Published : Oct 21, 2021, 03:50 PM ISTUpdated : Oct 21, 2021, 04:00 PM IST
టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ముందు టీమిండియాని భయపెడుతున్న విషయం భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా... బుమ్రా ఫామ్‌లోనే ఉన్నాడు, కానీ అతనికి ఐసీసీ టోర్నీల్లో ఏ మాత్రం మెరుగైన రికార్డు లేదు...
T20 వరల్డ్‌కప్ 2021: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2017 ఫైనల్‌లో బుమ్రా వేసిన నో బాల్ ఇప్పటికే ట్రోలింగ్‌కి టార్గెట్ అవుతూనే ఉంది. ఆ తర్వాత 2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో పర్వాలేదనిపించాడు బుమ్రా...
28
అయితే ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు బుమ్రా.. బుమ్రా ఒక్కడూ తన రేంజ్‌లో పర్ఫామ్ చేసి ఉంటే, పరిస్థితి వేరేగా ఉండేదని ట్రోల్స్ వినిపించాయి...
38
27 ఏళ్ల జస్ప్రిత్ బుమ్రాపై టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఐపీఎల్ 2020లో 27 వికెట్లు, 2021 సీజన్‌లో 21 వికెట్లు తీసిన బుమ్రా, టీ20 వరల్డ్‌కప్ అలాంటి పర్ఫామెన్స్ ఇస్తే, టీమిండియా టైటిల్ ఆశలు దాదాపు నెరవేరినట్టే...
48
‘బౌలింగ్ విషయానికి వస్తే, టీమిండియాలో బుమ్రాని మించిన తోపు ఎవ్వరూ లేరు. భారత జట్టులోనే కాదు, మిగిలిన ఏ టీమ్‌లోనూ బుమ్రాలాంటి బౌలర్ లేడు...
58
టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి భారత జట్టుకి అసలైన గేమ్ ఛేంజర్ బుమ్రానే అవుతాడు.. జట్టులో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, వరుణ్ చక్రవర్తి వంటి ఎందరున్నా... మ్యాచ్ విన్నర్ మాత్రం బుమ్రానే...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్...
68
భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కూడా, ఇర్ఫాన్ పఠాన్ వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్టు కామెంట్ చేశాడు. ‘బుమ్రా ఫామ్‌లో ఉంటే ఎలాంటి బ్యాట్స్‌మెన్‌నైనా అవుట్ చేయగలడు.
78
వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్ కూడా బుమ్రాను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడతారు...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...
88
ఇంగ్లాండ్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన బుమ్రా, 26 పరుగులు ఇచ్చి అద్భుతమైన యార్కర్‌తో జానీ బెయిర్‌స్టోని క్లీన్ బౌల్డ్ చేశాడు...