Jofra Archer: ఇదెక్కడి మాస్ రా మామా.. 140 కిలోమీటర్ల వేగంతో విసిరి.. అదే బాల్ ను క్యాచ్ పట్టాడు !

Published : Jul 14, 2025, 09:14 PM IST

Jofra Archer: లార్డ్స్ టెస్టులో జోఫ్రా ఆర్చర్ స్పెషల్ షో కనిపించింది. అతని బౌలింగ్ దెబ్బకు రిషబ్ పంత్ వికెట్ గాల్లో హెలికాప్టర్ లా చక్కర్లు కొట్టింది. అలాగే, 140 కిలో మీటర్ల వేగంతో విసిరి.. అదే బాల్ ను క్యాచ్ పట్టాడు.

PREV
15
లార్డ్స్ టెస్టు ఐదో రోజు ఇంగ్లాండ్ జోరు

లార్డ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ ఐదో రోజు ఆట ఆరంభం నుంచి ఇంగ్లాండ్ జోరు కొనసాగింది. బౌలింగ్, ఫీల్డింగ్ లో అదరగొట్టింది. ఇదే సమయంలో భారత్ పోరాటం అద్భుతంగా నిలిచింది. 

అలాగే, ఇంగ్లాండ్ ప్లేయర్లు నడుచుకున్న తీరు కూడా వివాదాస్పదమవుతోంది. ఇంగ్లాండ్ పైచేయి దిశగా అధిపత్యం చూపించింది. కానీ, చివరలో రవీంద్ర జడేజా బెన్స్ స్టోక్స్ జట్టుకు చేమటలు పట్టించాడు. మ్యాచ్ ను ఉత్కంఠగా మార్చాడు.

అయితే, చివరి రోజు ప్రారంభంలోనే ఇంగ్లాండ్ మూడు కీలక వికెట్లు తీసి భారత జట్టును ఒత్తిడిలోకి నెట్టింది. ముఖ్యంగా జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్, ఫీల్డింగ్ ప్రదర్శన అదిరిపోయింది

25
జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్ లో రిషబ్ పంత్ క్లీన్ బౌల్డ్

ఐదో రోజు ఆటను భారత్ 58/4 పరుగులతో ప్రారంభించింది. భారత్ విజయానికి ఇంకా 135 పరుగులు అవసరమైన సమయంలో జోఫ్రా ఆర్చర్ అద్భుతమైన డెలివరీతో రిషబ్ పంత్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. పంత్ వికెట్ గాల్లో గిరగిర తిరుగుతూ ఎగిరిపడింది. ఇది మ్యాచ్‌లో భారత్‌కు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.

35
ఒకచేతితో అద్భుతమైన క్యాచ్.. వాషింగ్టన్ సుందర్‌ కు షాక్ ఇచ్చిన జోఫ్రా ఆర్చర్

జోఫ్రా ఆర్చర్ రిషబ్ పంత్ వికెట్ తో పాటు వాషింగ్టన్ సుందర్ వికెట్ ను కూడా తీసుకున్నాడు. ఫుల్ లెంగ్త్ బాల్‌ వేసి సుందర్ ను బోల్తా కొట్టించాడు. 140 కిలో మీటర్ల వేగంతో విసిరి.. అదే బాల్ ను క్యాచ్ పట్టాడు.

ఫాలో త్రో సమయంలో కుడి వైపు డైవ్‌ చేస్తూ ఒక చేతితో అద్భుత క్యాచ్ పట్టాడు. సుందర్ ఒక్కో బంతి మాత్రమే ఆడి డక్ అయ్యాడు. ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

45
నాల్గో రోజు స్టంప్స్ తర్వాత వాషింగ్టన్ సుందర్ వ్యాఖ్యలు వైరల్

నాల్గో రోజు ఆట ముగిసిన తర్వాత వాషింగ్టన్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయిన గెలిచే మాత్రం టీమిండియానే అన్నారు. చివరి రోజు భారత్ విజయం అందుకుంటుందని వ్యాఖ్యానించాడు. కానీ దురదృష్టవశాత్తు, అయిదో రోజు ఉదయం 4 బంతులకే అవుట్ కావడం అతని ఆత్మవిశ్వాసంపై దెబ్బ పడిందని చెప్పాలి.

55
మహ్మద్ సిరాజ్ కు జరిమానా

భారత పేసర్ మహ్మద్ సిరాజ్ కు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) జరిమానా విధిస్తూ షాక్ ఇచ్చింది. ఐసీసీ ప్రకారం, నాల్గవ రోజు ఆరవ ఓవర్‌లో బెన్ డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత ఉత్సాహంగా అతనికి దగ్గరగా చేరి సంబరాలు చేసుకున్నాడు. 

అతని తీరు నిబంధనలకు విరుద్ధం కావడంతో మ్యాచ్ ఫీజు 15 శాతం సిరాజ్ కు ఐసీసీ జరిమానా విధించారు. అలాగే, ఒక డీమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. సంబరాల సమయంలో భుజం తాకడం పూర్తిగా అనుకోకుండా జరిగిందనీ, ఇది శిక్షార్హం కాదని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ ఆథర్టన్ పేర్కొనడం గమనార్హం.

Read more Photos on
click me!

Recommended Stories