వెంకటేష్‌, రాజశేఖర్‌ కాంబినేషన్‌ ఎలా మిస్‌ అయ్యింది? సెట్ అయితే బావబామ్మర్ది అయ్యేవాళ్లు !

First Published | Nov 22, 2024, 10:48 PM IST

విక్టరీ వెంకటేష్‌, యాంగ్రి మేన్‌ రాజశేఖర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా సెట్‌ కావాల్సింది. సెట్‌ అయితే మాత్రం బావ బామ్మర్ది అయ్యేవాళ్లు. మరి ఎలా మిస్‌ అయ్యింది. 
 

విక్టరీ వెంకటేష్‌ ఎంటర్‌టైనింగ్‌ సినిమాలకు కేరాఫ్. ఆయన టాప్‌ స్టార్స్ లో ఒకరిగా చిరంజీవి, బాలయ్య, నాగ్‌లకు సమకాలీకులుగా  రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన రేంజ్‌కి తగ్గ సినిమాలు పడటం లేదు. దీంతో సక్సెస్ దోబూచులాడుతుంది. ఇప్పుడు ఎంటర్టైనింగ్‌ చిత్రాలతో ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం `సంక్రాంతికి వస్తున్నాం` అనే సినిమాలో నటిస్తున్నారు. ఇది సంక్రాంతికి రాబోతుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 అప్‌ డేట్స్ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Venkatesh Daggubati

వెంకటేష్‌ మల్టీస్టారర్‌ సినిమాలు చేయడానికి రెడీగానే ఉంటారు. పాత తరం పక్కన పెడితే ఆయన ఈ జనరేషన్‌తో మల్టీస్టారర్‌కి రెడీ అయిన మొదటి హీరో వెంకీనే అవుతారు. ఇప్పటికే ఆయన మహేష్‌తో `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు`, పవన్ కళ్యాణ్‌తో `గోపాల గోపాల`,

నాగచైతన్యతో `వెంకీమామ`, వరుణ్‌ తేజ్‌తో `ఎఫ్‌2`, `ఎఫ్‌3` చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. అయితే మరో మల్టీస్టారర్‌ కూడా సెట్‌ కావాల్సింది. జస్ట్ లో మిస్‌ అయ్యింది. మరి ఆ మూవీ ఏంటి? ఆ హీరో ఎవరనేది చూస్తే, 
 


వెంకీ.. రాజశేఖర్‌తో కలిసి సినిమా చేయాల్సింది. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయాలనుకున్నారు దర్శకుడు తేజ. `గురు` సినిమా తర్వాత వెంకటేష్ హీరోగా ఓ సినిమా ప్లాన్‌ చేశారు. సురేష్‌ ప్రొడక్షన్స్, ఏకె ఎంటర్ టైన్‌మెంట్స్ పతాకాలపై ఈ మూవీని తెరకెక్కించాలనుకున్నారు.

అయితే ఇందులో మరో కీలక పాత్ర కూడా ఉంది. చాలా బలమైన పాత్ర. అందులో రాజశేఖర్‌ని అనుకున్నారు. ఆయనకంటే ముందే చాలా మంది హీరోల పేర్లు అనుకున్నారు. నాగచైతన్య, రానా, మాధవన్‌ పేర్లు కూడా వినిపించాయి. కానీ దీనికి రాజశేఖర్‌ అయితే బాగుంటుందనుకున్నారు. 
 

దర్శకుడు తేజ.. రాజశేఖర్‌ని కలిసి కథ చెప్పారని, ఆయన కూడా ఓకే చేసినట్టు వార్తలు వచ్చాయి. `ఆట నాదే వేట నాదే` అనే టైటిల్‌ని కూడా అనుకున్నారు. అధికారిక ప్రకటన రానుందని అనుకున్నారు. కానీ సడెన్‌ ట్విస్ట్. ఈ మూవీ వర్కౌట్‌ కాలేదు. స్క్రిప్ట్ విషయంలో తేడా కొట్టడంతో దర్శకుడు తేజ దీన్ని పక్కన పెట్టారు.

అలా వెంకటేష్‌, రాజశేఖర్‌ కలిసి నటించాల్సిన ఈ మూవీ ఆగిపోయింది. అయితే ఇందులో వెంకీ బామ్మర్దిగా, రాజశేఖర్‌ బావగా నటించాల్సి ఉంది. ఈ మూవీ సెట్‌ అయితే ఈ ఇద్దరు బావ బామ్మర్ది అయ్యేవాళ్లు. కానీ కొద్దిలో మిస్‌ అయ్యింది. కుదిరితే మాత్రం కచ్చితంగా ఇదొక క్రేజీ ప్రాజెక్ట్ గా నిలిచేది. కానీ జస్ట్ మిస్ అని చెప్పాలి.
 

హీరో రాజశేఖర్‌ ప్రస్తుతం సరైన కమ్‌ బ్యాక్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు. ఆయన గతంలో నటించిన సినిమాలు బాక్సాఫీసు వద్ద వర్కౌట్‌ కావడం లేదు. దీంతో ఇటీవల క్యారెక్టర్‌ ఆర్టిస్ట్ గానూ టర్న్‌ తీసుకున్నారు. నితిన్‌తో `ఎక్ట్సా ఆర్డినరీ మ్యాన్‌` సినిమాలో పోలీస్‌ ఆఫీసర్‌గా నటించారు. అలరించారు. కానీ సినిమా డిజాస్టర్ అయ్యింది.

దీంతో మళ్లీ ఆలోచనలో పడ్డారు రాజశేఖర్‌. నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి రాకపోవడం, క్యారెక్టర్‌గా చేద్దామంటే సరైన ఆఫర్లు రాకపోవడంతో ఓ డైలమాలో ఉన్నారు రాజశేఖర్. అందుకే ఇప్పుడు ఆయన సైలెంట్‌గా ఉన్నారట. ఒకేసారి రెండు మూడు ప్రాజెక్ట్ లతో వచ్చేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. 

read more:మహేష్‌, రామ్‌ చరణ్‌ దగ్గర్లో కూడా లేరు, ప్రభాసే ఇండియాలో నెంబర్ వన్‌.. తారక్, బన్నీ ఎక్కడంటే?

also read: ప్రభాస్‌తో రిలేషన్‌, బాలయ్య ప్రమేయం ఇదేనా, షర్మిలా చెప్పిన నిజాలు.. దీనంతటికి కారణం ఆయనే!
 

Latest Videos

click me!