కంచె దాటిన ప్రగ్యా గ్లామర్ షో... హాట్ థైస్ చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న బాలయ్య భామ

First Published Aug 27, 2021, 9:20 AM IST

అన్నీ ఉన్నా అదృష్టం అనేది ఒకటి ఉండాలి. పరిశ్రమలో ఎదగాలంటే హిట్ చిత్రాల హీరోయిన్ అనే మార్క్ చాలా అవసరం. టాలెంట్ సంబంధం లేకుండా విజయాలు ఉంటే.. అవకాశాలు క్యూ కడతాయి. 

వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడే హీరోయిన్స్ కి అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపరు. సెంటిమెంట్స్ ని గుడ్డిగా ఫాలో అయ్యే పరిశ్రమలో విజయమే కెరీర్ ని నిర్ణయిస్తుంది.  ఆ లెక్కల్లో చిక్కుకొని ఇబ్బంది పడుతుంది హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. 

చక్కని అందం, యాక్టింగ్ టాలెంట్ ఉంది కూడా జైస్వాల్ కి అవకాశాలు రావడం లేదు. కారణం.. ప్రగ్యా నటించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. తెలుగులో ఆమె నటించిన అధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి. 
 


క్రిష్ దర్సకత్వంలో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రం కంచె చిత్రంలో ప్రగ్యా హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది.  బోయపాటి డైరెక్షన్ లో వచ్చిన జయజానకి నాయక చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా ప్రగ్యా నటించారు. ఆ మూవీ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. 

ఇక మంచు విష్ణుకు జంటగా ఆచారి అమెరికా యాత్ర చిత్రం చేశారు ప్రగ్యా. అట్టర్ ప్లాప్ లిస్ట్ లో చేరిన ఆ చిత్రం ప్రగ్యా కెరీర్ ని మరింతగా దెబ్బ కొట్టింది.

అయితే అనూహ్యంగా బాలయ్య-బోయపాటి అఖండ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుని... ఆశలు సజీవంగా ఉంచుకుంది. అఖండ మూవీతో అయినా బ్రేక్ దక్కుతుందని గంపెడు ఆశలు పెట్టుకుంది.

దర్శకుడు క్రిష్, బోయపాటితో ఉన్న సాన్నిహిత్యం, బాలయ్యకు మరో హీరోయిన్ దొరకకపోవడంతో ప్రగ్యాకు అఖండ ఛాన్స్ దక్కింది. మరి బాలయ్య అయినా ప్రగ్యా కెరీర్ ని గాడిలో పెడతాడేమో చూడాలి. 


సోషల్ మీడియా వేదికగా గ్లామరస్ ఫోటోలు పంచుకుంటూ... దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు ప్రగ్యా. సూపర్ హాట్ గ్లామర్ గా కనిపిస్తూ వెండితెరపై అందాల విందుకు సిద్ధం అంటున్నారు. 

ప్రగ్యా గ్లామర్ ఫోటో షూట్స్ కి ఫ్యాన్స్ కి కూడా కిక్ పంచుతున్నాయి. వారు క్రేజీ కామెంట్స్ తో అభిమానం చాటుకుంటున్నారు. ఆమె సోషల్ మీడియా ఫాలోయింగ్ రోజు రోజుకు పెరుగుతుంది. 
 

click me!