కన్నడ బ్యూటీ ప్రణీతా సుభాష్ (Pranitha Subhash) ప్రస్తుతం కెరీర్ లో సెకండ్ ఇన్సింగ్స్ ను ప్రారంభించింది. ఈ సందర్భంగా నిత్యం సోషల్ మీడియాలో మెరుస్తూ మరిన్ని అవకాశాలను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ సందర్బంగా బ్యాక్ టు బ్యాక్ పోస్టులు పెడుతూ ఆకట్టుకుంటోంది.
పెళ్లై, ఓ కూతురుకు జన్మనిచ్చిన ప్రణీతా సుభాష్ చెక్కుచెదరని అందంతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఫిట్ నెస్ లో గానీ, గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తేడా రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ బ్యూటీ... మళ్లీ కెరీర్ పై ఫోకస్ పెట్టింది.
ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ తొలిచిత్రంలో నటిస్తోంది. అక్కడి సూపర్ స్టార్ దిలీప్ కుమార్ 148వ చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రణీతా మరిన్ని అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.
ఈ సందర్భంగా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ.. అభిమానులను ఫిదా చేయడంతో పాటు దర్శక నిర్మాతల కంట్లో పడేలా పోస్టులు పెడుతోంది. మరోవైపు గ్లామర్ పిక్స్ ను కూడా షేర్ చేస్తూ తన అందంతో మంత్రముగ్ధులను చేస్తోంది.
తాజాగా వైట్ బాత్ రోబ్ లో మెరిసింది. మెరిసిపోయే అందంతో స్నానపు గదిలో బుట్టబొమ్మ కవ్వింపు చర్యలకు దిగింది. మతులు చెడగొట్టేలా ఫోజులిచ్చింది. మరోవైపు మిర్రర్ లో అందాలను మెరిపిస్తూ మంత్రముగ్ధులను చేసింది. తన లేటెస్ట్ పిక్స్ కు ఫ్యాన్స్, నెటిజన్లు ఫిదా అవున్నారు.
ఇక ప్రణీతా తెలుగులో చివరిగా ‘హలో గురు ప్రేమకోసమే’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం Dileep148తో పాటు కన్నడలో రూపుదిద్దుకుంటున్న ‘రమణ అవతార’లో నటిస్తోంది. ఇక తెలుగులోకి మళ్లీ ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.