83 Movie Review: 83 మూవీ రివ్యూ

First Published | Dec 24, 2021, 1:46 AM IST

ఓ గొప్ప సందర్భాన్ని, ఇండియన్‌ క్రికెట్‌ టీమ్ కి కెప్టెన్‌గా ఉన్న హరియానా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రూపొందించిన చిత్రం `83`. బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కపిల్‌ దేవ్‌గా బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ నటించారు. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా నేడు శుక్రవారం(డిసెంబర్‌ 24)ని విడుదలైంది. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదల చేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

83 movie review ranveer singh mind blowing acting

1983 ప్రపంచకప్‌.. ఇండియా తొలిసారి క్రికెట్లో ప్రపంచ కప్‌ గెలిచిన మరుపురాని సందర్భం. ఇదొక ఐకానిక్‌ సిచ్యువేషన్‌. ఇండియన్‌ గర్వంగా తలెత్తుకున్న రోజు. ఇండియన్స్ కి ప్రపంచ వ్యాప్తంగా గౌరవం దక్కిన రోజు. ప్రతి ఇండియన్‌కి ఇదొక భావోద్వేగ సందర్భం. ఇలాంటి ఓ గొప్ప సందర్భాన్ని, ఇండియన్‌ క్రికెట్‌ టీమ్ కి కెప్టెన్‌గా ఉన్న హరియానా హరికేన్‌ కపిల్‌ దేవ్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో రూపొందించిన చిత్రం `83`. బాలీవుడ్‌ దర్శకుడు కబీర్‌ ఖాన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో కపిల్‌ దేవ్‌గా బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌సింగ్‌ నటించారు. ఈ సినిమా క్రిస్మస్‌ కానుకగా నేడు శుక్రవారం(డిసెంబర్‌ 24)ని విడుదలైంది. హిందీతోపాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదల చేశారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. 

83 movie review ranveer singh mind blowing acting

కథః 
సినిమా 1983 ప్రపంచ కప్‌ ప్రధానంగా సాగుతుంది. కపిల్‌దేవ్‌ సారధ్యంలోని టీమ్‌ ఇండియా క్రికెట్‌ జట్టు 1983 ప్రపంచ కప్‌ ఆడబోతుందనే పాయింట్‌ నుంచి సినిమా ప్రారంభమైంది. ఇంగ్లాండ్‌ వేదికగా జరిగిన ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు ఇండియన్‌ టీమ్‌ అక్కడికి చేరుకోవడం, వారికి సంబంధించిన కిట్లని మేనేజర్‌ పీఆర్‌ మాన్‌ సింగ్‌ తీసుకొని, జట్టుని తీసుకుని ఇంగ్లాండ్‌కి వెళతాడు. అప్పటికే కపిల్‌ దేవ్‌ అక్కడికి చేరుకుని ప్రాక్టీస్‌ చేస్తుంటాడు. భారత్‌.. ప్రపంచ కప్‌లో పాల్గొంటుందంటేనే అందరిని నుంచి చిన్నచూపు. మొదటి మ్యాచ్‌ తోనే ఇంటికి తిరిగి వచ్చేస్తారు. ఇండియాకి అంత సీన్‌ లేదంటూ ఎక్కడ చూసినా  విమర్శలు, అవమానాలు. ఇండియన్‌ క్రికెట్‌కి సంబంధించి సంస్థలోనూ అదే చిన్న చూపు. ఇండియన్‌ మీడియా సైతం కించపరిచేలా మాట్లాడుతుంటుంది. ఇంతటి అవమానాల మధ్య ఈ సారి మనం కప్‌ గెలవాలని పట్టుదలతో ఉంటాడు కపిల్‌ దేవ్‌. ఇంగ్లీష్‌ అంటే పెద్దగా రాని తను అదే విషయాన్ని జట్టు సభ్యులకు చెప్పి ఇన్‌స్పైర్‌ చేస్తాడు.


