T20 Double Century: టీ20లో 300కు పైగా స్ట్రైక్ రేట్‌తో సెంచరీలు బాదిన ప్లేయర్లు కొంత మంది ఉన్నారు. అయితే, వారిలో టీ20లో డబుల్ సెంచరీ కొట్టగల సత్తా ఉన్న టాప్ 5 ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
టీ20 క్రికెట్ అనేది ఎప్పుడూ ఉత్కంఠభరితంగా ఉండే ఫార్మాట్. ఈ పొట్టి ఫార్మాట్‌లో ఎక్కువగా బ్యాటర్ల సునామీ ఉంటుంది. బౌలర్లు తరచూ బ్యాటర్ల దాడికి బలవుతుంటారు. ఇప్పటికే అనేకమంది ఆటగాళ్లు టీ20లో సునామీ నాక్ లతో సెంచరీల మోత మోగించారు.
అయితే 300కు పైగా స్ట్రైక్ రేట్‌తో సెంచరీలు బాదిన ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. అద్భుతమైన స్ట్రైక్ రేటుతో సెంచరీలు బాదిన ఐదుగురు బ్యాటర్లు ప్రస్తుతం టీ20లో డబుల్ సెంచరీ కొట్టగల సత్తా ఉన్నవారిగా క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్, వేగం, భారీ ఇన్నింగ్స్‌లు ఆడగల సత్తా ఉన్న ఆ ఐదుగురు ప్లేయర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
DID YOU KNOW ?
వన్డే క్రికెట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ వన్డే క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ (44 బంతుల్లో 149 రన్స్) కొట్టిన రికార్డును కలిగి ఉన్నాడు. అతను కేవలం 31 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. (WI v SA ODI, Johannesburg, 18 January 2015)
26
1. అభిషేక్ శర్మ
ఇండియన్ యంగ్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఇటీవల తన ధనాధన్ బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నారు. టీ20 ఇంటర్నేషనల్‌లో ఇప్పటికే సెంచరీ కొట్టిన ఈ యంగ్ స్టార్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన ఇచ్చారు.
పంజాబ్ తరఫున మెఘాలయపై జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 28 బంతుల్లోనే సెంచరీ కొట్టి సునామీ రేపాడు. ఏకంగా 365.52 స్ట్రైక్ రేట్‌తో సెంచరీ నాక్ ఆడాడు. ఇది టీ20లో అత్యంత వేగవంతమైన సెంచరీలలో ఒకటిగా నిలిచింది.
36
2. సాహిల్ చౌహాన్
ఎస్టోనియా తరఫున ఆడుతున్న సాహిల్ చౌహాన్ దూకుడు బ్యాటింగ్ తో తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు సాధించారు. సైప్రస్‌పై ఆడిన అతను కేవలం 27 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
ఈ సెంచరీ నాక్ ను సాహిల్ చౌహాన్ 351.21 స్ట్రైక్ రేట్ తో సాధించడం విశేషం. ఇది అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత వేగంగా సాధించిన సెంచరీలలో ఒకటిగా గుర్తింపు సాధించింది.
భారతదేశానికి చెందిన మరో యంగ్ బ్యాట్స్‌మన్ ఉర్విల్ పటేల్ కూడా ఈ జాబితాలో స్థానం సంపాదించాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త్రిపురపై ఆడిన మ్యాచ్‌లో కేవలం 28 బంతుల్లో సెంచరీతో అదరగొట్టాడు. అతను 322.85 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ కొనసాగిస్తూ సెంచరీని సాధించాడు. ఇది సికందర్ రజా గతంలో నెలకొల్పిన ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును అధిగమించింది.
56
4. సికందర్ రజా
జింబాబ్వేకు చెందిన సికందర్ రజా 2024 అక్టోబర్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో కేవలం 33 బంతుల్లోనే 143 పరుగుల సునామీ నాక్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్‌లో అతని స్ట్రైక్ రేట్ 309.30గా నమోదైంది. సికందర్ రజా బ్యాటింగ్ దూకుడు, బౌలర్లపై ఎదురుదాడి సామర్థ్యం టీ20లో అతడిని అత్యుత్తమ ఆటగాడిగా నిలిపింది.
66
5. రిషభ్ పంత్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్ 2018లో ఢిల్లీ తరఫున హిమాచల్‌పై ఆడినప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో సెంచరీతో దుమ్మురేపాడు. 305.26 స్ట్రైక్ రేట్‌తో రికార్డు సెంచరీని సాధించాడు. అప్పట్లో ఇది అత్యుత్తమ సెంచరీలలో ఒకటిగా నిలిచింది.
ఈ ఐదుగురు ఆటగాళ్లు టీ20 ఫార్మాట్‌లో బ్యాటింగ్‌ను పూర్తిగా మార్చేసే శక్తిని కలిగి ఉన్నారు. వీరిలో నుంచి ఎవరో ఒకరు భవిష్యత్తులో టీ20లో డబుల్ సెంచరీ సాధించే ఛాన్స్ ఉంది. 300కు పైగా స్ట్రైక్ రేట్‌తో సెంచరీలు సాధించగలిగిన వీరి సామర్థ్యం, దూకుడు ప్రపంచ టీ20 క్రికెట్‌ను కొత్త స్థాయికి తీసుకెళ్తుంది.