మ‌ళ్లీ వ‌స్తామో లేదో తెలియ‌దు.. రోహిత్ శ‌ర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published : Oct 25, 2025, 09:30 PM IST

IND vs AUS: భార‌త్, ఆస్ట్రేలియాల మ‌ధ్య జ‌రిగిన మూడో వన్డేలో భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. వ‌న్డే సిరీస్ చేజారినా చివ‌రి మ్యాచ్‌లో టీమిండియా ప్లేయ‌ర్స్ అద్భుత ఆట‌తీరుకు క్రికెట్ ల‌వ‌ర్స్ ఫిదా అయ్యారు. . 

PREV
15
ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం

సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో భారత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించింది. కంగారూలు నిర్ధేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా కేవలం 38.2 ఓవర్లలోనే చేధించింది. ఓపెనర్ రోహిత్ శర్మ (121 నాటౌట్) అద్భుత శతకంతో మెరిశాడు. విరాట్ కోహ్లీ (74 నాటౌట్) తన క్లాస్ బ్యాటింగ్‌తో జట్టు విజయానికి స‌హ‌క‌రించాడు. ఈ విజయంతో భారత్ సిరీస్‌ను గెలుచుకోకపోయినా, చివరి మ్యాచ్‌లో ప్రతిష్ఠను నిలబెట్టుకుంది.

25
మ‌ళ్లీ వ‌స్తామో లేదో..

మ్యాచ్ అనంతరం మాట్లాడిన రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఆస్ట్రేలియాలో ఆడటం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభవం. 2008లో ఇక్కడ నా కెరీర్‌లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాను. మళ్లీ ఆస్ట్రేలియాకు వస్తామో లేదో తెలియదు, కానీ ఇక్కడ ఆడిన ప్రతిసారీ అద్భుతంగా అనిపించింది,” అని చెప్పాడు. కోహ్లీ కూడా అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, “మాకు ఇంత స‌పోర్ట్‌ దక్కడం గొప్ప విషయం. రోహిత్ విష‌యంలో కూడా నేను గర్వపడుతున్నా. మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రోత్సహించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు,” అని అన్నాడు.

35
రోహిత్ రికార్డులు

ఈ సెంచ‌రీతో రోహిత్ శర్మ తన కెరీర్‌లో అనేక మైలురాళ్లు సాధించాడు.

* ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక వన్డే సెంచరీలు (6) చేసిన విదేశీ బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు.

* ఆస్ట్రేలియాలో రెండుసార్లు “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డు గెలుచుకున్న తొలి భారత ఆటగాడిగా నిలిచాడు.

* వన్డేల్లో 33వ సెంచరీ సాధించిన రోహిత్, అంతర్జాతీయ కెరీర్‌లో మొత్తం 50వ శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో 12, వన్డేల్లో 33, టీ20ల్లో 5.

* వన్డే చరిత్రలో లేట్ ఏజ్‌లో “ప్లేయర్ ఆఫ్ ది సిరీస్” అవార్డు గెలుచుకున్న భారత ఆటగాడిగా రోహిత్ కొత్త గుర్తింపు పొందాడు.

45
కోహ్లీ అద్భుత మైలురాళ్లు

విరాట్ కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో కొత్త రికార్డులు సాధించాడు.

* 74 పరుగులతో తన బ్యాటింగ్ క్లాస్‌ను మరోసారి చూపించాడు.

* వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కుమార సంగక్కర (14,234)ని అధిగమించి 14,255 పరుగులతో రెండో స్థానానికి చేరుకున్నాడు.

* సచిన్ టెండూల్కర్ (18,426) ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

* ఛేజింగ్‌లో 70 సార్లు 50కిపైగా స్కోరు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ ఘనత సాధించాడు.

* ఆస్ట్రేలియాపై 24 సార్లు 50+ స్కోర్లు సాధించి సచిన్ రికార్డును సమం చేశాడు.

55
రో-కో భాగస్వామ్యం

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జంట మరోసారి జట్టు విజయానికి దారితీసింది. వీరిద్దరూ కలిసి ఇప్పటివరకు వన్డేల్లో 12 సార్లు 150కిపైగా భాగస్వామ్యాలు నెలకొల్పారు. సచిన్–గంగూలీ కూడా ఆ మైలురాయి సాధించింది. రానున్న రోజుల్లో వీరిద్దరూ ఆస్ట్రేలియా గడ్డపై తిరిగి ఆడతారా లేదా అనేది తెలియకపోయినా, వీరి ప్రదర్శనలు మాత్రం అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి.

Read more Photos on
click me!

Recommended Stories