Team India: ఆస్ట్రేలియాతో వన్డీ సిరీస్ ఓటమి తర్వాత టీమిండియా టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. అయితే ఇలాంటి తరుణంలో టీమిండియాకు ఓ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ గాయంతో ఆసుపత్రిలో చేరాడు.
టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ శ్రేయాస్ అయ్యర్ రిబ్ కేజ్ (ఎడమ పక్కటెముక) గాయంతో ప్రస్తుతం ఆస్ట్రేలియాలోని సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని గాయ స్థితి ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉన్నప్పటికీ, వైద్యుల ప్రాథమిక నివేదికల ప్రకారం అతను మైదానంలో తిరిగి ఆడేందుకు కనీసం కొన్ని వారాలు పట్టే అవకాశం ఉంది.
25
సిడ్నీ ఆసుపత్రిలో చికిత్స
శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం సిడ్నీలోని ఆసుపత్రిలో చేరాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రత్యేక వైద్యుడిని అతని పర్యవేక్షణకు నియమించింది. జట్టు వైద్యుడితో పాటు ఆస్ట్రేలియాలో ఉన్న కొంతమంది స్నేహితులు కూడా అతని వద్ద ఉన్నారని తెలుస్తోంది. అతను భారత్‌కు ఎప్పుడు తిరిగి వస్తాడన్న దానిపై క్లారిటీ లేదు. అయితే మరికొన్ని రోజులు అక్కడే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత్ చేరిన తర్వాత బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో మరింత వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉండవచ్చు.
35
గాయానికి కారణం ఏమిటి?
మూడో వన్డే మ్యాచ్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే ప్రయత్నంలో అయ్యర్ గాయపడ్డాడు. వెనక్కి పరుగెత్తి డైవ్ చేసి అద్భుత క్యాచ్ పట్టినా, ఆ క్షణంలోనే అతనికి రిబ్ కేజ్‌లో తీవ్ర నొప్పి కలిగింది. వెంటనే మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. బీసీసీఐ తెలిపిన ప్రకటన ప్రకారం.. "శ్రేయాస్ అయ్యర్ ఎడమ పక్కటెముక వద్ద గాయపడ్డాడు. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో పరీక్షలు, వైద్య పరీక్షలు చేయించుకుంటున్నాడు." అని పేర్కొంది.
భారత జట్టు తదుపరి వన్డే మ్యాచ్ నవంబర్ 30న ఉంది. అంటే ఇంకా ఒక నెల సమయం ఉంది. వైద్యులు అంచనా ప్రకారం అయ్యర్ ఆ సమయానికి ఫిట్‌గా తిరిగి జట్టులో చేరే అవకాశం ఉంది.
55
మరో ఆటగాడు కూడా..
ఆస్ట్రేలియా పర్యటనలో మరో ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డీ కూడా గాయపడ్డాడు. రెండో వన్డేలో క్వాడ్రిసెప్స్ (తొడ కండరాలు) గాయంతో బాధపడ్డాడు. దీంతో మూడో వన్డేకు దూరమయ్యాడు. BCCI తెలిపిన వివరాల ప్రకారం.. "నితీష్ కుమార్ రెడ్డి రెండో వన్డేలో ఎడమ తొడ కండరానికి గాయపడ్డాడు. ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం రోజువారీగా అతని పరిస్థితిని పర్యవేక్షిస్తోంది." అని పేర్కొంది. ఈ గాయం తీవ్రంగా లేదని, టీ20 సిరీస్‌కు అతను అందుబాటులో ఉంటాడని అధికారులు వెల్లడించారు. మొదటి మ్యాచ్ (అక్టోబర్ 29, కాన్బెర్రా) ఆడే అవకాశంపై స్పష్టత లేనప్పటికీ, తర్వాతి మ్యాచ్‌లకు మాత్రం ఫిట్‌గా ఉండే అవకాశముందని జట్టు వర్గాలు చెబుతున్నాయి.