మహేంద్రసింగ్ ధోనీ.. ఈ పేరే ఓ అద్భుతం. క్రికెట్ అభిమానులకు తారకమాత్రం. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న ధోనీ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ ఆసక్తికర కథనం మీకోసం..
గ్రౌండ్‌లో హెలికాప్టర్ షాట్స్‌తో రచ్చ చేసే ధోనీకి కార్లు, బైకులు అంటే పిచ్చి. వీటి కోసం ప్రత్యేకంగా ఓ గ్యారేజీనే నిర్మించుకున్నాడంటే ధోనీకి వీటిపై ఉన్న ఆసక్తి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ]
ఆయన దగ్గర దాదాపు 70కి పైగా బైకులు, 15 లగ్జరీ కార్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 15 కోట్లు పైమాటే. ధోనీ కలెక్టివ్‌లో సూపర్ కార్ల నుంచి అరుదైన బైకుల దాకా అన్నీ కనిపిస్తాయి. వాటిలో కొన్నింటి గురించి.
26
హార్లీ డేవిడ్సన్ ఫాట్ బాబ్
అమెరికన్ క్లాసిక్ బైక్ అయిన ఫాట్ బాబ్, ధోనీ ఫెవరేట్ బైక్స్‌లో ఒకటి. శక్తివంతమైన ఇంజిన్, మస్కులార్ లుక్ కలిగిన ఈ బైక్ రోడ్డుపై రయ్యిమని దూసుకుపోతుంది. దీని ధర సుమారు రూ. 14 లక్షలకుపైమాటే.
36
హమ్మర్ H2
ధోనీ గ్యారేజీలో ఉన్న మరో సూపర్ కారు హమ్మర్ హెచ్2. ఈ హమ్మర్ SUV మిలిటరీ స్టైల్ డిజైన్‌లో ఉంటుంది. భారత్‌లో ఈ కారు ధర సుమారు రూ. 70 లక్షలకుపైమాటే.
ఈ హైపర్ బైక్ ఏకంగా 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలదు. అప్పుడప్పుడు ధోనీ రోడ్లపై ఈ బైక్‌తో కనిపించిన సంఘటనలు చూసే ఉంటాం. ఇది ధోనీ స్పీడ్ అభిరుచికి నిదర్శనంగా నిలుస్తోంది. పవర్, డిజైన్, వేగం అన్నింటినీ కలిపిన అరుదైన బైక్ ఇది. ఈ బైక్ ధర రూ. 23 లక్షలుగా ఉంది.
56
కాన్ఫెడరేట్ X132 హెల్‌క్యాట్
ప్రపంచంలో అత్యంత అరుదైన బైక్స్‌లలో ఇదీ ఒకటి. ప్రపంచంలో కేవలం 150 యూనిట్లే ఉండడం విశేషం. దీనిబట్టే ధోనీకి బైక్స్‌పై ఉండే పిచ్చి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఈ బైక్ ధర సుమారు రూ. 50 లక్షలకు పైమాటే.
66
ఫెరారీ 599 జిటీవో
ఇటలీకి చెందిన ఈ స్పోర్ట్స్ కార్, ధోనీ గ్యారేజ్‌లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. శక్తివంతమైన ఇంజిన్, ఆకర్షణీయమైన డిజైన్ కలగలిసి ధోనీ అభిరుచికి అద్ధం పడుతుందీ కారు. దీని ధర అక్షరాల రూ. 6 కోట్లు కావడం విశేషం.