T20 worldcup 2021: విరాట్‌ను ఊరిస్తున్న రికార్డులు... మొట్టమొదటి, చివరి టీ20 ప్రపంచకప్‌లో...

First Published Oct 21, 2021, 7:11 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ, కెప్టెన్‌గా విరాట్ కోహ్లీకి మొట్టమొదటి టీ20 ప్రపంచప్, ఇదే చివరిది కూడా. పొట్టి ఫార్మాట్‌లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్న విరాట్ కోహ్లీకి టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి...

టీ20 వరల్డ్‌కప్లో 11 సార్లు 30+ స్కోర్లు చేసి విరాట్ కోహ్లీ, మరో నాలుగు సార్లు ఆ స్కోరు చేస్తే అత్యధిక సార్లు ఆ ఘనత సాధించిన ప్లేయర్‌గా నిలుస్తారు... శ్రీలంక మాజీ క్రికెటర్లు దిల్షాన్, జయవర్థనే 14 సార్లు ఈ ఫీట్ సాధించి టాప్‌లో ఉన్నారు...

రెండు టీ20 వరల్డ్‌కప్ టోర్నీల్లో 100+ సగటుతో పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ. 2014 టీ20 వరల్డ్‌కప్‌లో 106.33 సగటుతో పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, 2016లో 136.50 సగటుతో పరుగులు సాధించాడు...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మెన్ కూడా విరాట్ కోహ్లీయే. పాక్‌పై విరాట్ 169 పరుగులు చేయగా, గౌతమ్ గంభీర్ 75, రోహిత్ శర్మ 64 పరుగులతో తర్వాతి స్థానాల్లో ఉన్నారు...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచుల్లో 2012లో 78, 2014లో 36, 2016లో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు విరాట్ కోహ్లీ... ఇప్పటిదాకా టీ20 వరల్డ్‌కప్‌లో పాక్ బౌలర్లు, విరాట్‌ను అవుట్ చేయలేకపోయారు...

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక సార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలిచిన భారత ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీయే... విరాట్ ఐదు సార్లు ఈ అవార్డులు గెలవగా, యువీ, అశ్విన్ మూడేసి సార్లు, అమిత్ మిశ్రా రెండుసార్లు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు..

ఇదేకాకుండా విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు 200కి పైగా పరుగులు చేసిన ప్రతీసారీ విజయం సాధించింది. 8సార్లు 200+ పరుగుల స్కోరుని కాపాడుకుంటూ మ్యాచ్ గెలిచిన విరాట్ సేన, రెండు మ్యాచుల్లో ఈ లక్ష్యాన్ని ఛేదించి విజయం అందుకుంది...

అత్యధిక సార్లు 50+ స్కోర్లు చేసి జట్టును గెలిపించిన ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీయే. టీ20 వరల్డ్‌కప్‌లో విరాట్ 50+ స్కోరు చేసిన ఏడు మ్యాచుల్లో భారత జట్టు విజయం సాధించగా, క్రిస్ గేల్ 6, జయవర్థనే, రోహిత్ శర్మ, షేన్ వాట్సన్ ఐదేసి సార్లు ఈ ఫీట్ సాధించారు..

టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక స్ట్రైయిక్ రేటు కలిగిన భారత ప్లేయర్ కూడా విరాట్ కోహ్లీయే... విరాట్ కోహ్లీ స్ట్రైయిక్ రేటు 133+ గా ఉండగా, సురేష్ రైనా 130.1, యువరాజ్ సింగ్ 128.9, రోహిత్ శర్మ 127.2 స్ట్రైయిక్ రేటుతో పరుగులు చేశారు...

ఇవీ చదవండి: T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

 T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

T20 worldcup 2021: అయ్యో బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

 T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

click me!