RCB vs PBKS IPL 2025 Final: ఐపీఎల్ 2025 ఫైనల్ లో ఆర్సబీ vs పీబీకేఎస్ జట్లు తలపడనున్నాయి. అయితే, బెంగళూరు vs పంజాబ్ ఐపీఎల్ 2025 ఫైనల్‌కు వర్షం అడ్డంకిగా మారితే ఏం జరుగుతుంది? ట్రోఫీని అందుకునేది ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
IPL 2025 Finals: బెంగళూరు vs పంజాబ్ మ్యాచ్ పై ఉత్కంఠ
IPL 2025 final RCB vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) - పంజాబ్ కింగ్స్ (PBKS) జట్ల మధ్య జూన్ 3న జరగనుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ బిగ్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.
25
ఐపీఎల్ 2025 ఫైనల్ ను వర్షం దెబ్బకొడుతుందా?
ఐపీఎల్ 2025 ఫైనల్ కు వర్షం ముప్పు పొంచివుంది. ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతుండటంతో మ్యాచ్ కూడా వర్షంలో మునిగిపోతుందనే ఆందోళనలు ఉన్నాయి. జూన్ 3న అహ్మదాబాద్ లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశముంది. పిగులుగు పడే ఛాన్స్ కూడా వుందని భారత వాతారణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. మ్యాచ్‌కు ఆటంకం కలగవచ్చని అధికారులు భావిస్తున్నారు.
35
తొలిసారి ఐపీఎల్ ఫైనల్ ఆడుతున్న బెంగళూరు-పంజాబ్ జట్లు
ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేని రెండు జట్లు ఇప్పుడు తమ తొలి కప్ ఆశతో ఫైనల్‌కు చేరుకున్నాయి. విరాట్ కోహ్లీ టీమ్ ఆర్సీబీ క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్ పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచిన బలంతో ముందంజలో ఉంది. ఇక పంజాబ్ టీమ్ క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్ కు చేరుకుంది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌ను జూన్ 3న పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వర్షం మ్యాచ్ కు ఆటంకం కలిగించినా అదనంగా కేటాయించిన రెండు గంటల సమయాన్ని మ్యాచ్ ను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. దీంతో పాటు మ్యాచ్ కు రిజర్వు డే కూడా ఉంది. ఆగకుండా వర్షం పడితే మ్యాచ్‌ను రిజర్వ్ డే అయిన జూన్ 4కు మారుస్తారు.
55
ఐపీఎల్ 2025 ఫైనల్ రిజర్వు డే లో కూడా మ్యాచ్ కు వర్షం అడ్డుపడితే ఏం జరుగుతుంది?
రెండు రోజులు కూడా ఫైనల్ మ్యాచ్ ఆట జరుగకపోతే, లీగ్ దశలో టాప్ లో నిలిచిన జట్టుకు ఐపీఎల్ 2025 టైటిల్ దక్కుతుంది. ఈ సీజన్‌లో శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఆడిన 14 మ్యాచ్‌లలో 9 విజయాలతో టేబుల్‌లో టాప్ లో నిలిచింది. కాబట్టి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ పూర్తిగా రద్దైతే ఐపీఎల్ 2025 టైటిల్ పంజాబ్ కింగ్స్ గెలుచుకుంటుంది.
మ్యాచ్ టైగా ముగియడమో, వర్షం వల్ల నిలిచిపోవడమో జరిగితే, విజేతను నిర్ణయించడానికి సూపర్ ఓవర్‌ను ఉపయోగిస్తారు. సూపర్ ఓవర్ కూడా టై అయితే, మరిన్ని సూపర్ ఓవర్లు ఆడిస్తారు. ఈ నేపథ్యంలో అభిమానులు, ఆటగాళ్లు, నిర్వాహకులు అందరూ మ్యాచ్ కు వర్షం అడ్డుపడకూడదని ఆశిస్తున్నారు.