T20 worldcup 2021: బాబోయ్, నేనెప్పుడూ అలా చెప్పలేదు... వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే పెళ్లి అంటే...

First Published Oct 21, 2021, 3:18 PM IST

T20 worldcup 2021:  తాలిబన్ల రాజ్యం ఆఫ్ఘాన్‌కి ఆశాకిరణంగా మారాడు ఆల్‌రౌండర్ రషీద్‌ఖాన్. 23 ఏళ్ల వయసులోనే టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు రషీద్ ఖాన్...

T20 వరల్డ్‌కప్ 2021: ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఆడే రషీద్ ఖాన్, బిగ్‌బాష్ లీగ్, లంక ప్రీమియర్ లీక్, పాక్ సూపర్ లీగ్... ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని టీ20 లీగుల్లోనూ పాల్గొంటున్నాడు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో నేరుగా సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించిన ఆఫ్ఘనిస్తాన్... గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లతో తలబడనుంది...

ఆఫ్ఘాన్‌కి వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత తాను పెళ్లి చేసుకుంటానని, అప్పటిదాకా ఎంగేజ్‌మెంట్ గురించి ఆలోచించనని రషీద్ ఖాన్ కామెంట్ చేసినట్టు, కొన్నాళ్ల కిందట వార్తలు వైరల్ అయ్యాయి...

అడపాదడపా విజయాలు అందుకుంటున్నా, వరల్డ్ కప్ గెలవాలంటే ఇండియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ వంటి టాప్ టీమ్‌లను ఓడించాల్సి ఉంటుంది...

ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆఫ్ఘాన్, కరెక్టుగా ఫోకస్ పెట్టినా వరల్డ్‌కప్ లాంటి టోర్నీని సొంతం చేసుకోవాలంటే మరో 10, 15 ఏళ్లయినా పడుతుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా...

అలా చూసుకుంటే రషీద్ ఖాన్ నిజంగా తన వ్యాఖ్యలకి కట్టుబడి ఉంటే, ఆఫ్ఘాన్ వరల్డ్‌కప్ గెలిచే సమయానికి అతనికి 40 ఏళ్లు వచ్చేస్తాయని ట్రోల్స్ వినిపించాయి...

‘నిజానికి నేను ఈ వార్త విని షాక్ అయ్యాను. ఎందుకంటే నేనెప్పుడూ నా పర్సనల్ లైఫ్‌కీ, క్రికెట్‌కి ముడిపెట్టలేదు. వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ చెప్పలేదు...

నేనేం చెప్పానంటే వచ్చే మూడేళ్లు చాలా బిజీగా ఉండబోతున్నా. 2021, 2022, 2023లో వన్డే వరల్డ్‌కప్ టోర్నీలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నా ఫోకస్ అంతా వాటిపైనే ఉందని చెప్పా...

అంతే తప్ప వరల్డ్‌కప్ గెలిచిన తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తానని అనలేదు... ’ అంటూ క్లారిటీ ఇచ్చాడు ఆఫ్ఘాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్...

తొలుత టీ20 వరల్డ్‌కప్ టోర్నీకి కెప్టెన్‌గా ఎంపికయ్యాడు రషీద్ ఖాన్. అయితే ఆఫ్ఘాన్ క్రికెట్ బోర్డుతో చర్చించిన రషీద్ ఖాన్, ఆ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

‘యూఏఈ పిచ్‌లు స్పిన్నర్లకు చక్కగా సహకరిస్తాయి. అందుకే ఇది స్పిన్నర్ల వరల్డ్‌కప్ అవుతుందని నేను అనుకుంటున్నా... నా జట్టు విజయం కోసం నేనేం చేయాలో అది చేస్తా...’ అంటూ కామెంట్ చేశాడు రషీద్ ఖాన్..

Must READ: T20 worldcup 2021: ఆసీస్‌తో వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం... రోహిత్, కెఎల్ రాహుల్...

T20 worldcup 2021: రోహిత్ కెప్టెన్సీలో ఆల్‌రౌండర్‌గా కోహ్లీ... వార్మప్ మ్యాచ్‌లో విరాట్ బౌలింగ్‌‌పై...

రిషబ్ పంత్‌కి ఛాన్సే లేదు, విరాట్ కోహ్లీ తర్వాత అతనే టీ20 కెప్టెన్... భారీ ఈవెంట్‌ పెట్టి మరీ...

click me!