నన్ను చంపుతానంటున్నాడు : పోలీసులను ఆశ్రయించిన నిధి అగర్వాల్

By Surya Prakash  |  First Published Jan 10, 2025, 4:28 PM IST

సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్నట్లు నటి నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మరియు కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఆమె పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు', ప్రభాస్ 'రాజా సాబ్‌' సినిమాల్లో నటిస్తున్నారు.


ఓ గుర్తుతెలియని వ్యక్తి తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నాడని ప్రముఖ నటి నిధి అగర్వాల్.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఓ వ్యక్తి తనను, తన కుటుంబాన్ని చంపుతానని బెదిరిస్తున్నాడని, అసభ్యకర మెసేజ్‌లతో తన ఇన్‌స్టా అకౌంట్‌ను పదేపదే ట్యాగ్ చేస్తున్నాడని ఫిర్యాదు చేశారు. నిందితుడిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

వివరాల్లోకి వెళితే...సోషల్​ మీడియాలో ఓ వ్యక్తి తనని టార్గెట్​చేసి నిత్యం వేధిస్తున్నాడని సినీ హీరోయిన్ ​నిధి అగర్వాల్ హైదరాబాద్​సైబర్ ​క్రైమ్ ​పోలీసులను ఆశ్రయించారు.  ఆ వ్యక్తి బెదిరింపుల వల్ల తాను, తన కుటుంబం మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నామని సైబర్ క్రైమ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నిధి అగర్వాల్ పేర్కొంది.సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆన్​లైన్​లో ఫిర్యాదు చేసింది. తనతోపాటు తన స్నేహితులను, బంధువులను టార్గెట్​చేసి సోషల్ ​యాప్స్​లో బెదిరింపులకు దిగుతున్నాడని పేర్కొంది. నిందితుడిని గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిధి అగర్వాల్ పోలీసులను కోరింది. ఈ మేరకు స్పందించిన పోలీసులు నిధి అగర్వాల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest Videos

ప్రస్తుతం హీరోయిన్ నిధి అగర్వాల్ ఇద్దరు అగ్ర హీరోల సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. పవన్‌ సరసన ‘హరిహర వీరమల్లు’లో, ప్రభాస్‌ ‘రాజా సాబ్‌'లోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాల అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా వారిలో జోష్ నింపేలా నిధి ఓ ఆసక్తికర విషయం పోస్ట్‌ చేశారు. ఒకే రోజు ఈ రెండు సినిమాల షూటింగ్‌లలో పాల్గొన్నట్లు తెలిపారు.

click me!