Hat Tricks in WTC: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో హ్యాట్రిక్ తో స్కాట్ బోలాండ్ సంచలనం సృష్టించాడు. డబ్ల్యూటీసీలో హ్యాట్రిక్ కొట్టిన నలుగురు ఫాస్ట్ బౌలర్లలో భారత స్టార కూడా ఉన్నాడు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) అంటేనే ప్రపంచ దేశాల మధ్య అత్యుత్తమ టెస్ట్ క్రికెట్ పోటీ. ఇందులో హ్యాట్రిక్ సాధించడం అంటేనే గొప్ప ఘనత.
ఇప్పటివరకు కేవలం ఆరుగురు బౌలర్లు మాత్రమే ఈ ఘనతను సాధించగలిగారు. అందులో నలుగురు పేసర్లు ఉండడం విశేషం. ఇప్పుడు ఆ నలుగురు ఫాస్ట్ బౌలర్ల వివరాలు తెలుసుకుందాం.
25
WTC లో తొలి హ్యాట్రిక్ కొట్టిన బౌలర్ జస్ప్రిత్ బుమ్రా
భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో(డబ్ల్యూటీసీ) హ్యాట్రిక్ సాధించిన మొదటి బౌలర్. 2019లో వెస్టిండీస్ పర్యటనలో కింగ్ స్టన్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో బుమ్రా తన మాయాజాలాన్ని చాటాడు. ఒకే ఓవర్‌లో వరుసగా డ్యారెన్ బ్రావో, షమరా బ్రూక్స్, రోస్టన్ చేస్‌లను పెవిలియన్‌కు పంపాడు. ఈ హ్యాట్రిక్‌తో బుమ్రా పేరు అంతర్జాతీయంగా మార్మోగింది.
35
Hat Tricks in WTC: నసీమ్ షా
పాకిస్థాన్‌కు చెందిన నసీమ్ షా కూడా డబ్ల్యూటీసీలో హ్యాట్రిక్ కొట్టాడు. 2020లో బంగ్లాదేశ్‌పై రావల్పిండి టెస్ట్‌లో అతను హ్యాట్రిక్ సాధించాడు. అప్పటికి అతని వయస్సు కేవలం 16 ఏళ్లు మాత్రమే కావడం విశేషం.
నజముల్ హుస్సైన్ షాంటో, తైజుల్ ఇస్లాం, మహ్ముదుల్లాలను వరుసగా పెవిలియన్ కు పంపి నసీమ్ షా చరిత్ర సృష్టించాడు. ఇది పాకిస్థాన్ క్రికెట్ లోనే కాకుండా అంతర్జాతీయ క్రికెట్ లో సంచలనంగా మారింది.
2024 చివరలో న్యూజిలాండ్‌తో వెలింగ్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లాండ్ పేసర్ గస్ అట్కిన్సన్ సూపర్ బౌలింగ్ తో సత్తాచాటాడు. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో నాథన్ స్మిత్, మాట్ హెన్రీ, టిమ్ సౌథీని వరుసగా ఔట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. డబ్ల్యూటీసీలో తన మొదటి సీజన్‌లోనే ఇలాంటి ఘనత దక్కించుకున్నాడు గస్ అట్కిన్ సన్.
55
Hat Tricks in WTC: స్కాట్ బోలాండ్
తాజాగా 2025లో వెస్టిండీస్‌తో జరిగిన మూడో టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ హ్యాట్రిక్ సాధించాడు. నాథన్ లియాన్ డ్రాప్ చేసి బోలాండ్‌ను తీసుకున్న నిర్ణయం కంగారూలకు వరంగా మారింది.
అతను తన ఓవర్ లో జస్టిన్ గ్రీవ్స్, షమార్ జోసెఫ్, జొమెల్ వారికన్‌ను వరుసగా ఔట్ చేసి చరిత్ర సృష్టించాడు. పింక్ బాల్‌తో హ్యాట్రిక్ తీసిన తొలి బౌలర్‌గా ఘనత సాధించాడు.
ఈ నలుగురు పేసర్లు టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో (WTC) చరిత్రలో తమ పేర్లు చిరస్థాయిగా లిఖించుకున్నారు. హ్యాట్రిక్ లతో అదరగొట్టారు. మొత్తంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు కేవలం ఆరు హ్యాట్రిక్స్ మాత్రమే నమోదయ్యాయి. వాటిలో నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు ఈ రికార్డును సాధించారు.