మహా కుంభ్ 2025 నేడు ప్రారంభమైంది. దేశ విదేశాల నుండి భక్తులు ప్రయాగరాజ్‌కు తరలివస్తున్నారు.
మొదటి పుణ్యస్నానంతో నేడు మహా కుంభ్ 2025 ప్రారంభమైంది. భక్తుల కోసం ఈసారి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హోటళ్ళు, వీఐపీ కాటేజీలు, టెంట్‌లతో పాటు, డోమ్ అనే కొత్త వసతి సౌకర్యాన్ని ఓ ప్రైవేట్ కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో అన్ని హంగులు, సౌకర్యాలు ఉండడం విశేషం.
మహా కుంభ్‌లో ఇదే అత్యంత ఖరీదైన వసతి. 5 స్టార్ హోటల్‌లో ఉండే అన్ని సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. రాత్రిపూట ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు. డోమ్ అద్దె విని షాక్ అవ్వాల్సిందే. షాహి స్నానం రోజున ₹1,11,000, మిగతా రోజుల్లో ₹81,000. ఈ ప్రాజెక్టు కోసం ₹51 కోట్లు ఖర్చు చేశారు.
ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభ్ 2025 సందర్భంగా "డోమ్ సిటీ" అనే ప్రత్యేక ఏర్పాటు చేశారు. భూమి నుంచి 18 అడుగుల ఎత్తులో ఈ డోమ్‌లు ఉంటాయి. గుమ్మటం ఆకారంలో ఉండే ఈ డోమ్‌లకు గాజు పలకలు, కర్టెన్లు ఏర్పాటు చేశారు. కర్టెన్లు తొలగిస్తే, లోపల నుంచే మహా కుంభ్ దృశ్యాలను ఆస్వాదించవచ్చు. ఇలాంటి ఏర్పాటు మహా కుంభ్‌లో ఇదే మొదటిసారి. ఇది భక్తులకు, పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.