Virat, Dhoni, Rohit
IPL 2025 Schedule : క్రికెట్ లవర్స్ కు గుడ్ న్యూస్. ఇండియా-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌ల మధ్య ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) థ్రిల్‌ను కూడా అభిమానులు చూడగలరు. ఎందుకంటే నవంబర్ 22-26 వరకు పెర్త్‌లో తొలి టెస్టు జరగనుంది. అదే సమయంలో నవంబర్ 24-25 తేదీల్లో సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఆటగాళ్ల కోసం ఐపీఎల్ 2025 మెగా వేలం జరగనుంది.
మొత్తం 10 జట్లలో 204 ప్లేయర్ల స్థానాలు ఖాళీలు ఉండగా, 575 మంది ఆటగాళ్లను షార్ట్‌లిస్ట్ చేశారు. మెగా వేలానికి ముందు బీసీసీఐ తన నిర్ణయంతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐపీఎల్ రాబోయే సీజన్ తేదీలను ప్రకటించింది. కేవలం ఒక సీజన్‌లో మాత్రమే కాకుండా తదుపరి మూడు సీజన్‌ల మొదటి, చివరి మ్యాచ్‌ల తేదీలను విడుదల చేసింది.
Rishabh Pant,KL Rahul,Arshdeep Singh, IPL, IPL2025
ఐపీఎల్ రాబోయే సీజన్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి?
ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 18వ సీజన్ (ఐపీఎల్ 2025) వచ్చే ఏడాది మార్చి 14న ప్రారంభమవుతుంది. ఫైనల్ మ్యాచ్ మే 25న ముగుస్తుంది. దీని తర్వాత ఐపీఎల్ 2026 మార్చి 15న ప్రారంభం కానుంది. టైటిల్ మ్యాచ్ మే 31న జరగనుంది. ఆ తర్వాత ఏడాది వచ్చే ఐపీఎల్ అంటే ఐపీఎల్ 2027 మొదటి మ్యాచ్ మార్చి 14 న జరుగుతుంది. ఆ సీజన్ ఫైనల్ మ్యాచ్ మే 30న జరగనుంది. అయితే, ఈ ఐపీఎల్ తేదీలను విండోగా విడుదల చేసింది. ఇందులో మార్పులు కనిపించే అవకాశం కూడా ఉంది.
IPL 2025 CSK Retention, IPL 2025, CSK Retention, CSK
ఎన్ని దేశాల ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు?
ఈ నివేదిక ప్రకారం.. ఐపీఎల్ 2025 సీజన్‌కు ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే ఆటగాళ్లు పూర్తిగా అందుబాటులో ఉంటారు. వచ్చే ఏడాది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 6 రోజుల తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ ఐపీఎల్ ప్రారంభం కానుంది. అయితే, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మొత్తం టోర్నమెంట్‌ను పాకిస్తాన్‌లో నిర్వహిస్తుందా లేదా హైబ్రిడ్ మోడల్‌ను ఎంచుకుంటుందా అనే దానిపై ఇంకా అనిశ్చితి ఉంది.
Rohit Sharma, Virat Kohli, IPL 2025
రాబోయే ఐపీఎల్ లో ఇంతకు ముందుకంటే ఎక్కువ మ్యాచ్‌లు
ఐపీఎల్ 2025లో జరిగే మ్యాచ్‌ల సంఖ్య 2024 కంటే ఎక్కువగా ఉంటుందని సమాచారం. గత సీజన్‌లో 74 మ్యాచ్‌లు నిర్వహించబడ్డాయి. ఐపీఎల్ 2025, 2026 సీజన్లలో వరుసగా 84-84 మ్యాచ్‌లు ఉంటాయి. దీని తర్వాత ఎడిషన్ లో 94 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఐపీఎల్ ప్రసార హక్కులను విక్రయించే సమయంలో బీసీసీఐ బ్రాడ్‌కాస్టర్లతో ఈ ఒప్పందం చేసుకుంది. కాగా, ప్రస్తుత షెడ్యూల్ తో ఐపీఎల్ జట్లకు పెద్ద ఉపశమనం కలిగింది. ఎందుకంటే.. ప్రధాన టెస్ట్ ఆడే దేశాలకు చెందిన విదేశీ ఆటగాళ్లు అందరూ ఐపీఎల్ రాబోయే మూడు సీజన్లలో ఆడేందుకు వారి బోర్డుల నుండి అనుమతి పొందారు. అయితే, ఈ లిస్టులో పాకిస్థాన్ జట్టుకు చోటు దక్కలేదు. ఆ టీమ్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడరు.