West Indies: వ‌ర‌ల్డ్ ఛాంపియ‌న్ టీమ్.. 27 పరుగులకే ఆలౌట్.. ఇలా త‌యార‌య్యారేంది సామీ !

Published : Jul 15, 2025, 10:52 PM IST

West Indies: ఆస్ట్రేలియాతో జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ లో వెస్టిండీస్ కేవ‌లం 27 ప‌రుగుల‌కే ఆలౌట్ కావ‌డం క్రికెట్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. ఈ క్ర‌మంలోనే విండీస్ క్రికెట్ బోర్డ్ అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మైంది.

PREV
16
ఒక‌ప్పుడు ప్ర‌పంచ ఛాంపియ‌న్ జ‌ట్టు.. ఇప్పుడు చిత్తవుతోంది !

ప్ర‌పంచ ఛాంపియ‌న్ జ‌ట్టు.. ఒక‌ప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించింది. ఆ జ‌ట్టు బౌల‌ర్లు అన్నా.. బ్యాట‌ర్లు అన్నా ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ద‌డ‌పుట్టేది. ఇదంతా గ‌తం.. ఇప్పుడు ఆ టీమ్ ను క్రికెట్ లోకి అడుగుపెడుతున్న కొత్త జ‌ట్లు సైతం చిత్తుగా ఓడిస్తున్నాయి. ఇప్పుడు ఆ జట్టుకు మ‌రో షాక్ తగిలింది. కేవ‌లం 27 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది. ఆ జ‌ట్టే వెస్టిండీస్.

వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్‌లో తక్కువ స్కోరు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఆసీస్ చేతిలో ఓడిపోయిన తరువాత, క్రికెట్ వెస్టిండీస్ బోర్డు అత్యవసర సమీక్ష సమావేశం ఏర్పాటు చేసింది. బ్రియాన్ లారా, క్లైవ్ లాయిడ్, వివియన్ రిచర్డ్స్ వంటి దిగ్గజులను సంప్రదించనున్నారు. ఈ పరాజయం వెస్టిండీస్ క్రికెట్‌లో పెద్ద మార్పులకు నాంది కావొచ్చని క్రికెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

26
27 పరుగులకే ఆలౌట్.. వెస్టిండీస్ చిత్తుగా ఓడింది

వెస్టిండీస్ క్రికెట్ టీమ్ టెస్ట్ క్రికెట్‌లో ఇదివ‌ర‌కెన్న‌డూ చూడనంత దారుణ పరాజయం చవిచూసింది. జమైకాలో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో ఆసీస్ చేతిలో రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 27 పరుగులకే ఆలౌట్ అయింది. ఇది టెస్ట్ చరిత్రలో రెండవ తక్కువ స్కోరు కావడం గమనార్హం. మొత్తం 14.3 ఓవర్లలోనే వెస్టిండీస్ కుప్పకూలింది.

36
ఆసీస్ బౌల‌ర్లు నిప్పులు చెరిగారు

ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ తన 100వ టెస్ట్‌లో చరిత్ర సృష్టించాడు. కేవలం 9 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి అద్భుతం చేశాడు. అలాగే, స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ తో అద‌ర‌గొట్టాడు. మొత్తం ఆడిన 11 మంది ఆటగాళ్లలో ఏడుగురు డకౌట్ కావడం, టాప్ 6 ఆటగాళ్లు కలిసి కేవలం 6 పరుగులే చేయడం వెస్టిండీస్ బ్యాటింగ్ ఎంత దారుణంగా ఉందో తెలియ‌జేస్తోంది.

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ 143 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్ లో 27 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ 176 పరుగులతో విజయం సాధించింది. కంగారు టీమ్ 3-0 తో టెస్టు సిరీస్ ను గెలుచుకుంది.

46
విండీస్ క్రికెట్ బోర్డు షాక్.. ఎమ‌ర్జెన్సీ మీటింగ్

ఈ పరాజయం వెస్టిండీస్ క్రికెట్‌లో సంచలనం రేపింది. క్రికెట్ వెస్టిండీస్ చైర్మన్ డాక్టర్ కిషోర్ షాలో ఈ ఘోర పరాజయంపై తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే ఓ ఎమర్జెన్సీ రివ్యూ సమావేశాన్ని ప్రకటించారు. ఇది తక్షణం సమీక్ష చేయాల్సిన చ‌ర్య‌గా బోర్డు అధికారులను ఆదేశించారు.

56
లారా, రిచర్డ్స్, క్లైవ్ లాయిడ్‌కు పిలుపు

బోర్డు చైర్మన్ నిర్ణయంతో, వెస్టిండీస్ క్రికెట్‌లో దిగ్గజాలైన బ్రియన్ లారా, సర్ క్లైవ్ లాయిడ్, వివియన్ రిచర్డ్స్‌లకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. వీరంతా ఇప్పటికే ఉన్న శివనారాయణ చంద్రపాల్, డెస్మండ్ హెయిన్స్, ఇయాన్ బ్రాడ్షా వంటి కమిటీ సభ్యులతో కలిసి చర్చలు జరిపి మౌలిక మార్పులు సూచించనున్నారు.

66
వెస్టిండీస్ బోర్డు, జ‌ట్టులో పెద్ద మార్పుల క‌నిపిస్తాయా?

వెస్టిండీస్ బోర్డు ఈ ఘోర పరాజయాన్ని పాఠంగా తీసుకుని రాబోయే కాలంలో ప్రధాన మార్పులను చేపట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అభిమానులను కూడా ఈ సమయంలో జట్టుకు మద్దతుగా నిలవాలని చైర్మన్ కోరారు. 0-3 తో సిరీస్ కోల్పోయిన వెస్టిండీస్‌కు ఇది మేలుకోలేని దెబ్బ కావొచ్చని చెబుతున్నారు. గ‌తంలో గొప్ప జ‌ట్టుగా సాగిన వెస్టిండీస్ మ‌ళ్లీ పూర్వవైభ‌వం కోసం గట్టి చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశముంది.

Read more Photos on
click me!

Recommended Stories