త్వరలో తల్లి కాబోతోంది, అయినా ఆ క్యూట్ నెస్ చూడండి.. ఘనంగా అలియా భట్ సీమంతం

First Published Oct 6, 2022, 3:39 PM IST

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే.

బాలీవుడ్ క్యూట్ అండ్ హాట్ బ్యూటీ అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా చేరువైంది. ఆర్ఆర్ఆర్ లో అలియా సీత పాత్రలో రాంచరణ్ కి జోడిగా నటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఏప్రిల్ లో అలియా భట్ తన ప్రియుడు బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ ని వివాహం చేసుకుంది. 

వీరిద్దరూ తమ మ్యారేజ్ లైఫ్ ని అన్యోన్యంగా గడుపుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ బ్రహ్మాస్త్ర చిత్రంలో కలసి నటిస్తున్నారు. అలియా, రణబీర్ ఇద్దరూ బాలీవుడ్ స్టార్ కపుల్స్. వీరిద్దరూ ఎక్కడ కనిపించినా అభిమానులకు కనుల పండుగలా ఉంటుంది. 

కొన్ని నెలల క్రితం అలియా భట్ అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇస్తూ తన ప్రెగ్నన్సీ ప్రకటించింది. మరి కొన్ని నెలల్లో అలియా, రణబీర్ కపూర్ దంపతులు తల్లి దండ్రులు కాబోతున్నారు. 

దీనితో అలియా, రణబీర్ కపూర్ ఇంట్లో శుభకార్యం జరిగింది. అలియా భట్ గర్భిణీ కావడంతో ఆమె సీమంతం కార్యక్రమాన్ని ఘనంగా జరిపించారు. అలియా భట్ సింపుల్ ఎల్లో డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తోంది. 

ఈ ఫంక్షన్ కి అలియా, రణబీర్ కుటుంబ సభ్యులతో పాటు కరిష్మా కపూర్, కరణ్ జోహార్, ఆకాంక్ష రంజన్ లాంటి సెలెబ్రిటీలు పాల్గొన్నారు. సీమంతం కార్యక్రమంతో రణబీర్ ఇల్లంతా సందడిగా మారింది. 

ఇటీవల అలియా భట్, రణబీర్ కపూర్ కలసి నటించిన పాన్ ఇండియా మూవీ బ్రహ్మాస్త్ర మంచి విజయం సాధించింది. గ్రాఫిక్స్ మాయాజాలంతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించింది. 

click me!