికి అంత అన్యాయం చేసినా సరే మొసల్ది ఏమి అనలేదు ఏంటి? రఛ్చ చేయాలి కదా? అంత సైలెంట్ గా ఉంది‌ అంటే బయటకు తెలియకుండా అత్తా కోడలు మధ్య ఏవైనా జరుగుతున్నాయా! ఇప్పుడు కురుక్షేత్రంలో కృష్ణుడి ఎటువైపు ఉంటే అటువైపు వాళ్లే గెలిచినట్టు.

 ఇది ఎటువైపు ఉంటే వాళ్ళదే పై చేయి.ఎలాగైనా మన వైపు తిప్పుకోవాలి అని లాస్య అనుకుంటుంది. అప్పుడు లాస్య నందుకి చెప్పి ఫోన్ చేపిద్దాం అనుకున్నప్పుడు, నందు ఫోన్ చేయనివ్వడు, న్యాయంగా వెళ్ళలనుకుంటాడు తప్ప వాళ్ళు అన్యాయం అయితే చూడలేదు అనుకోని లాశ్యే అనసూయ కి ఫోన్ చేస్తుంది. మొదటిసారి చేసినప్పుడు అనసూయ,ఈ కంచు ముఖం నాకెందుకు చేసింది అని ఫోన్ పెట్టేస్తుంది.మళ్ళీ రెండోసారి చేస్తున్నప్పుడు ఫోన్ ఎత్తగా, ఎందుకు ఫోన్ చేసావు అని అనసూయ అడుగుతుంది‌. ఎంతైనా మీరు మా ఇంటి దీపం కదా అత్తయ్య.
 

మిమ్మల్ని మేము ఎప్పుడూ మర్చిపోలేము ఎప్పుడైతే సామ్రాట్ గారు నందు కి మేనేజర్ పోస్ట్ ఇచ్చారో అప్పటినుంచి నందు మీ పేరే తలచుకుంటున్నాడు. నీఘ గురించి ఆలోచిస్తూ, మా అమ్మ ఆశీర్వాదం వల్లే నాకు ఇదంతా జరిగింది ఎలాగైనా అమ్మ చేత పూజ చేపించాలి అని అంటున్నాడు. మీరు వస్తే బాగుంటుంది కదా అని అనగా, నామీద ప్రేమ ఎప్పుడు నుంచి మొదలైంది? నేను రావడం కుదరదు కానీ రేపు మా కాలనీలో పండగ ఉన్నది మీరే అక్కడికి రండి అప్పుడు చూధ్ధాం అని ఫోన్ పెట్టేస్తుంది అనసూయ. అప్పుడు లాస్య మనసులో, ఎలాగైనా సామ్రాట్ ని కూడా అక్కడికి రప్పిస్తే అప్పుడు నా ప్లాన్ ఫాలిస్తుంది అని అనుకుంటుంది.
 

 తర్వాత జరిగిన విషయం అంతా నందు కి చెప్పగా, నిజంగా అమ్మ ఒప్పుకున్నాదా అని నందు ఆశ్చర్యపోతాడు. ఆ తర్వాత రోజు ఉదయం ఇంట్లో వాళ్ళందరూ బతుకమ్మ పండుగ కోసం అన్ని పనులు సిద్ధం చేస్తూ ఉంటారు. ఇంతలో పిల్లలందరూ డాన్సులు వేస్తూ ఉండగా ప్రేమ్ వచ్చి పువ్వులన్ని తెస్తాడు. అప్పుడు ప్రేమ్, మా పని అయిపోయింది ఇంక మీరే డాన్సులు నేర్చుకోవాలి అనుకుంటా అని అనగా శృతి, మా ఆంటీ మాకు అన్ని నేర్పిస్తారు అని అంటుంది. అప్పుడు దివ్య బతుకమ్మ గురించి చెప్పమ్మా అని అనగా, తులసి బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తారో చెప్తుంది. 
 

ఆ తర్వాత సీన్లో హనీ తన ఇంట్లో రెడీ అవుతూ ఉంటుంది.అప్పుడు వాళ్ళ తాతయ్య, ఉదయం నుంచి రెడీ అవుతూనే ఉన్నావు అమ్మా ఏదో కొత్త పెళ్లికూతురు అత్తింటికి వెళ్లినట్టు. నువ్వు వెళ్ళేది తులసి వాళ్ళింటికి కదా అంత తయారవడం ఎందుకు అని అనగా, నువ్వు వచ్చి జడ వెయ్యు తాతయ్య  అని అంటుంది హనీ. నాకు రాదమ్మ అని వాళ్ళ తాతయ్య అనగా, మీకు రాదు కదా నా పనులన్నీ నేనే చేసుకోవాలి .మా గురించి మీకేం తెలుసు. మేము మ్యాచింగ్ డ్రెస్సు, గాజులు, పట్టీలు, నెయిల్ పాలిష్ అన్ని వేసుకోవాలి.
 

 నెత్తి మీద రెండు ఎంట్రుకలు కూడా లేవు మా బాధ నీకేం తెలుస్తుంది అని అనగా, అనవసరంగా వచ్చి ఇరుక్కుపోయినట్టున్నాను త్వరగా రెడీ అవ్వమ్మ బయట ఉంటాను అని ఎస్కేప్ అయిపోతాడు వాళ్ల తాతయ్య. బయట సామ్రాట్ ఎదురుచూస్తూ ఉండగా హనీ ఏది అని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ ని అడుగుతాడు. రాణి గారు ఇంకా తయారవుతున్నారు అని వాళ్ళ బాబాయ్ అనగా, చెప్పిన టైంకి వెళ్లకుండా ఉంటే బాగోదు కదా బాబాయ్ తులసి గారికి ఫోన్ చేసి ఇంకొక పది నిమిషాల్లో వస్తాము అని చెప్పండి అని అనగా, నువ్వే వెళ్లి చెప్పొచ్చు కదా అని వాళ్ల బాబాయ్ సామ్రాట్ తో అంటాడు.
 

నాకు మాట్లాడాలని ఉన్నది బాబాయ్ కాని తులసి గారికి ఇబ్బంది క్రియేట్ చేయడం నాకు నచ్చదు అని వెళ్ళిపోతాడు సామ్రాట్. తర్వాత తులసి కుటుంబమంతా గుడికి వస్తుంది.అప్పుడు నందు లాస్య కూడా అక్కడికి రావడం చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, వీళ్లు ఎందుకు ఇక్కడికి వచ్చారు అన్నట్టుగా మోఖాలు పెడతారు. అప్పుడు అనసూయ లాస్య వాళ్లకి హాయ్ చెప్తుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!

click me!