T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

Published : Oct 21, 2021, 06:09 PM ISTUpdated : Oct 21, 2021, 06:17 PM IST

ఆస్ట్రేలియా టాలెంటెడ్ ప్లేయర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. స్టీవ్ స్మిత్ కంటే వేగంగా, ఆరోన్ ఫించ్ కంటే చూడచక్కగా ఉంంటుంది డేవిడ్ వార్నర్ బ్యాటింగ్. ఇప్పుడతని ఫామ్‌పై పలు అనుమానాలు రేగుతున్నాయి. దానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ చేసిన పనులే కారణమంటున్నాడు ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్‌లీ...

PREV
112
T20 worldcup 2021: సన్‌రైజర్స్ జట్టు, వార్నర్‌ను అవమానించింది... ఐపీఎల్ వల్లే అతనిలా ఆడుతున్నాడు...

David Warner

టీ20 వరల్డ్‌కప్ 2021  వార్మప్ మ్యాచుల్లో రెండింట్లో కలిపి 1 పరుగు మాత్రమే చేశాడు డేవిడ్ వార్నర్. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 7 బంతులాడి 1 పరుగుకే అవుటైన వార్నర్, న్యూజిలాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు.

212

ఐపీఎల్ 2020 సీజన్‌లో 600+ పైగా పరుగులు చేసి, ఆరెంజ్ క్యాప్ రేసులో కెఎల్ రాహుల్‌తో పోటీపడిన డేవిడ్ వార్నర్... ఆ తర్వాత ఆస్ట్రేలియా, భారత్ వన్డే సిరీస్‌లోనూ వరుసగా రెండు హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు..

312

రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన డేవిడ్ వార్నర్, ఆ తర్వాత మూడో వన్డేతో పాటు టీ20 సిరీస్, మొదటి రెండు టెస్టులకు దూరమయ్యాడు...

412

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా చేతుల్లో ఊహించని ఓటమిని చవిచూసిన ఆసీస్... డేవిడ్ వార్నర్ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోయినా సిడ్నీ టెస్టులో బరిలో దింపింది... ఫలితంగా వార్నర్ భాయ్ పరుగులేమీ చేయకపోగా, గాయం మళ్లీ తిరగబెట్టింది...

512

గాయం కారణంగా సుదీర్ఘ విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించడంతో చాలాకాలం క్రికెట్‌కి దూరంగా ఉండి.. ఐపీఎల్ మీద ఉన్న ఇష్టంతో ఫేజ్ 1లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున బరిలో దిగాడు డేవిడ్ వార్నర్...

612

గత ఐదు సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి లీడింగ్ రన్ స్కోరర్‌గా ఉంటున్న డేవిడ్ వార్నర్, ఫస్టాఫ్‌లో 6 మ్యాచులు ఆడి రెండు హాఫ్ సెంచరీలతో 190+ పరుగులు చేశాడు...

712

అయితే మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా వార్నర్‌ను సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తొలగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

812

‘టీ20 ఫార్మాట్‌లో డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియాకి చాలా కీలకమైన ప్లేయర్. అతనిలో పరిస్థితులకు తగ్గట్టుగా తనని తాను మలుచుకుని ఆడే ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. అందుకే ఆసీస్ డేవిడ్ వార్నర్ కీ ప్లేయర్...

912

అయితే ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్‌ అవమానాలను ఎదుర్కొన్నాడు. కెప్టెన్సీ నుంచి తొలగించబడి, జట్టులో నుంచి తీసేయబడ్డాడు... ఈ సంఘటనలు అతన్ని మానసికంగా దెబ్బతీశాయి..

1012

అందుకే ఐపీఎల్ నుంచి ఇంకా బయటికి రాలేకపోతున్నాడు. కెప్టెన్‌ని మార్చాలని అనుకుంటే, దాన్ని ఎంతో సున్నితంగా డీల్ చేయొచ్చు. కానీ వార్నర్‌తో సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ప్రవర్తించిన తీరు దారుణం...

1112

డేవిడ్ వార్నర్‌తో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ స్టార్క్ పర్ఫామెన్స్ ఆసీస్‌కి కీలకం కానుంది. జోష్ హజల్‌వుడ్ ఐపీఎల్‌లో బాగా రాణించాడు. ప్యాట్ కమ్మిన్స్ ఇప్పుడు ఆసీస్‌కి సూపర్ స్టార్...’ అంటూ కామెంట్ చేశాడు ఆసీస్ మాజీ పేసర్ బ్రెట్ లీ...

1212

డేవిడ్ వార్నర్ ఎపిసోడ్‌కి ప్రధాన సూత్రధారిగా చెబుతున్న ప్రస్తుత సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సీఈవో టామ్ మూడీ,  ఎస్‌ఆర్‌హెచ్ హెడ్‌కోచ్ ట్రేవర్ బేసిస్ ఇద్దరూ కూడా ఆస్ట్రేలియాకి చెందిన వారే కావడం మరో విశేషం...

 

ఇవీ చదవండి: T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

 T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

T20 worldcup 2021: అయ్యో బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

 T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

click me!

Recommended Stories