IND vs ENG Highlights : లార్డ్స్‌లో గెలుపు ముంగిట ఓడిన భారత్

Published : Jul 14, 2025, 10:11 PM IST

IND vs ENG: లార్డ్స్ టెస్ట్‌లో భారత్‌ 193 పరుగుల టార్గెట్ ను అందుకోలేకపోయింది. జాడేజా పోరాటం చేసినా.. చివరకు 23 పరుగుల తేడాతో ఓడిపోయింది.

PREV
15
లార్డ్స్ టెస్ట్‌లో భారత్‌కు నిరాశ

IND vs ENG Highlights : లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరిగిన మూడవ టెస్టులో భారత్ నాలుగు రోజుల పాటు ఆధిపత్యం చూపినప్పటికీ, చివరి రోజు ఇంగ్లాండ్ చేతిలో 23 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇది ఇంగ్లాండ్‌కు రెండో విజయం కావడంతో సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించింది.

25
మొదటి నుంచి భారత్ దే పై చేయి కానీ..

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్‌కు దిగింది. భారత బౌలర్లు బుమ్రా (5 వికెట్లు), సిరాజ్ (2 వికెట్లు), నితీష్ రెడ్డి (2 వికెట్లు) ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 387 పరుగులకు కట్టడి చేశారు. జో రూట్ 104 పరుగులతో సెంచరీ కొట్టాడు. కార్స్ 56, జెమీ స్మిత్ 51, బెన్ స్టోక్స్ 44 పరుగులు చేశారు.

కేఎల్ రాహుల్ సెంచరీ.. పంత్-జడేజా హాఫ్ సెంచరీలు

భారత తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ స్కోర్ ను సమం చేసింది. కేఎల్ రాహుల్ 100, పంత్ 74, జడేజా 72 పరుగులతో మెరిశారు. చివరకు భారత్ ఇంగ్లాండ్ స్కోర్‌కు సమానంగా 387 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీసుకున్నాడు.

35
భారత్ రెండవ ఇన్నింగ్స్‌లో విఫలమైంది

ఇంగ్లాండ్ రెండవ ఇన్నింగ్స్‌లో 192 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వాషింగ్టన్ సుందర్ (4 వికెట్లు), బుమ్రా, సిరాజ్ (తలో 2 వికెట్లు) చక్కటి ప్రదర్శన కనబరిచారు. భారత్‌కు 193 పరుగుల లక్ష్యం ఉంచింది. అయితే భారత్ రెండవ ఇన్నింగ్స్ లో రాణించలేకపోయింది. 

కేవలం 170 పరుగులకే కుప్పకూలింది. జడేజా 61 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. కానీ, అతనికి ఇతర ప్లేయర్ల మద్దతు లభించకపోవడంతో భారత్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.

45
రవీంద్ర జడేజా ఒంటరి పోరాటం

జడేజా చివరివరకు నిలబడి భారత్ విజయం కోసం ధైర్యంగా పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ, అతనికి ఇతర ప్లేయర్ల నుంచి మద్దతు లభించలేదు. బుమ్రా 54 బంతులు ఆడి 5 పరుగులు చేశాడు..

ఈ సమయంలో జడేజా భారత్ ను గెలుపు వైపు తీసుకొచ్చాడు. భారత్‌ గెలుపు పై ఈ జోడీ ఆశలు పెంచింది. కానీ, చివరకు సిరాజ్ షోయబ్ బషీర్ బౌలింగ్‌ లో అవుట్ కావడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.

55
సిరీస్‌లో 2-1తో ముందున్న ఇంగ్లాండ్

ఈ మ్యాచ్‌ గెలుపు తో ఇంగ్లాండ్ ఐదు టెస్టుల సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. నాలుగవ టెస్ట్ జూలై 23 నుండి మాంచెస్టర్‌లో ప్రారంభం కానుంది. భారత జట్టు తిరిగి పుంజుకోవాలంటే అద్భుత ప్రదర్శనలు రావాలి.

భారత్ రెండో ఇన్నింగ్స్ లో 170 ఆలౌట్

కేఎల్ రాహుల్ 39 పరుగులు, రవీంద్ర జడేజా 61 పరుగులు నాటౌట్ ఇన్నింగ్స్ లు ఆడాడు. మిగతా ప్లేయర్లు చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ 3, బెన్ స్టోక్స్ 3 వికెట్లు పడగొట్టారు. కార్స్ కు రెండు వికెట్లు దక్కాయి. క్రిస్ వోక్స్, షోయబ్ బషీర్ చెరో ఒక వికెట్ పడగొట్టారు.

Read more Photos on
click me!

Recommended Stories