Kho Kho World Cup, Kho Kho World Cup 2025,
ఖోఖో ప్రపంచ కప్ 2025 పోటీలో పురుషులు, మహిళల జట్లు
23 దేశాలకు చెందిన క్రీడాకారులతో, ప్రారంభ టోర్నమెంట్ ఖో ఖోను ఆసియా క్రీడల వంటి ప్రతిష్టాత్మక వేదికలకు చేరుకోవాలని ఊహించిన అధికారుల నుండి ప్రశంసలు అందుకుంది. క్రీడల మంత్రి మాండవ్య ఖో ఖోను అంతర్జాతీయ పోటీల్లో చేర్చాలనే ఆకాంక్షను పంచుకున్నారు, దాని సాంస్కృతిక ప్రాముఖ్యత, పోటీ సామర్థ్యాన్ని నొక్కిచెప్పారు.
కాగా, ఖోఖో ప్రపంచ కప్ 2025 టోర్నీలో మొత్తం 20 పురుషుల జట్లు, 19 మహిళల జట్లు తమ తమ విభాగాల్లో ఛాంపియన్‌లుగా మారాలని చూస్తున్నాయి. పరుషుల జట్లలో నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్‌లతో భారత్ గ్రూప్-ఎలో ఉంది. గ్రూప్-బిలో దక్షిణాఫ్రికా, ఘనా, అర్జెంటీనా, నెదర్లాండ్స్, ఇరాన్ ఉన్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, పోలాండ్ గ్రూప్ సి లో ఉన్నాయి. ఇంగ్లాండ్, జర్మనీ, మలేషియా, ఆస్ట్రేలియా, కెన్యా గ్రూప్ డిలో ఉన్నాయి.
మహిళల ఎడిషన్‌లో 19 జట్లు ఉన్నాయి. ఆతిథ్య భారత్, ఇరాన్, మలేషియా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా గ్రూప్ ఎలో ఉన్నాయి. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, కెన్యా, ఉగాండా, నెదర్లాండ్స్ గ్రూప్ బిలో ఉన్నాయి. గ్రూప్ సిలో నేపాల్, భూటాన్, శ్రీలంక, జర్మనీ, బంగ్లాదేశ్‌లు ఉన్నాయి. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, పోలాండ్, పెరూ, ఇండోనేషియా ఉన్నాయి.