ఆది సాయి కుమార్ తీస్ మార్ ఖాన్ మూవీ రివ్యూ, యాక్షన్ థ్రిల్లర్ ఆదికి కలిసొచ్చిందా..?

First Published Aug 19, 2022, 9:31 PM IST

యంగ్ స్టార్ ఆది సాయి కుమార్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ థిల్లర్ అండ్ ఎంటర్టైనర్  సినిమా తీస్ మార్ ఖాన్.   కల్యాణ్ జీ గోగణ ఈ సినిమాను  రూపొందించాడు. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.  మరి ఈసినిమా హిట్ అయ్యిందా.. ఫట్ అయ్యింది. ఆదికి ఈ మూవీ ఎంత వరకూ బ్రేక్ ఇస్తుంది చూద్దాం..?
 

ఆది సాయి కుమార్ హీరోగా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన సినిమా తీస్ మార్ ఖాన్ . ఈ సినిమాలో, సునీల్ .. కబీర్ దుహాన్ సింగ్ .. అనూప్ సింగ్ ఠాకూర్ .. పూర్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు. నాగం తిరుపతి రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది. ఇక ఎప్పటి నుంచో సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న ఆదికి ఈసినిమా ఎంత వరకూ కలిసి వస్తుంది. అసలు రెస్పాన్స్ ఏంటీ చూద్దాం. .

ఈ సినిమా కథ విషయానికి వస్తే... రెండు వేరు వేరు కుటుంబాలకు చెందిన ఒక అబ్బాయి  ఆది సాయి కుమార్.... ఒక అమ్మాయి పూర్ణ. ఇంట్లో ఆదరణ లేక అనాథలుగా మారి ఇంటినుంచి బయటకు వచ్చి బ్రతుకుతున్నవారు. ఒకచోట కలుసుకుంటారు. ఎవరు తమకు లేకపోయినా.. ఇకపై ఒకరికి ఒకరు అండగా ఉండాలని నిర్ణయించుకుంటారు. ని కష్టపడి బ్రతుకుతుంటారు. ఆ అమ్మాయిని ఆ కుర్రాడు అమ్మా అని పిలుస్తూ ఉంటాడు. ఆమె కోసం ఎంత దూరం వెళ్ళడానికైనా వెనకాడడు. చిన్న వయస్సులోనే అమ్మ కోసం భారీ ఫైటింగ్స్ కూడా చేస్తాడు. దాంతో ఆ కుర్రాడిని తీస్ మార్ ఖాన్ అంటుంటారు. 

ఒక వైపున జిమ్ నడుపుతూ .. మరో వైపున సెటిల్ మెంట్లు చేస్తూ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు తీస్ మార్ ఖాన్. ఇక తన చిన్నప్పటి నుంచి తనని బిడ్డలా చూసుకున్న అమ్మ ) అంటే తీస్ మార్ ఖాన్కి ప్రాణం. ఇక సరిగ్గా అదే టైమ్ లో  పూర్ణ భర్త పాత్రలో  ఆ ఇంట్లోకి సునీల్ ఎంటరవుతాడు. ఈ లోపు తీస్ మార్ ఖాన్  పాయల్ రాజ్ పుత్ ప్రేమలో పడతాడు. తనకోసం కాలేజీ స్టూడెంట్ గా మారి.. ఎలాగో తన ప్రేమను సాధిస్తాడు. 
 

ఈలోపు తీస్ మార్ ఖాన్ లైఫ్ లోకి మెయిన్ విలన్ జీజే ఎంటర్ అవుతాడు. ఇల్లీగల్ పనులు చేసే విలన్ ఆది సాయి కుమార్ ను చంపాలని ప్రయత్నిస్తుంటాడు. అందరూ ఆనందంగా జీవిస్తున్న సమయంలో అమ్మ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తుంది. ఆ మరణానికి జీజా అనూప్ సింగ్ ఠాకూర్ అనే అనుమానం కలుగుతుంది. దాంతె కథలో రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. తన చుట్టు ఉన్న విలన్లను తట్టుకునితీస్ మార్ ఖాన్ ఎలా నిలబడగలుగుతాడు. క్లైమాక్స్ లో అతను సాధించిందేమిటి. పాయల్ తో ప్రేమ వ్యావహారంలో ట్విస్ట్ లు ఏంటీ..? అనేది సినిమా చూసి తెలుసుకోవల్సిందే. 