మొదట ఇండియాకి ప్రపంచ నెంబర్‌ వన్‌ జట్టుగా ఉన్న వెస్ట్ ఇండీస్‌కి మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. ఎలాంటి అంచనాలు లేని ఇండియా ఆ మ్యాచ్‌లో ఉత్కంఠ పోరులో వెస్టిండీస్‌ని చిత్తుగా ఓడిస్తుంది. దీంతో ఇండియన్‌ జట్టులో ధౌర్యం,నమ్మకం వస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు మ్యాచ్‌లు గెలుస్తారు. దీంతో ఇండియన్‌ క్రికెటర్స్ లో ఓవర్‌ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆటపై కాకుండా ఎంజాయ్‌ పై దృష్టిపెడతారు. దీంతో రెండు మ్యాచ్‌లో ఓడిపోతారు. వెస్టిండీస్‌పై కూడా ఓడిపోవాల్సి వస్తుంది. దీంతో రగిలిపోయిన కపిల్‌, తన ఆటగాళ్లో దేశభక్తిని, తమకు ఎదురవుతున్న అవమానాలను గుర్తు చేస్తూ వాటికి ఆటతోనే.. ప్రపంచ కప్‌ గెలిచి చూపించి సమాధానం చెప్పాలని నమ్మకాన్ని, ధైర్యాన్ని నూరిపోస్తాడు. ఉత్తేజాన్నిస్తాడు. దీంతో సెమిఫైనల్‌ కి, అట్నుంచి ఫైనల్‌కి చేరుతుంది ఇండియా జట్టు. ఆ తర్వాత ఎలా విన్నర్‌ అయ్యారు, ఈ క్రమంలో ఎలాంటి ఉత్కంఠభరిత భావోద్వేగ సన్నివేశాలు, సంఘటలు చోటు చేసుకున్నాయనేది సినిమా. 

విశ్లేషణః 
ఇండియాకి చేతకాదనే అవమానాల నుంచి పుట్టిన కసినే 1983 ప్రపంచకప్‌ అని చెప్పొచ్చు. అవే కెప్టెన్‌ కపిల్‌దేవ్‌లో కసిని పెంచాయి. గెలవాలనే తపనని పెంచాయి. అందరిలోనూ స్ఫూర్తిని రగిలించాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  `83` మూవీ కపిల్‌ దేవ్‌ బయోపిక్‌గా ప్రచారం జరిగింది కానీ సినిమా కేవలం 1983 ప్రపంచకప్‌ మ్యాచ్ లు, వాటిలో గెలవడం, ఈ క్రమంలో క్రికెటర్ల మధ్య జరిగే సంఘర్షణ చుట్టూనే సాగుతుంది. కాకపోతే కెప్టెన్‌గా కపిల్‌ దేవ్‌ పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో సినిమాని నడిపించారు. ఇండియాకి మొదటి ప్రపంచ కప్‌ అంటే అందరిలోనూ ఓ ఆసక్తి ఉంది. దానికితగ్గట్టుగానే చాలా ఎమోషనల్‌ అంశాలతో ఈ కథని నడిపించారు దర్శకుడు కబీర్‌ ఖాన్‌. జనరల్‌గా ఇలాంటి క్రీడా నేపథ్య చిత్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషనల్‌ అంశాలను మేళవిస్తూ, బోరింగ్‌ లేకుండా చెప్పడం చాలా కష్టం. ఇదొక కత్తి మీద సాము లాంటిది.  రియల్‌గా క్రికెట్‌ని చూస్తే ఆ కిక్‌ వేరు, కానీ సినిమాల్లో చూడాలంటే దానికి తగ్గ ఎమోషన్‌ కనెక్టింగ్‌ పాయింట్‌ ఉండాలి. ఆ విషయంలో దర్శకుడు సక్సెస్‌ అయ్యాడనే చెప్పాలి. దానికి అవమానాలు, చిన్నచూపు, ఇండియన్స్ కి గౌరవం ఇవ్వకపోవడం వంటి అంశాలను కనెక్టింగ్‌ పాయింట్స్ గా ఎంచుకున్నారు. వాటిని అదే స్థాయిలో ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూపించారు. 

