మొదట్లో వీరి సంసారం సంతోషంగా సాగినప్పటికీ, 1970 తర్వాత మనస్పర్థలు వచ్చి 1977లో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు పూజా, సిద్ధార్థ్ అనే పిల్లలు ఉన్నారు. అనారోగ్యంతో సిద్ధార్థ్ 1977లో చనిపోయాడు. కొడుకు మరణం ప్రతిమను డిప్రెషన్ లోకి నెట్టింది.
ఆ తర్వాత ఆమె హిమాలయాలకు తీర్థయాత్రకు వెళ్లింది. ఉత్తరాఖండ్ లో 1998లో ప్రతిమ చనిపోయిందని చెబుతారు. గతంలో విడాకుల గురించి మాట్లాడుతూ ప్రతిమ, "కబీర్ జీవితంలో మహిళ అంటే చాలా చిన్న భాగం.
నా జీవితంలో మొదట కెరీర్, ఆ తర్వాత కుటుంబం, స్నేహితులు, చివరలో భార్య అని అతను నాకు ముందే చెప్పాడు. కబీర్ అలాగే ఉన్నాడు. సక్సెస్ కోసం అతను కష్టపడ్డాడు. కబీర్ ఎప్పటికీ నా రాజు. నా జీవితంలో కబీర్ బదులు వేరెవరూ రాలేరు" అని చెప్పింది.
Also Read: గోల్డెన్ స్పూన్ తో పుట్టిన టాలీవుడ్ రిచ్చెస్ట్ హీరో