సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరించాలంటే వెంకటేష్ తర్వాతే ఎవరైనా. వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం చిత్రం సంక్రాంతి కానుకగా మంగళవారం రోజు విడుదలవుతోంది. ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. ఎక్స్ కాప్, ఎక్స్ లవర్, ఎక్సలెంట్ వైఫ్ అనే కాన్సెప్ట్ తో అనిల్ రావిపూడి తన స్టైల్ లో ఫన్ జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ చిత్రాలు ఆల్రెడీ థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. రెండు మాస్ చిత్రాల మధ్య వెంకీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అలరిస్తుంది అనే ఆసక్తి నెలకొంది.