క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో బోర్‌ లేకుండా మధ్యలో క్రికెటర్ల మధ్య సరదా సన్నివేశాలను, అదేసమయంలో కొంత ఎమోషన్‌ అంశాలను జోడించారు. కథని రక్తికట్టించే ప్రయత్నంచేశారు. ఎక్కడా బోర్‌ లేకుండా తీసుకెళ్లారు. అప్పటి ప్రపంచకప్‌ సమయంలో ఏం జరిగిందనే విషయాలు నేటి తరానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. అవన్నీ ఇందులో టచ్‌ చేశాడు దర్శకుడు. దీంతో నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించారు. ప్రపంచకప్‌ సమయంలో వెస్టిండీస్‌ జట్టు విధ్వంసాలను చూపించారు. ఎంత మంది క్రికెటర్లు వారి బౌలర్ల దాటికి బలయ్యారనే విషయాలను చూపిస్తూ ఉత్కంఠని రేకెత్తించారు. కాసేపు ఎమోషనల్‌గా, మరి కాసేపు ఎంటర్‌టైన్‌మెంట్‌తో కథని నడిపించి సాఫీగా సాగేలా చేయడంతో సినిమా ఆహ్లాదభరితంగా అనిపిస్తుంది. కాస్త స్లోగా సాగుతున్న ఫీలింగ్‌ కలిగినా అవి కొంత వరకే పరిమితం. గవాస్కర్‌కి కాలుకిగాయం కావడం, మరో క్రికెటర్‌కి దవడ పగిలిపోవడం, భల్విందర్‌ సింగ్‌ ఎంగేజ్‌మెంట్‌ క్యాన్సిల్‌ కావడం, ఆస్ట్రేలియాతో, వెస్ట్ ఇండీస్‌తో మ్యాచ్‌లు ఓడిపోవడం కదిలించే అంశాలు. 

ఆ తర్వాత క్రీడా స్ఫూర్తితో ఎలాగైనా ప్రపంచకప్‌తోనే తిరిగి ఇండియా వెళ్లాలనే ఆకాంక్ష క్రికెటర్లలో కపిల్‌ రగిల్చిన తీరు ఆకట్టుకుంటుంది. కానీ డ్రామా మిస్‌ అయ్యింది. ఆ ఎమోషన్‌లో డెప్త్ లేదనిపిస్తుంది. ఫైనల్‌ మ్యాచ్‌లో వెస్ట్ ఇండీస్‌తో ఫైనల్‌గా గెలిచే సందర్భంలో ఉండాల్సిన ఎమోషనల్‌, ఉత్కంఠత తగ్గింది. ప్రపంచకప్‌ మ్యాచ్‌ గెలవడమంటే మామూలు విషయం కాదు. బాల్‌ బాల్‌కి ఉండాల్సిన సస్పెన్స్ క్లైమాక్స్ లో మిస్‌ అయిన ఫీలింగ్‌ అనిపిస్తుంది. ఈజీగా గెలిచారనేలా ప్రపంచకప్‌ గెలవడం ఏదో కొంత అసంతృప్తిగా అనిపిస్తుంది. కానీ ఆ తర్వాత ఇండియన్స్ లో ఆ సంతోషాలు, భారత్‌ మొత్తం సంబరాలు చేసుకోవడం, టీమిండియాకి ఘనంగా స్వాగతం పలకడం వంటి సన్నివేశాలు హత్తుకుంటాయి. భావోద్వేగానికి గురి చేస్తాయి. మనల్ని కూడా అప్పటి రోజుల్లోకి తీసుకెళ్తాయి. వారిలో మనం కూడా ఉన్నామనే ఫీలింగ్‌ని కలిగిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్ట్ లో యష్‌పాల్‌ శర్మ, కృష్ణమాచారి శ్రీకాంత్‌, భల్విందర్‌ సింగ్‌  కామెడీ ఆకట్టుకుంటాయి. మధ్యలో కపిల్‌ దేవ్‌ సిక్సర్‌ క్యాచ్‌ పట్టడం కొసమెరుపు.

నటీనటులుః
క్రికెటర్లుగా సరైన నటులను, అప్పటి క్రికెటర్లని పోలిన నటులను ఎంచుకోవడం ఓ సక్సెస్ గా చెప్పొచ్చు. కపిల్‌ దేవ్‌ పాత్రలో రణ్‌వీర్‌ సింగ్‌ పరకాయప్రవేశం చేశారు. మనకు ఎక్కడా రణ్‌వీర్ సింగ్‌ కనిపించడు. కపిల్‌దేవ్‌తోనే మనం ట్రావెల్‌ అవుతున్న ఫీలింగ్‌ కలుగుతుంది. పాత్రకి ప్రాణం పోశాడు. బాడీ లాంగ్వేజ్, డైలాగ్‌డెలివరీ, సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాని తన భుజాలపై తీసుకెళ్లాడు. కపిల్‌పాత్రలో రణ్‌వీర్‌ని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేం. ఇక గవాస్కర్‌గా తహీర్‌ రాజ్‌ బాసిన్‌ మెప్పించారు. శ్రీకాంత్‌గా జీవా అదరగొట్టారు. కపిల్‌ తర్వాత హైలైట్‌ అయ్యేపాత్ర జీవాదే. యష్పాల్‌ శర్మగా జస్టిన్‌, భల్విందర్‌ సింగ్‌గా అమీ విర్క్, అమర్‌నాథ్‌ గా సాకిబ్‌ సలీమ్‌ మెప్పించారు. ఇలా ప్రతి ఒక్కరు తమ పాత్రలకు ప్రాణం పోశారు. ఆనాటి క్రికెటర్లని మరిపించారు. కపిల్‌ భార్యగా దీపికా ఫర్వాలేదనిపించింది. కాసేపు ఉన్నా ఆకట్టుకుంది. ఇక మేనేజర్‌ పీఆర్‌ మాన్‌ సింగ్‌ పాత్రలో పంకజ్‌ త్రిపాఠి జీవం పోశారు. 

