T20 worldcup 2021: నాలుగేళ్లు, రూ.36 వేల కోట్లు... ఐపీఎల్ ప్రసార హక్కుల ద్వారా బీసీసీఐకి కాసుల పంట...

First Published Oct 21, 2021, 4:23 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ తర్వాత న్యూజిలాండ్‌తో సిరీస్, ఆ తర్వాత సౌతాఫ్రికా టూర్, ఇంగ్లాండ్ టూర్, ఐపీఎల్ 2022... ఇలా టీమిండియా షెడ్యూల్‌లో వచ్చే ఆరేడు నెలల్లో అసలు తీరికే లేదు. ఇంత బిజీ షెడ్యూల్‌ను బిజినెస్ పాయింట్‌లో బాగా వర్కవుట్ చేసుకుంటోంది బీసీసీఐ...

 ఐపీఎల్‌ 2022 సీజన్‌లో మరో రెండు కొత్త జట్లు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఇన్నాళ్లు 60 రోజుల పాటు సాగిన ఐపీఎల్ పండగ, ఇకపై 74 రోజుల పాటు సాగుతుంది...

దీంతో ప్రసార హక్కులకు భారీగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం బీసీసీఐకి చెందిన ఐపీఎల్‌తో పాటు టీ20 వరల్డ్‌కప్ వంటి టోర్నీలను ప్రసారం చేస్తున్న స్టార్ ఇండియా కంపెనీ కాంట్రాక్ట్ గడువు, వచ్చే ఏడాదితో ముగియనుంది. 

2018లో బీసీసీఐకి మీడియా రైట్ల కోసం 2018-22 సీజన్‌ కోసం రూ.16,348 కోట్లు చెల్లించింది స్టార్ ఇండియా కంపెనీ. ఇప్పుడు అది దాదాపు రెట్టింపు అయ్యిందని సమాచారం...

మీడియా ప్రసార హక్కుల కోసం స్టార్ ఇండియా, సోనీతో పాటు మరో అమెరికా కంపెనీ కూడా పోటీపడుతోంది. దీంతో వచ్చే 2023 నుంచి 2027 వరకూ నాలుగేళ్ల కాలానికి దాదాపు 5 బిలియన్ డాలర్లు (దాదాపు 36 వేల కోట్లకు పైగా) చెల్లించేందుకు సిద్ధమవుతున్నాయట ఈ కంపెనీలు...

‘అమెరికాకు చెందిన ఓ ప్రముఖ కంపెనీ, ఐపీఎల్ ప్రసార హక్కుల కోసం బిడ్ వేసేందుకు ఆసక్తిగా ఉన్నట్టు తెలియ చేసింది. 2022 నుంచి 10 టీమ్స్‌ ఆడుతుండడంతో 74 మ్యాచుల ప్రసారం కోసం భారీగా డబ్బులు చెల్లించేందుకు వాళ్లు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది... ’ అంటూ ఓ బీసీసీఐ అధికారి తెలియచేశారు...

ఇప్పటికే అదనంగా చేరే రెండు కొత్త కొత్త జట్ల ద్వారా దాదాపు రూ.7 వేల నుంచి రూ.10 వేల కోట్ల వరకూ ఆదాయాన్ని ఆర్జించబోతోంది బీసీసీఐ. ఇప్పుడు ప్రసార హక్కుల రూపంలోనూ భారత క్రికెట్ బోర్డుపైన కోట్ల వర్షం కురవనుంది..

ఐపీఎల్ 2020 సీజన్‌కి రికార్డు లెవెల్లో వ్యూయర్‌షిప్ కాగా, కరోనా కారణంగా చరిత్రలో మొట్టమొదటిసారి రెండు ఫేజ్‌లుగా జరిగిన ఐపీఎల్ 2021కి అంతకుమించిన టీఆర్పీ వచ్చింది.

ఇవీ చదవండి: T20 worldcup 2021: బౌలింగ్‌లో అతన్ని మించిన తోపు లేడు... ఇర్ఫాన్ పఠాన్ కామెంట్..

T20 worldcup 2021: అయ్యో బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

 T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

click me!