విరాట్ కోహ్లి ఒక్క ఇన్‌స్టా పోస్టుకు ఎంత తీసుకుంటాడో తెలుసా.? మ‌న జీవితం స‌రిపోదు

Published : Oct 25, 2025, 08:39 AM IST

Virat Kohli: టీమిండియా స్టార్ ప్లేయ‌ర్ విరాట్ కోహ్లి ఇటీవ‌ల స‌రైన ఆట‌తీరును క‌న‌బ‌ర‌చ‌డం లేదు. ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న వ‌న్డే సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లోనూ విఫ‌ల‌మ‌య్యాడు. అయితే ఆట‌ప‌రంగా ఎలా ఉన్నా.. సంపాద‌న విష‌యంలో మాత్రం కోహ్లి దూసుకెళ్తున్నాడు 

PREV
15
బీసీసీఐ నుంచి వ‌చ్చే ఆదాయం

విరాట్ కోహ్లీ ప్రస్తుతం BCCI A+ కేటగిరీ కాంట్రాక్ట్‌లో ఉన్నాడు. ఇందుకుగాను కోహ్లీకి రూ. 7 కోట్ల వార్షిక జీతాన్ని అందిస్తారు. ప్ర‌తీ ఒక్క టెస్ట్ మ్యాచ్‌కు రూ. 15 ల‌క్ష‌లు, వన్డే మ్యాచ్‌కు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు అందిస్తారు. ఇవి BCCI కాంట్రాక్ట్ ప్రకారం నిర్ణయించిన స్థిరమైన పారితోషికాలు.

25
IPLలో విరాట్ భారీ పేమెంట్

కోహ్లీ ఐపీఎల్ ప్రారంభం నుంచీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుతోనే ఉన్నాడు. 2024 సీజన్ జీతం రూ. 21 కోట్లు చెల్లించారు. ఈ మొత్తంతో కోహ్లీ ఐపీఎల్‌లో అత్యధిక పారితోషికం పొందే భారత ఆటగాళ్లలో ఒకరిగా నిలిచాడు.

35
ప్రక‌టన‌ల‌తో క‌ళ్లు చెదిరే ఆదాయం

విరాట్ కోహ్లీ ప్రధాన ఆదాయం బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ ద్వారానే వస్తుంది. పూమా, ఆడి, MRF, టిస్సోట్, మింత్రా, బ్లూ ట్రైబ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు ఆయన అంబాసిడర్‌గా ఉన్నారు. ఒక్క బ్రాండ్‌కి కోహ్లి సుమారు రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల వ‌ర‌కు తీసుకుంటున్నాడు. నివేదికల ప్రకారం, కోహ్లీ మొత్తం ఆదాయంలో దాదాపు 70 శాతం ప్రకటనల నుంచే వస్తుంది.

45
బ్రాండ్ విలువలో విరాట్ టాప్‌లో

2024 క్రోల్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ ప్రకారం, విరాట్ కోహ్లీ బ్రాండ్ విలువ సుమారు రూ. 2,048 కోట్లుగా ఉంది. ఇది కోహ్లీని భారతదేశంలోనే కాకుండా ఆసియాలో కూడా అగ్రస్థానంలో ఉన్న బ్రాండ్ అంబాసిడర్‌గా నిలబెట్టింది.

55
సోషల్ మీడియా స్టార్‌గా విరాట్

ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో విరాట్‌కు కోట్లాది అభిమానులు ఉన్నారు. ఒక్క పోస్ట్‌కే ఆయనకు బ్రాండ్‌ల నుంచి పెద్ద మొత్తంలో పారితోషికం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా విరాట్ ఇమేజ్ కారణంగా కంపెనీలు ఆయనను బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా నియ‌మించుకుంటున్నాయి. విరాట్ కోహ్లీ ఒక్కో పోస్టుకు ఏకంగా రూ. 12 కోట్లు తీసుకుంటున్నాడట. ఇన్ స్టాగ్రామ్ లో కోహ్లీకి 274 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.

Read more Photos on
click me!

Recommended Stories