IPL 2025 playoff race: ఒక్క బెర్తు కోసం మూడు టీమ్స్ పోటీ.. ప్లేఆఫ్స్ 4వ స్థానం దక్కేది ఎవరికి?

Published : May 19, 2025, 03:20 PM ISTUpdated : May 19, 2025, 03:22 PM IST

IPL 2025 playoff race: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించాయి. చివరి బెర్త్ కోసం ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్  పోటీ పడుతున్నాయి.

PREV
15
ఒక్క బెర్త్ కోసం ప్లేఆఫ్స్‌కు మూడు జట్లు పోటీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 రసవత్తరంగా మారింది. అదరిపోయే ట్విస్ట్ లతో మూడు ప్లేఆఫ్స్ బెర్త్ లు కన్ఫార్మ్ అయ్యాయి. ఐఫీఎల్ 2025 ప్లేఆఫ్స్ లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్  లు అర్హత సాధించాయి. 

గుజరాత్ టైటాన్స్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను 10 వికెట్ల తేడాతో ఓడించిన తర్వాత వారి అర్హత ఖరారైంది. సాయి సుదర్శన్(108*) & శుభ్‌మన్ గిల్ (93*) అద్భుత ఇన్నింగ్స్ తో లతో అదరగొట్టారు. గుజరాత్ గెలుపుతో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ కూడా ప్లేఆఫ్స్‌కు చేరాయి. ఇంకా ఒక్క బెర్త్ మాత్రమే మిగిలి వుంది. లక్నో, ముంబై, ఢిల్లీ టీమ్ లు 4వ స్థానం కోసం పోటీ పడుతున్నాయి. 

25
IPL 2025: ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి?

ముంబై ఇండియన్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. 12 మ్యాచ్‌ల్లో 7 విజయాలు, 5 ఓటములతో 14 పాయింట్లు సాధించింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని జట్టు తొలి ఐదు మ్యాచ్‌ల్లో ఒక విజయం మాత్రమే సాధించింది. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచింది. ప్రస్తుతం, MI నాల్గవ స్థానంలో ఉండటంతో ప్లేఆఫ్స్ చివరి బెర్త్ దక్కించుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌లను గెలవాలి.

35
IPL 2025: ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి?
గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్ అవకాశాలు దెబ్బతిన్నాయి. ప్రస్తుతం 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 5 ఓటములు, 1 రద్దుతో 13 పాయింట్లతో ఐదవ స్థానంలో ఉంది. అక్షర్ పటేల్ నేతృత్వంలోని జట్టు తొలి నాలుగు మ్యాచ్‌లు గెలిచింది. ఆ తర్వాత ఆరు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ తదుపరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉంది.
45
IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు ఎలా ఉన్నాయి?

లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ రేసులో ఉంది. రిషభ్ పంత్ నేతృత్వంలోని జట్టు ప్రస్తుతం 5 విజయాలు, 6 ఓటములతో 10 పాయింట్లతో ఏడవ స్థానంలో ఉంది. గత ఐదు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్ మాత్రమే గెలిచింది. వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయింది. లక్నో తమ మిగిలిన మ్యాచ్‌లను గెలిస్తే ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉంటాయి. ఈ టీమ్ కు రన్ రేటు కీలకం కానుంది. 

55
IPL 2025 ప్లేఆఫ్స్: నాల్గవ స్థానం ఎవరికి దక్కనుంది?

ప్రస్తుత ఫామ్ & పాయింట్ల ప్రకారం, ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలవడం వల్ల పాయింట్ల పట్టికలో బలమైన స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌లు గెలిస్తే, ఐదుసార్లు ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ నాల్గవ ప్లేఆఫ్ స్థానాన్ని దక్కించుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా పోటీలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌కు అవకాశాలు తక్కువగా ఉన్నాయి.

Read more Photos on
click me!

Recommended Stories