అలీపై ఫైర్ అయిన అల్లు అరవింద్.. మెగా ఫ్యామిలీ ఇష్యూ కెలకడంతో..

First Published Oct 6, 2022, 10:54 AM IST

స్టార్ కమెడియన్ అలీ ప్రస్తుతం బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. అలీతో సరదాగా అనే షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. పలువురు సెలెబ్రిటీలు ఈ షోకి అతిథులుగా హాజరవుతూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలని అలీతో షేర్ చేసుకుంటారు.

స్టార్ కమెడియన్ అలీ ప్రస్తుతం బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. అలీతో సరదాగా అనే షోకి హోస్ట్ గా చేస్తున్నాడు. పలువురు సెలెబ్రిటీలు ఈ షోకి అతిథులుగా హాజరవుతూ తమ వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలని అలీతో షేర్ చేసుకుంటారు. తాజాగా అలీతో సరదాగా కార్యక్రమానికి స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ గా మారింది. 

Chiranjeevi

అక్టోబర్ 10న కంప్లీట్ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది. ఇటీవలే అల్లు రామలింగయ్య 100వ జయంతి కార్యక్రమాలు జరిగాయి. అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు ఫ్యామిలీ స్టూడియో కూడా లాంచ్ చేయడం.. చిరంజీవి అతిథిగా హాజరు కావడం జరిగింది. 

ఈ విషయాన్ని అల్లు అరవింద్ ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. తాను అల్లు రామలింగయ్య గారితో కొడుకుగా 22 సినిమాల్లో నటించానని అలీ చెబితే.. అల్లు అరవింద్ ఆశ్చర్యపోయారు. మీరు పెద్ద కొడుకు అయితే నేను రెండవ కొడుకు అని అలీ అన్నారు. అలీ ఇప్పుడు ఆస్తిలో వాటా ఏమన్నా అడుగుతున్నావా అని సరదాగా ప్రశ్నించారు. ఆ లెక్కలు తేల్చుకుందామనే ఈ షోకి పిలిచాను అని అలీ చెప్పడంతో నవ్వులు విరిశాయి. 

Allu Arjun

అనంతరం అల్లు అరవింద్ తన ఫ్యామిలీ గురించి సరదా విషయాలు ప్రస్తావించారు. అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ లని మీరు చూస్తోనే ఉంటారు.. అర్హ మాత్రం బాబోయ్.. చాలా తెలివైంది అంటూ అల్లు అరవింద్ మురిసిపోయారు. మా పిల్లలు కాబట్టి నేను ఎక్కువ చెప్పకూడదు అని అన్నారు. 

మీరు నటుడిగా ఎందుకు కొనసాగలేదు.. నిర్మాతగా ఎందుకు మారారు అని ప్రశ్నించగా.. నేను ఎంప్లాయర్ అవ్వాలని అనుకున్నాను కానీ ఎంప్లాయ్ కాదు అని బదులిచ్చారు. టీనేజ్ నుంచే నాన్నగారికి ఫైనాన్సియల్ వ్యవహారాల్లో సలహా ఇచ్చేవాడిని అని తెలిపారు. 

Allu Aravind

అల్లు అరవింద్ గారి ఫ్యామిలీకి, చిరంజీవి గారి ఫ్యామిలీకి చిన్న డిస్ట్రబెన్స్ వచ్చింది అంటూ అలీ ప్రస్తావించగా అల్లు అరవింద్ ఫైర్ అయ్యారు. అలీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు కాట్రవర్సీ ప్రశ్నలు ఆడుతాం అంటే ముందే చెప్పమని చెప్పాను. కాంట్రవర్సీ ఉండదు సర్ప్రైజింగ్ ప్రశ్నలు ఉంటాయి అని చెప్పారు. మరి ఇదేంటి అంటూ అల్లు అరవింద్ అసహనం వ్యక్తం చేశారు. దీని గురించి వీరి మధ్య పూర్తి సంభాషణ ఎలా జరిగిందో తెలియాలంటే అక్టోబర్ 10 వరకు వెయిట్ చేయాలి. 

click me!