ఈ సినిమాలో ఆది సాయి కుమార్  మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో అదరగొట్టాడు. సాప్ట్ కుర్రాడు అనే పేరున్న ఆది... ఆ ఇమేజ్ నుంచి బయట పడటానికి చూశాడు. టోన్డ్ బాడీతో ఆడియన్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఈ విషయంలో ఆది కాస్త  సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. యాక్షన్ సీన్లలో ఆది అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. అంతే కాదు రోమాన్స్ డోస్ కూడా పెంచాడు..  

ఇక పాయల్ రాజ్‌పుత్‌తో కెమిస్ట్రీ  అద్భఉతంగా కుదిరింది. ఇక పాయల్ రాజ్‌పుత్ గ్లామర్ తో అదరగొట్టింది. తీస్ మార్ ఖాన్‌కు పాయల్ గ్లామర్ షో పెద్ద అసెట్ అని చెప్పవచ్చు. కాని ఆమెకు ఈ కథలో పెర్పామెన్స్ చేసే ఛాన్స్ మాత్రం రాలేదు. ఒక గ్లామర్ డాల్ లాగా మిగిలిపోయింది. . కథ మొత్తం పూర్ణ, సునీల్, ఆది చుట్టూ తిరగుతుంటుంది.  

ఇక ఈసారి కమెడియన్ కమ్ హీరో సునీల్   కు  మరోసారి ఓ ఇంపార్టెంట్ రోల్ దక్కింది. ఇక సెకండాఫ్‌లో కొన్ని సీన్లలో  సునీల్  పర్ఫామెన్స్ మెస్మారైజ్ చేస్తుంది. ఇక అమ్మ పాత్రలో పూర్ణ ఫుల్ లెన్త్ లేకపోయినా.. ఉన్నంత వరకూ యాక్టింగ్ ఇరగదీసింది. ఇక కబీర్ ఖాన్, అనూప్ సింగ్ ఠాకూర్, శ్రీకాంత్ అయ్యంగార్ లాంటి నటులు తమ పాత్రల పరిది మేరకు బాగానే నటించారు.  పూర్ణ పాత్రకు కనెక్ట్ అయ్యి..అమ్మ అనే సెంటిమెంట్‌ ఎపిసోడ్స్‌లో ఆది మెచ్యురిటీ కనిపించింది. తన పాత్ర పరంగా, కథ పరంగా మరికాస్త జాగ్రత్త పడి ఉంటే..ఆది కెరీర్ బాగుండేది అనిపిస్తుంది. 

దర్శకుడు కల్యాణ్ జీ  మేకింగ్ బాగుంది కాని.. కథను కాస్త కొత్తదనంతో తయారుచేసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. రొటీన్  స్టోరీయేమో అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే కూడా అనుకున్నంత ఆసక్తికరంగా లేదు. కొన్ని కొన్ని సీన్లు లాజిక్ లెస్ గా ఉన్నాయి. కొన్ని సీన్లు కామెడీగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమా స్టోరీ లైన్ ను అర్ధం లేకుండా తీసుకున్నాడన్న విమర్షలు ఉన్నాయి. కోన్ని సీన్లు బాగా లాగ్ అయ్యాయి. ఇక కొన్ని సీన్లు రొటీన్ గా అనిపించాయి. కాకపోతే ఈ సినిమాలో నటీనటుల పర్ఫామెన్స్  వల్ల కాస్తో కూస్తో తీస్ మార్ ఖాన్ బాగుంది అనిపించుకునే అవకాశం ఉంది. అయితే ఈ మూవీలో ఆదిసాయి కుమార్ కు పాయల్ రాజ్ పుత్ కు జోడీ సెట్ అవ్వలేదు అన్న విమర్షలు కూడా వస్తున్నాయి.  

సాయికార్తీక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫరవాలేదు .. ఓ రెండు పాటలు బాగా వింటున్నారు జనాలు. అటు  బాల్ రెడ్డి ఫొటోగ్రఫీ మంచి మార్కులే పడ్డాయి.  ఎడిటింగ్ కు మాత్రం తక్కువ మార్కులు పడ్డాయి. ఏది ఏమైనా ఈసినిమా రెగ్యూలర్ ఆడియన్స్ ను పెద్దగా ఎంటర్టైన్ చేయలేదనే చెప్పాలి. చిన్న సినిమాల తో కంపైయిర్ చేసుకుంటే.. పర్వాలేదు అనిపిస్తుంది. ఇక ఆది సాయి కుమర్ ను ఇప్పటికిప్పుడు కాస్తో కూస్తో స్టార్ ను చేసే సినిమా మాత్రం కాదు తీస్ మార్ ఖాన్. 

Rating- 2.75
 

click me!