ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసింది. కెప్టెన్ శుభ్ మన్ గిల్ (269 పరుగులు), రవీంద్ర జడేజా (89 పరుగులు), యశస్వి జైస్వాల్ (87 పరుగులు) రాణించారు.
ఇంగ్లాండ్ 407 పరుగులకే ఆలౌట్ అయ్యింది. జేమీ స్మిత్ (184* పరుగులు), హ్యారీ బ్రూక్ (158 పరుగులు) ఇంగ్లాండ్ బ్యాటింగ్ భారాన్ని మోశారు. భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది.
భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 427 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. గిల్ 161 పరుగులు, జడేజా 69 పరుగులు నాటౌట్, పంత్ 65 పరుగులు, కేఎల్ రాహుల్ 55 పరుగులతో రాణించారు.
దీంతో భారత్ ఇంగ్లాండ్‌కు 608 పరుగుల లక్ష్యం ఉంచింది. ఛేదనలో 271 పరుగులకే ఇంగ్లాండ్ కుప్పకూలింది. జేమీ స్మిత్ 88 పరుగులతో పోరాడినా ఫలితం దక్కలేదు. భారత బౌలింగ్‌లో ఆకాష్ దీప్ 6 వికెట్లు పడగొట్టాడు.