టెక్నీషియన్లుః  
టెక్నీకల్‌గా దర్శకుడు కబీర్‌ ఖాన్‌ సినిమాకి పెద్ద అసెట్‌. ఆయన తెరకెక్కించిన విధానం అద్బుతమని చెప్పాలి. చాలా కష్టమైన సబ్జెక్ట్ ని చాలా ఈజీగా, ఎలాంటి గజిబిజీ లేకుండా సాఫీగా సాగిపోయేలా తీర్చిదిద్దిన విధానంలోనే ఆయన సక్సెస్ అయ్యారు. సినిమాని నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లారు. 1983 నాటి రోజులను మళ్లీ ఇప్పటి తరానికి అందించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రత్యక్షంగా ప్రపంచకప్‌ని చూసిన ఫీలింగ్‌ని కలిగించారు. ముఖ్యంగా క్రికెటర్లుగా నటులను ఎంచుకోవడంలోనే ఆయన ఫస్ట్ సక్సెస్‌. ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్ ని సమపాళ్లలో మేళవించి సినిమాని ఆడియెన్స్ కి హత్తుకునేలా చేశారు. కెమెరా వర్క్ అద్భుతం. ఇలాంటిసినిమాలను షూట్‌ చేయడం పెద్ద ఛాలెంజ్‌ ఆ విషయంలో కెమెరామెన్‌ అసీమ్‌ మిశ్రాని అభినందించాల్సిందే. ఎడిటింగ్‌ వర్క్ బాగుంది. జూలియస్‌ పకియమ్‌ సంగీతం సినిమాకి పెద్ద అసెట్‌. అయితే ఎమోషన్స్ సీన్స్ లో, ఉత్కంఠభరిత సన్నివేశాల్లో ఉండాల్సినంత ఎలివేషన్‌ లేకపోవడం కాస్త మైనస్‌ అని చెప్పాలి. ఫైనల్‌గా గెలిచే సందర్భంలో ఆ స్థాయి ఎలివేషన్‌ దక్కలేదు. 
 

ఫైనల్‌గాః చిన్న చిన్న మైనస్‌లు పక్కన పెడితే.. ఇదొక ఇన్‌స్పైరింగ్‌, మెమరబుల్‌ జర్నీగా చెప్పొచ్చు. 1983 ప్రపంచకప్‌ని ప్రత్యక్షంగా చూసిన ఫీలింగ్‌నిస్తుంది.
రేటింగ్‌:3.5

ఆర్టిస్టులు, 
రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె, పంకజ్‌ త్రిపాఠి, జీవా, తహిర్‌ రాజ్‌ భాసిన్‌, సాకిబ్‌ సలీమ్‌, జటిన్‌ షర్నా, చిరాగ్‌ పాటిల్‌, సాహిల్‌ ఖత్తర్‌, అమీ విర్క్, అదినాథ్ కొటారే, నీనా గుప్తా, బోమన్‌ ఇరానీ, అదితి ఆర్య
తదితరులు.
టెక్నీషియన్లు.. 
దర్శకుడుః కబీర్‌ ఖాన్‌
నిర్మాతలుః కబీర్‌ ఖాన్‌, దీపికాపదుకొనె, విష్ణుఇందూరి, సాజిద్‌ నడియద్‌వాలా, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫాంటమ్‌ ఫిల్మ్స్ 83 ఫిల్మ్ లిమిటెడ్‌, విబ్రి మీడియా. 
కెమెరాః అసీమ్‌ మిశ్రా, 
సంగీతంః జులియస్‌ పక్కియమ్‌, 
ఎడిటింగ్‌ః నితిన్‌ బైడ్‌. 

Latest Videos

click me!