T20 worldcup 2021: టీమిండియా కోచ్‌గా మారిన మెంటర్ ధోనీ... మరి రవిశాస్త్రి ఏం చేస్తున్నట్టు...

First Published Oct 21, 2021, 5:08 PM IST

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేకుండా టీమిండియా ఆడుతున్న మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ టోర్నీ ఇదే. మొట్టమొదటి టీ20 వరల్డ్‌కప్ 2007లో టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపిన మాహీ... ఆ తర్వాత ఆరు సీజన్లలో టైటిల్ అందించలేకపోయాడు...

మాహేంద్ర సింగ్ ధోనీ అనుభవం, టీ20 మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్‌గా అతనికి ఉన్న రికార్డు సాయం అవుతుందనే ఉద్దేశంతో టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో టీమిండియాకి మెంటర్‌గా నియమించింది బీసీసీఐ...

మెంటర్‌గా ఎమ్మెస్ ధోనీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎక్కడ చూసినా మాహీ నామస్మరణే వినిపిస్తోంది. ముఖ్యంగా భారత జట్టు వార్మప్ మ్యాచులు ఆడిన సమయాల్లోనూ ధోనీయే హైలెట్ అయ్యాడు...

మెంటర్‌గా ఆటగాళ్లకు విలువైన సలహాలు ఇచ్చేందుకు చాలా సమయం ఉంటుంది. అయితే ఓ వైపు వార్మప్ మ్యాచ్ జరుగుతుంటే బౌండరీ లైన్ దగ్గర రిషబ్ పంత్‌కి కీపింగ్ మెలకువలు చెబుతూ కనిపించాడు మాహీ...

మెంటర్‌గా వ్యవహరిస్తున్నందుకు మాహీ ఏం ఛార్జ్ చేయడం లేదని బీసీసీఐ సెక్రటరీ జే షా తెలిపాడు. అయితే మాహీ వాలకం చూస్తుంటే మాత్రం భారత హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకునేందుకు ఈ అవకాశాన్ని వాడుకుంటున్నట్టు ఉందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు...

ఆటగాళ్లతో తన అనుభవంలో నుంచి సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే, అది డ్రెస్సింగ్ రూమ్‌లో కూడా చేయొచ్చు. ఇలా మ్యాచ్ జరుగుతుంటే బౌండరీ లైన్ దగ్గరే షో చేయాల్సిన అవసరం లేదంటున్నారు మరికొందరు నెటిజన్లు...

మాహీ ఫ్యాన్స్ మాత్రం కోచ్ ఎలా ఉండాలో మాహీని చూసి నేర్చుకోవాలంటూ రవిశాస్త్రిని ట్రోల్ చేస్తున్నారు. డగౌట్‌లో కూర్చొని కునుకు తీయడం తప్ప, ఎప్పుడైనా ఇలా ఆన్ స్పాట్ ట్రైనింగ్ ఇచ్చావా... అంటూ రవిశాస్త్రిని ట్రోల్ చేస్తున్నారు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రియే. అయితే ప్రస్తుతం మాహీ వాలకం చూస్తుంటే... అతనే హెడ్‌కోచ్, బ్యాటింగ్ కోచ్, ఫీల్డింగ్ కోచ్ అయినట్టుగా ఉందని అంటున్నారు నెటిజన్లు..

మరోవైపు ప్రాక్టీస్ మ్యాచుల్లో భారత జట్టు ప్రదర్శనకి మాహీయే కారణమంటూ.. ఏ ప్లేయర్ సిక్సర్ కొట్టినా, బౌండరీ బాదినా, క్యాచ్ పట్టినా... ‘ధోనీ ఎఫెక్ట్’ అంటూ కొందరు కామెంటేటర్లు చెబుతున్న వ్యాఖ్యానం చాలామందికి చిరాకు తెప్పిస్తోంది...

భారత జట్టు రెండేళ్లుగా మాహీ లేకుండా క్రికెట్ ఆడుతోంది. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్‌లో ఘన విజయాలు అందుకుంది. టీ20ల్లోనూ ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాల్లో సిరీస్ గెలిచి, రికార్డు క్రియేట్ చేసింది. ఎప్పుడో ఆట నేర్చుకుంటున్నట్టు మాహీ భజన చేయడం కరెక్ట్ కాదని చెబుతున్నారు టీమిండియా అభిమానులు...

ఇవీ చదవండి: T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

T20 worldcup 2021: అయ్యో బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

 T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

click me!