IPL: ఐపీఎల్‌లో వేగంగా 150 వికెట్లు తీసిన బౌలర్‌గా హర్షల్ పటేల్ రికార్డు

Published : May 20, 2025, 06:58 PM IST

fastest to 150 IPL wickets: హర్షల్ పటేల్ ఐపీఎల్‌లో కేవలం 2,381 బంతుల్లోనే 150 వికెట్లు తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్ హిస్టరీలో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసుకున్న బౌలర్ గా హర్షల్ పటేల్ రికార్డు సాధించాడు. 

PREV
15
ఐపీఎల్ లో అత్యంత వేగంగా 150 వికెట్లు తీసిన హర్షల్ పటేల్

fastest to 150 IPL wickets: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ హర్షల్ పటేల్ మరో ముఖ్యమైన మైలురాయిని అధిగమించాడు. లక్నో ఎకానా స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 61 మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్‌పై హర్షల్ తన 150వ ఐపీఎల్ వికెట్‌ను సాధించాడు. బౌలింగ్ చేసిన బంతుల పరంగా ఈ మైలురాయిని అత్యంత వేగంగా చేరిన బౌలర్‌గా హర్షల్ పటేల్ రికార్డు సృష్టించాడు.

25
హర్షల్ పటేల్ 150వ వికెట్ గా ఐడెన్ మార్క్రామ్

ఈ మ్యాచ్‌లో హర్షల్ తన ఒకే ఒక వికెట్‌గా ఐడెన్ మార్క్రామ్ ను అద్భుతమైన స్లో డెలివరీతో అవుట్ చేశాడు. అదే అతని 150వ వికెట్‌గా నిలిచింది. మొత్తం 2,381 బంతుల్లోనే ఈ ఘనతను సాధించాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం లాసిత్ మలింగ (2,444 బంతులు) రికార్డును బ్రేక్ చేశాడు.

35
IPL 150 వికెట్లు: మ్యాచ్‌ల పరంగా లసిత్ మలింగా తర్వాత హర్షల్ పటేల్

హర్షల్ 117 మ్యాచ్‌లు (114 ఇన్నింగ్స్)లో ఈ ఘనత సాధించి ఐపీఎల్ చరిత్రలో 150 ప్లస్ వికెట్లు తీసిన 13వ బౌలర్‌గా నిలిచాడు. హర్షల్ పటేల్ కంటే ముందు యుజ్వేంద్ర చాహల్ (2,543 బంతులు), డ్వేన్ బ్రావో (2,656 బంతులు), జస్ప్రీత్ బుమ్రా (2,832 బంతులు) 150 వికెట్లు తీసుకున్న వేగవంతమైన టాప్ 5 బౌలర్లుగా ఉన్నారు. అయితే, మ్యాచ్‌ల పరంగా లసిత్ మలింగా (105 మ్యాచ్‌లు) వేగంగా 150 వికెట్లు తీసుకున్నాడు. హర్షల్ పటేల్ 117 మ్యాచ్ లతో రికార్డును సాధించి రెండవ స్థానంలో ఉన్నాడు.

45
బెంగళూరు జట్టు నుంచి హర్షల్ పటేల్ ఐపీఎల్‌ ఎంట్రీ

హర్షల్ పటేల్ 2012లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2018 నుంచి 2020 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడిన అతను 2021లో తిరిగి ఆర్సీబీలో చేరాడు. 2023 తర్వాత ఆర్సీబీ అతన్ని విడుదల చేయగా, పంజాబ్ కింగ్స్ రూ.11.75 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఆ తర్వాత 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అతన్ని రూ. 8 కోట్లకు దక్కించుకుంది.

2024 సీజన్‌లో హర్షల్ పటేల్ 16 వికెట్లను డెత్ ఓవర్లలో తీసుకున్నాడు. ఈ సమయంలో అతని ఎకానమీ 10.38గా నమోదైంది. మొత్తం సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌లలో మాత్రమే అతను వికెట్లను తీయలేకపోయాడు.

55
ఐపీఎల్‌లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న హర్షల్ పటేల్

హర్షల్ ఐపీఎల్‌లో రెండు సార్లు పర్పుల్ క్యాప్ గెలుచుకున్న రెండో భారతీయ బౌలర్ గా ఘనత సాధించాడు. అతను 2021లో 32 వికెట్లు తీసి డ్వేన్ బ్రావో రికార్డును సమం చేయగా, 2024లో మళ్లీ అత్యధిక వికెట్లు తీసి ఈ ఘనత సాధించాడు. హర్షల్ పటేల్ స్లో బంతులు, డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా ప్రత్యేక గుర్తింపు సాధించాడు.

ఇప్పటి వరకు ఐపీఎల్ 2025లో హర్షల్ 11 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీసినప్పటికీ, అతని ఎకానమీ రేటు 9.73గా ఉంది. లక్నోతో జరిగిన తాజా మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చాడు.

Read more Photos on
click me!

Recommended Stories