సౌరవ్ గంగూలీ.. భారత క్రికెట్ చరిత్రను మార్చిన పేరు. ఆయన బ్యాటింగ్‌లో ఆత్మవిశ్వాసం, నాయకత్వంలో ధైర్యం, జట్టులో కొత్త ప్రాణం పోసిన గొప్ప కెప్టెన్. క్రికెట్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న గంగూలీ పుట్టిన రోజు నేడు.
వరుసగా నాలుగు వన్డే మ్యాచుల్లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు పొందిన ఏకైక క్రికెటర్ గంగూలీ. ఇది వన్డే క్రికెట్‌లో సాధించిన అరుదైన ఘనత. వరుసగా 4 మ్యాచ్‌ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలవడం చాలా అరుదు. ఇది దాదాకు మాత్రమే సొంతం.
26
భారత క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన లెఫ్ట్ హ్యాండర్
భారత క్రికెట్‌లో తనదైన శైలితో 11,363 పరుగులు చేసి టాప్ లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు గంగూలీ. అంతర్జాతీయంగా సంగక్కర, జయసూర్య తర్వాత మూడవ స్థానంలో ఉన్నాడు.
బౌలింగ్‌లో కూడా
బ్యాటింగ్‌నే కాదు.. బౌలింగ్ అస్త్రంగా కూడా దాదా ఉపయోగపడ్డాడు. వన్డేల్లో 10,000కి పైగా పరుగులు, 100కి పైగా వికెట్లు తీసిన అరుదైన 6 మందిలో గంగూలీ ఒకడు. అలాంటి ఆల్‌రౌండ్ పర్ఫార్మెన్స్ చేయగల కెప్టెన్లలో దాదా ముందు వరుసలో ఉంటాడు.
36
వరుసగా 1000కిపైగా పరుగులు
1997 నుంచి 2000 వరకు వరుసగా నాలుగు క్యాలెండర్ సంవత్సరాల్లో 1000 కన్నా ఎక్కువ పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గంగూలీ.
ఐసీసీ ఫైనల్‌లో సెంచరీ చేసిన ఏకైక భారత బ్యాట్స్‌మన్
గంగూలీకి పెద్ద మ్యాచ్‌ల్లో మెరుపులు మెరిపించడం అలవాటు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్‌లో సెంచరీ బాదిన ఏకైక భారతీయ ఆటగాడు కూడా ఆయనే. అదే సమయంలో ICC నాకౌట్ స్టేజ్‌లో మూడు సెంచరీలు చేసిన ప్రపంచంలో మూడు మంది బ్యాట్స్‌మెన్లలో దాదా ఒకరు. మిగిలిన ఇద్దరు పాంటింగ్, సయీద్ అన్వర్.
విదేశాల్లో 18 వన్డే సెంచరీలు
గంగూలీ తన వన్డే సెంచరీల్లో ఎక్కువ విదేశాల్లో సాధించినవి ఉన్నాయి. మొత్తం 22 సెంచరీల్లో 18 విదేశాల్లోనే బాదాడు. గంగూలీ సెంచరీ చేసిన చాలా మ్యాచుల్లో భారత్ విజయం సాధించింది. ఇలా విదేశాల్లో టీమిండియా గెలుపునకు గంగూలీ కారణమయ్యాడు.
56
ఆస్ట్రేలియాలో వన్డే సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడు
గంగూలీ, ఆస్ట్రేలియాలో వన్డే సెంచరీ చేసిన తొలి భారతీయుడు. అక్కడి పిచ్‌ల మీద సెంచరీ చేయడం కష్టంగా భావించిన రోజుల్లో ఆ ఘనతను గంగూలీ 90లలోనే సాధించటం విశేషం.
66
హ్యాపీ బర్త్‌డే దాదా
దాదా అంటే అందరినీ నడిపించగల సామర్థ్యం.. ఆటలో చొరవ, ఆటగాళ్లలో ధైర్యం నింపిన నాయకత్వం. భారత క్రికెట్‌ను భవిష్యత్ విజయాల దిశగా మలుపు తిప్పిన సౌరవ్ గంగూలీ పేరు క్రికెట్ ఉన్నన్ని రోజులు మారుమోగుతూనే ఉంటుంది. నేడు గంగూలీ పుట్టిన రోజు సందర్భంగా మనం కూడా దాదాకు విషెస్ చెబుదాం.