Siraj: లార్డ్స్ టెస్టులో భారతీయుల గుండెలు పగిలాయి.. గ్రౌండ్ లోనే ఏడ్చిన సిరాజ్

Published : Jul 14, 2025, 11:33 PM IST

Mohammed Siraj: లార్డ్స్ టెస్టులో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. సిరాజ్ ఔటైన వెంటనే గ్రౌండ్ లోనే ఏడ్చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు వైర‌ల్ గా మారాయి.

PREV
15
లార్డ్స్ టెస్టులో భారత్ కు బిగ్ షాక్

లండ‌న్ లోని లార్డ్స్ వేదిక‌గా జ‌రిగిన‌ టెస్ట్ మ్యాచ్‌లో భారత్‌కు బిగ్ షాక్ త‌గిలింది. మూడవ టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 22 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. నాలుగో రోజు ఇంగ్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ అయింది. భార‌త్ ముందు 193 ప‌రుగుల టార్గెట్ ను ఉంచింది. అయితే, ఐదో రోజు చివరి సెషన్‌లో 170 పరుగులకు టీమిండియా ఆలౌట్ అయింది.

గెలుపు ద‌గ్గ‌ర‌గా వ‌చ్చి ఓడిపోయింది

గెలుపు కోసం చివరి వ‌ర‌కు భార‌త్ పోరాటం చేసింది. అయితే, కేవలం 23 పరుగుల దూరంలో ఆగిపోయింది. షోయబ్ బషీర్ వేసిన బంతిని సిరాజ్ ఆడాడు. అయితే, బంతిని డిఫెన్స్ చేసిన సిరాజ్‌కి ఆశించిన ఫలితం రాలేదు. బంతి నెమ్మదిగా వికెట్లను తాకి బెయిల్స్ కింద‌ప‌డేసింది. దీంతో అత‌ను అవుట్ అయ్యాడు. దీంతో కోట్లాది మంది భార‌తీయులు తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు. అలాగే, మ‌హ్మ‌ద్ సిరాజ్ గ్రౌండ్ లోనే ఏడ్చాడు. ఇది కోట్లాది భారత అభిమానుల మనసును కలిచివేసింది.

25
సిరాజ్ ను ఓదార్చిన జో రూట్, బెన్ స్టోక్స్

సిరాజ్ గ్రౌండ్ లో తీవ్రంగా బాధ‌ప‌డుతున్న సమ‌యంలో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ అత‌ని ద‌గ్గ‌ర‌కు వచ్చి కౌగిలించుకుని ఓదార్చారు. అలాగే, ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, మ్యాచ్‌లో నాటౌట్‌గా నిలిచిన రవీంద్ర జడేజాను హత్తుకొని ప్రోత్సహించారు. జడేజా 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, చివరి వరకు భారత జ‌ట్టు విజ‌యం కోసం పోరాడారు.

35
ర‌వీంద్ర జ‌డేజా ఒంట‌రి పోరాటం

ఒక‌వైపు వికెట్లు ప‌డుతుంటే.. మ‌రోవైపు భార‌త‌ జ‌ట్టు విజ‌యం కోసం ర‌వీంద్ర జ‌డేజా చివ‌రి వ‌ర‌కు పోరాడారు. జడేజా 61 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడారు. అయితే, అత‌నికి తోడుగా మిగ‌తా ప్లేయ‌ర్ల నుంచి మ‌ద్ద‌తు ల‌భించ‌లేదు. కేఎల్ రాహుల్ 39 పరుగులు నాక్ ఆడాడు.

ఇంగ్లాండ్ జట్టు తరఫున జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ లు తలా మూడు వికెట్లు తీశారు. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ అయింది. భారత్ ఈ టార్గెట్ ను అందుకోలేక‌పోయింది. 170 ప‌రుగుల‌కు టీమిండియా ఆలౌట్ అయింది.

45
శ్రీనాథ్‌కి 1999లో జరిగిన ఘటన గుర్తు చేసిన సిరాజ్ అవుట్

సిరాజ్ ఔట్ అయిన తీరు గ‌తంలో భార‌త జ‌ట్టుకు ఎదురైన ఘ‌ట‌న‌ల‌ను గుర్తు చేస్తోంది. మ‌రీ ముఖ్యంగా 1999లో ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ vs పాకిస్తాన్ టెస్ట్‌లో జవాగల్ శ్రీనాథ్ ఔట్‌ అయిన సందర్భం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

అప్పట్లో కూడా స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ వేసిన బంతికి శ్రీనాథ్ బౌల్డ్ కావడంతో భారత్ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ రెండు ఘటనల్లోనూ భారత అభిమానుల హృద‌యాలు ప‌గిలాయని చెప్ప‌వ‌చ్చు.

55
భార‌త్-ఇంగ్లాండ్ నాలుగో టెస్ట్ పై ఉత్కంఠ

లార్డ్స్ టెస్టు మ్యాచ్ లో భార‌త్ ఓటమితో ఇంగ్లాండ్ ఈ సీరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. భార‌త్ సిరీస్ ను గెలుచుకోవాలంటే కేవ‌లం నాల్గో టెస్టు మాత్ర‌మే కాకుండా ఐదో టెస్టులో కూడా గెల‌వాలి. నాలుగో టెస్ట్ మ్యాచ్ 2025 జూలై 23న మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది.

భావోద్వేగంతో నిండిన మ్యాచ్

ఈ మ్యాచ్‌లో గెలుపుపై భార‌త్ అభిమానుల ఆశలను జ‌డేజా చివ‌రి వ‌ర‌కు స‌జీవంగా ఉంచాడు. కానీ, చివరికి ఓటమితో తీవ్ర నిరాశ‌ను పంచారు. ప్రత్యేకంగా సిరాజ్ భావోద్వేగంతో ఏడ్చిన దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయినా జడేజా, బుమ్రా, సిరాజ్ గెలుపు కోసం పోరాడిన తీరుపై పలువురు క్రికెట్ ప్రేమికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories